అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు ద్వారా లేఖను రాసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
కరీంనగర్, నేటిధాత్రి:
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యార్థుల చదువులను రోడ్డున పడేసిందని, ప్రజాపాలన అంటే విద్యార్థులు ఇంటి వద్ద, కళాశాలలకు తాళాలు ఉండడమా అని? కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలపై నిర్లక్ష్యం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలపై ఇచ్చిన మాట తప్పారని, రాష్ట్రంలో అందాల పోటీలకు ఉన్న నిధులు ఫీజు బకాయిలకు ఎందుకు లేవని? సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిల కోసం కళాశాలలు బంద్ చేసే పరిస్థితి వచ్చిందని రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్ హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ లోని పోస్టు ఆఫీస్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్టు ద్వారా లేఖను పంపడం జరిగింది. ఈసందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో విద్యార్థులు ఉండాల్సిన కళాశాలలు మూసిఉన్నాయి, తరగతుల్లో ఉండాల్సిన విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని, రేవంత్
రెడ్డి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చాక వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు గడుస్త ఉన్న ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని, గతంలో కళాశాలల వారు బంద్ చేస్తే దసరా దీపావళి లోపు పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పి కేవలం మూడు వందల కోట్లు విడుదల చేశారని, నేటి నుండి కళాశాలలు బంద్ చేస్తామని యాజమాన్యాలు ప్రకటించి పది రోజులు గడుస్తున్న ప్రభుత్వం వారితో చర్చించకుండా వారికి బకాయిలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందని, ప్రైవేట్ యాజమాన్యాలకు ఇవ్వాల్సిన బాకాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా పెండింగ్ బకాయిలు ఇవ్వమన్నందుకు విజిలెన్స్ తనిఖీల పేరిట ప్రభుత్వం బెదిరింపులు చేయడం సిగ్గుచేటని, ఫీజు బకాయిలని విడుదల చేసిన తర్వాతనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని, ఫీజు బకాయిల విడుదల లేక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు అప్పులు చేసి మరి ఫీజులు కట్టే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు, మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి, పక్క రాష్ట్రాల్లో పత్రిక ప్రకటనలు ఇవ్వడానికి ఉన్న నిధులు విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నేడు కళాశాలలు బంద్ చేసే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని, కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు పూర్తిగా ఆటంకం కలుగుతుందని, కనీసం ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ఫీజు బకాయిల విడుదలలో నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నేడు రాష్ట్రంలో ఫీజు బకాయిల విడుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటు ప్రైవేట్ కళాశాలలు సైతం ఫీజు బకాయిల విడుదల లేక కళాశాలల నిర్వహణ చేయలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయించడంలో వైఫల్యం చెందడానీ, విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా ప్రభుత్వం వెంటనే కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి బంద్ విరమింపజేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలల బంద్ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజు బకాయిలు విడుదల చేయాలని లేనిపక్షంలో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నగర అధ్యక్షులు కేషబోయిన రాము యాదవ్, నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, శివ, రాజు, మల్లికార్జున్, మని, వరుణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
