గుండెపోటుతో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు తిరుమలయ్య మృతి

గుండెపోటుతో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు తిరుమలయ్య మృతి
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో మజి సింగల్ విండో అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నేత నందిమల్ల తిరుమలయ్య గుండెపోటుతో శుక్రవారం ఉదయం మరణించాడని మృతుని కుమారుడు నందిమల్ల అశోక్ తెలిపారు వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చీర్ల సత్యం సామాజికవేత్త డాక్టర్ పోచ రవీందర్ రెడ్డి బీ ఆర్ ఎస్ నేత రహిమాన్ నందిమల్ల గణేష్ పలువురు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు మృతుని కుటుంబ న్ని పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి…

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి

అభివృద్ధి చేసేవారిని కౌన్సిలర్లు గా ఎన్నుకోవాలి

తెలుగుదేశం పార్టీ నేత గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో వివేకానం చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొల్లాపూర్ రోడ్డు మహబూబ్ నగర్ రోడ్డు లో ఇరుకు రోడ్లతో ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని పెండింగులో ఉన్నా వనపర్తి లో రోడ్ల వెడల్పు విస్తరణ పనులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీనేత శంకర్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మేగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఒక ప్రకటన లో కోరారు వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా కొందరు ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలొ రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేశారని అన్నారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని శంకర్ తెలిపారు వనపర్తి పట్టణ ప్రజలు పాలకులను గమనిస్తూన్నారని గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ అశ్వని దామోదర్ ను వనపర్తి పట్టణ ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్లు గా వార్డులను అభివృద్ధి ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారని ఎన్ను కోవాలని ప్రజలను కోరారు వనపర్తి పట్టణ ప్రజలు ఆలోచనలు చేసుకొని ఓట్లు వేసి మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల గా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version