ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల సమస్యలు వెంటనే పరిష్కరించాలీ.

ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల సమస్యలు వెంటనే పరిష్కరించాలీ.

ప్రస్తుతం ఉన్న హాస్టల్ వార్డెన్ సమ్మయ్య నీ వెంటనే సస్పెండ్ చేయాలి.

లేడి వార్డెన్ ను వెంటనే నియమించాలి.

కుమ్మరి రాజ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గర్ల్స్ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని వెళ్లిన ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని అడ్డుకున్న హాస్టల్ వార్డెన్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని హాస్టల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ విద్యార్థినిలు గత నాలుగు రోజుల నుంచి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి హాస్టల్లో ఉంది అందులో పని చేసే వర్కర్స్ వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని వారు సమ్మెలోకి దిగడం జరిగింది. దీనిద్వారా హాస్టల్లో చదువుకునే విద్యార్థినిలకు అనేకమైన సమస్యలు భోజనం వండుకోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తక్షణమే హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని దాంతోపాటు వర్కర్స్ యొక్క న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విద్యార్థినిల సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. గర్ల్స్ హాస్టల్ అయినప్పటికీ ఆ హాస్టల్ కి లేడి వార్డెన్ లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకునే పరిస్థితి లేదు తక్షణమే ప్రస్తుతం ఉన్న వార్డెన్ సమ్మయ్య సార్ నీ సస్పెండ్ చేసి లేడీ వార్డెన్ ను వెంటనే నియమించాలిఅని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది

పాఠశాల ఆవరణలో వర్షపు నీరు…

పాఠశాల ఆవరణలో వర్షపు నీరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు వర్షపు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది.
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి పడిన వర్షనికీ పాఠశాలలో ఆవరణలో చేరిన వర్షపు నీరు.విద్యార్థులు పాఠశాల గదులకు వెళ్ళటానికి,పాఠశాల నుండి బయటకు వెళ్లడానికి విద్యార్థిలకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో మన ఊరి మనబడి లో ఎన్నో నిధులతో పనులు చేశారు.పాఠశాల ఆవరణలో మట్టి వేసి ఎత్తుగా చేయడం లేదు,
కానీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు చింతిస్తున్నారు.ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్య ను పరిష్కరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version