కేసముద్రంలో ప్రమాదకర కరెంటు స్తంభాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-84.wav?_=1

ప్రమాదకరంగా కరెంటు స్తంభాలు

గట్టిగా గాలి వీస్తే…! నేల కూలెన్…?

ఎవరిని బలికొంటాయో…? ఈ విద్యుత్ స్తంభాలు

విద్యుత్ అధికారులు దృష్టి సారించాలంటున్న ప్రజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపల్ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో అనేక వీధులలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో నెలకొని ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం విద్యుత్ స్తంభాలు నిర్మాణం జరిగిందని అప్పటినుంచి నేటి వరకు విద్యుత్ స్తంభాల నిర్మాణం చేపట్టకపోవడంతో, ఏళ్ల తరబడి తీగల బరువు భరిస్తున్న విద్యుత్ స్తంభాలు ఇక మేము భరించలేమంటున్నట్టు దృశ్యం కనబడుతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.స్తంభం మొదలులో సిమెంట్ కాంక్రీట్ పూర్తిగా దెబ్బతిని ఇనుప చూవలు బయటకు తేలి తుప్పు పట్టి ప్రమాదకరస్థాయిలో ప్రజలకు హెచ్చరిస్తున్నట్టు ప్రతిబింబిస్తున్నాయి, అసలే వర్షాకాలం గట్టిగా గాలివాన వేస్తే ఎవరి ఇంటి మీద పడతాయో ఎవరి ప్రాణాలు బలి కొంటాయో అని సమీపంలోని నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఒకటి రెండు కాదు రజక బజార్ మున్నూరు కాపు బజార్ లలో కరెంటు స్తంభాల పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.

Dangerous Power Poles

దీనికి తోడు సిటీ కేబుల్ యజమానులు ఇష్టా రీతిగా కేబుల్ వైర్లను స్తంభాలకు బిగించి లాగడంతో ఎటు విద్యుత్ సరఫరా వైర్లు అటు కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్లు భారం పడడంతో విద్యుత్ స్తంభాలు పూర్తిగా వంగి ప్రమాదకరంగా కనబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తొలగించి అదే స్థానంలో కొత్త కరెంటు పోల్స్ ను నెలకొల్పాలని కేసముద్రం రజక బజార్, మున్నూరు కాపు బజార్ ప్రజలు కోరుకుంటున్నారు.

మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-74-1.wav?_=2

రామాయంపేట మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణ మూడవ వార్డులోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి శారద ఫంక్షన్ హాల్ వరకు మురుగు నీరు పారడానికి తగిన మోరీలు,సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో కొద్ది ఇండ్లు మాత్రమే ఉండడంతో చిన్న చిన్న మోరీలు నిర్మించగా,ప్రస్తుతం ఈ ప్రాంతంలో గృహ నిర్మాణాలు భారీగా పెరగడంతో పాత మోరీలు సరిపోవడం లేదు.దీంతో మురికి నీరు వీధుల్లో నిల్వ అవుతూ దోమల వృద్ధి,దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Sharada function hall.

అదనంగా రాత్రిపూట లైట్లు లేకపోవడం,చెత్త బండి ప్రతి రోజు రాకపోవడం వల్ల చెత్త పేరుకుపోతూ సమస్య మరింత తీవ్రంగా మారింది.ఈ పరిస్థితిని తక్షణమే అధికారులు గమనించి మురుగు నీటి పారుదల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో హస్నోద్దీన్, జమీర్,సల్మాన్,ఆరిఫ్, సయ్యద్,మొయిన్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో డీ ఎల్ పి ఓ కార్యాలయం జడ ఎక్కడ…

జహీరాబాద్ లో డీ ఎల్ పి ఓ కార్యాలయం జడ ఎక్కడ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్రము ఏర్పడి దాదాపు 11 సంవత్సరాల పూర్తి అయి డివిజన్ లు ఏర్పడి అన్ని డివిజల్ కార్యాలయాలు ఏర్పడినప్పటికి పంచాయతీ రాజ్ మరియు రూరల్ డిపార్ట్మెంట్ నుండి మాత్రం ఇప్పటి వరకు డి ఎల్ పి ఓ కార్యాలయం నేటికీ లేకపోవడం అందరికి విస్మయానికి గురించేస్తుంది.. సంబంధిత డి ఎల్ పి ఓ కి పెన్ గన్ న్యూస్ ప్రతినిధి వివరణ అడిగిన ఎమ్ పట్టనట్టు గా వేవహరిస్తుంది..

 

సంబంధిత అధికారి జహీరాబాద్ లో ఉండకపోవడం వలన గ్రామాలలో పర్యవేక్షణ లేకపోవడం వలన గ్రామాలలో చెత్త చెదారం పెరుకపోవడం,డంపింగ్ యార్డ్ తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ లేకపోవడం, వైకుంఠ దామలు ఉపయోగంలోకి రాకపోవడం ఇలా ఎన్నో సమస్యలు గ్రామాలలో పేరుకుపోవడం వలన ప్రజలు అనారోగ్యలకు గురి కావడం జరుగుతుంది.. అంతే కాకుండా సంగారెడ్డి కి ఎంతో దూరంగా ఉన్న గ్రామలు అనేకం… రాయికోడ్ మండలంలోని పంపాడు, మరి కొన్ని గ్రామాల ప్రజలు, మొగుడంపల్లి, న్యాల్కల్ మండలం లోని గ్రామాలు పూర్తిగా బీదర్ సరిహద్దులలో ఉండడం వలన సంబందించిన అధికారికి ఏమైనా సమస్య లు

 

చెప్పుకొందమన్న కార్యాలయం లేకపోవడం విడ్డురంగా ఉంది..డి ఎల్ పి ఓ కార్యాలయం లేకపోవడం పై సంబంధిత అధికారికి కొందరు ప్రజల ప్రశ్నించగా ఎవరికైన చెప్పుకోండి అని దాటావేయడం సరి కాదని ప్రజల కోరుకుంటున్నారు.

 

 

. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు స్థానికంగాo ఉండాలని నిబంధనలు ఉన్నపటికీ… ఈ అధికారికి మాత్రం అవిఏవి పట్టీపు లేన్నట్టు గా ఉండడం విడ్డురం గా ఉంది..ఇప్పటికైనా ఇలాంటి అధికారి పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసికొని,ప్రజలకు అందుబాటులో ఉండే అధికానిరి నియమించలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు

తృటిలో తప్పిన ప్రమాదం అదుపు తప్పిన లారీ బోల్తా..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T160949.350-1.wav?_=3

తృటిలో తప్పిన ప్రమాదం అదుపు తప్పిన లారీ బోల్తా

. డ్రైవర్ సురక్షితం

కొడిమ్యాల (నేటి ధాత్రి ):

 

జగిత్యాల నుండి జనగామ కు వెళ్తున్న కోళ్ల దాన లారి, చెప్పాల, నల్లగొండ మధ్యలో కురుమపల్లె సమీపంలో లారీకి ఎదురుగా వస్తున్న కార్లు ఓవర్ టేక్ చేసుకునే ప్రయత్నంలో డాంబర్ రోడ్డు కిందికి దిగిన Ap16 Ty 9124 నెంబరు గల లారీ రోడ్డు పక్కకి దిగేసరికి మట్టి లేకపోవడంతో అదుపుతప్పి అర్ధరాత్రి సమయంలో బోల్తా పడ్డ లారీ లో నుంచి సురక్షితంగా బయటపడ్డ లారీ డ్రైవర్. రోడ్డుకు ఇరుపక్కల చదును చేయాలని ప్రజలు, వాహనదారులు, రైతులు, సంబంధిత అధికారులను కోరుకుంటున్నారు.

జనగామ జిల్లా కు పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-6.wav?_=4

జనగామ జిల్లా కు పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

భరతమాత ముద్దుబిడ్డ,తెలంగాణా తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును జనగామ జిల్లాకు నామకరణం చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హలులో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375 వ జయంతి వేడుక సోమవారం జరిగింది. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి పుష్పలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డా.సత్య శారద, జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రాంరెడ్డి,కందాల శంకర్ గౌడ్ లు గౌడ సంఘాల అధ్యక్షులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రానికి చెందిన తొలి చక్రవర్తి జన్మస్థలమైన జనగామ జిల్లాకు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ప్రకటించిన విదంగా పాపన్న గౌడ్ పేరు నామకరణం చేయాలన్నారు.ఎలాంటి టెక్నాలజీ అవకాశాలు లేని 400 సంహాత్సరాల క్రితమే గోల్కొండ కోటకు రాజయి 7 నెలలు పరిపాలన చేశాడని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీకి సమకాళీకుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను స్పోర్తిగా తీసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు తమ సత్తా చటాలని రమేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో గౌడ సంఘాల నాయకులు గట్టు రమేష్ గౌడ్, డా. బైరి లక్ష్మి నారాయణ గౌడ్, తాళ్లపెళ్లి సురేష్ గౌడ్, రామగోనిసుధాకర్ గౌడ్,పోశాల పద్మ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, తోటకూరి రాందాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి బొమ్మగాని శ్యామ్ కుమార్ గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, కొయ్యేడ ప్రవీణ్ గౌడ్, వేముల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారందరికీ పించన్లు ఇవ్వాలి

అర్హులైన వారందరికీ పించన్లు ఇవ్వాలి

సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

కరకగూడెం: అర్హులైన పేదలందరికి వృధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో ప్రతి గ్రామం నుండి ఇప్పటికే దరఖాస్తు తీసుకుని ఉన్నప్పటికీ వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గత ప్రభుత్వంలో కూడా వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని అర్హులైన వారికీ అందించడంలో ప్రజా ప్రభుత్వం విఫలమవుతుందని వారన్నారు పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అంటున్న పాలకవర్గ పెద్దలు వికలాంగులకు పింఛన్లు ఇచ్చే దిక్కు లేదా అని వారు తీవ్రంగా విమర్శించారు వారికి ఇందిరమ్మా రాజ్యం వర్తించదా అని వారు ఎదేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఒక్కరికి కూడా కొత్తగా పింఛన్ ఇచ్చిన దాఖలు లేవని వారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఇచ్చిన వాగ్దానం ప్రకారం పింఛన్దారులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సత్యం కనితి రాజు తాటి దేవయ్య తదితరులు పాల్గొన్నారు

మోరిల నుంచి రోడ్లపైకి మురికినీరు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-1.wav?_=5

మోరిల నుంచి రోడ్లపైకి మురికినీరు..

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..

రామాయంపేటలో వింత పరిస్థితి!

రామయంపేట నేటి ధాత్రి (మెదక్)

సాధారణంగా మురికినీరు రోడ్ల నుండి మోరుల (డ్రైనేజీ లైన్ల) వైపు పోవాలి. కానీ రామాయంపేట పట్టణంలో మాత్రం దీనికి విరుద్ధంగా, మోరుల నుంచే మురికినీరు రోడ్లపైకి వస్తుండడం నిజంగా వింత మరియు ఆందోళన కలిగించే విషయం. నిన్నటి వర్షానికి మోరిలు నిండిపోయి మురికినీరు రోడ్ల మీదికి పొంగిపొర్లిన ఘటన ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది.

ఈ మురికినీరు పొంగిపొర్లే ప్రాంతాల్లో ప్రజలు నిత్యవసరాలకు అవసరమైన కూరగాయల మార్కెట్లు ఉండటం గమనార్హం. ఫలితంగా మురికి నీటిలో నానిన పరిస్థితుల్లో ప్రజలు కొనుగోళ్లు చేయాల్సి రావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉంది. కాలరా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జల వ్యాధుల ప్రమాదం రాకముందే అప్రమత్తమవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక నివాసితుడు ఒద్ది స్వామి మాట్లాడుతూ, “ఇది రామాయంపేటలో సాంప్రదాయ మార్గాలకు విరుద్ధమైన పరిస్థితి. మోరిల నుంచి రోడ్లపైకి నీరు రావడం అంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టు స్పష్టం అవుతోంది. ప్రజలు ఆ మార్గంలో నడవలేక, సిగ్గుపడే స్థితికి వచ్చారు” అని అన్నారు.

ఇకపోతే, డ్రైనేజీ సమస్యతో పాటు రోడ్ల వెడల్పు కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రధాన రహదారుల వెడల్పును పెంచడం, డ్రైనేజీ లైన్లను పునఃసంఘటన చేయడం ద్వారా ఈ సమస్యకు స్థిర పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు రామాయంపేట మున్సిపాలిటీ అధికారులను తక్షణమే స్పందించి, మోరిల పునరుద్ధరణ, రోడ్ల విస్తరణ పనులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వర్షాకాలం ముగించేలోగా శుభ్రమైన పరిసరాలను కల్పించాలన్నదే స్థానికుల ఆశ.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version