రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు
ఎలుకటి రాజయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా విషయంలో మళ్ళీ పాత రోజులు వచ్చాయని, యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందని, చెప్పులు, ఆధార్ కార్డ్స్ వరుసలో పెట్టి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఉదయం నుండి రాత్రి వరకు ఉన్నా యూరియా దొరుకుతుందో లేదో అనే భయం రైతుల్లో ఉందని,రాష్ట్ర మంతా యూరియా కోసం రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని,సకాలంలో యూరియా దొరకక వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ శివారు ఉట్టి తండా కు చెందిన రైతు భూక్య బాలు అనే రైతు పత్తి పంటను తీసివేయడం ప్రభుత్వం వైఫల్యనికి నిదర్శనం అన్నారు.గత ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అలోచించి తగినంత యూరియా సరఫరా చేసిందని, కాని ప్రస్తుత ప్రభుత్వం రైతుల గురించి ఏరోజూ ఆలోచన చేయడం లేదని, 2 లక్షల ఋణమాఫీ అని కొంతమందికి మాత్రమే చేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగినంత యూరియా సరఫరా చేయాలని, రైతులు అందరికి ఋణ మాఫీ చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేణుకుంట్ల రాము మాదిగ నాయకులు బొజ్జపెల్లి ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు..