స్మశాన వాటిక సాధన కోసం సంతకాల సేకరణ
మందమర్రి నేటి ధాత్రి
యాపల్, అంగడి బజార్ పాత బస్టాండ్ లో వెయ్యికి పైగా సంతకాలు సేకరణ!
మంచిర్యాల జిల్లా,మందమర్రి: పట్టణంలోని యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య అయిన స్మశాన వాటిక లేమిపై ‘స్మశాన వాటిక సాధన కమిటీ’ బుధవారం రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ప్రాంతంలో స్మశానం లేకపోవడం వల్ల దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని తెలిపారు
ఏడు దశాబ్దాల సమస్య
యాపల్ అంగడి బజార్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల ప్రజలు గత సుమారు 70 సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేకేటు ప్రాంతం వద్ద ఉన్న స్థలాన్ని స్మశాన వాటిక కోసం ఉపయోగించారు. అయితే, ఇటీవల ఆ స్థలం కూడా కబ్జాకు గురి కావడంతో సమస్య మరింత జటిలమైంది.
వెయ్యికి పైగా సంతకాలు సేకరణ
ప్రజలు ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్మశాన వాటిక సాధన. కమిటీ సభ్యులు వాడవాడలా తిరిగి, పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000కి పైగా సంతకాలను స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఎమ్మార్వో కార్యాలయంలో వినతి
సేకరించిన ఈ సంతకాలను ఎం.ఆర్.వో కార్యాలయంలో అందజేసి, సమస్య తీవ్రతను తెలియజేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, ప్రజల నుంచి విస్తృత మద్దతు పొందారు. స్మశాన వాటిక కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్మశాన వాటిక సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
