మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి…

మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి

మాదన్నపేట రోడ్డుపై ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మానం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత హై లెవెల్ వంతెనను నిర్మించాలని నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటి సభ్యురాలు వంగాల రాగసుధ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధానదారిపై రాస్తారోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.నర్సంపేట నుంచి మాదన్నపేటకు వైపు వెళ్లే ప్రధాన రహదారి నిర్వీర్యమై ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ రోడ్డుపై నిత్యం మాదన్నపేట,నాగూర్లపల్లె, బాజీపేట చంద్రయ్యపల్లె నల్లబెల్లి వరకు అలాగే సుమారు 10 తండాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారని పేర్కొన్నారు.రోడ్డు వెడల్పు పేరుతో ప్రస్తుతం ఉన్న దారిని చెడగొట్టి రోడ్డు వేస్తామని తారు తీసివేసి అనేక నెలలు గడుస్తున్నా నేటికీ పునర్నిర్మాణం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆరోపించారు.గత రెండు రోజులుగా కురిసిన తుఫానుతో పంటలు కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలకు రైతులను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కర్నే సాంబయ్య పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి , జన్ను అనిల్,గణిపాక బాబు,పద్మ, విజయ,అరుణ, కోమల,అజయ్,
రామకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేకల లక్ష్మణ్,
ఉపాధ్యక్షులు తనుగుల అంజి, కార్యదర్శి ఆరేల్లి శివ,రమేష్,ప్రభాకర్ అఫ్జల్,జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version