పలమనేరు మార్కెట్‌లో రైతుల ఆవేదన…

పలమనేరు మార్కెట్ యార్డ్ లో దళారుల చేతిలో మోసపోతున్న రైతులు !కానరాని అధికారులు

పలమనేరు(నేటి ధాత్రి)సెప్టెంబర్ 13:

పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులను దళారీ వ్యవస్థ పూర్తిగా మోసం చేస్తుంది అనడంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి అన్నం పెట్టే రైతును దళారీ వ్యవస్థ ఏకమై పూర్తిగా రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా పూర్తిగా మోసం చేస్తున్నారు, చాలీచాలని ధరలు కు ఎంతో కష్టంతో పండించిన కూరగాయలను వదులుకొని వెళ్తున్నారు, రైతులు అదేవిధంగా రైతులకు కనీ సౌకర్యాలు కూడా లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు, అధికారులు ఎన్నోమార్లు వార్త కథనాల రూపంలో ఈ సమస్యలను గుర్తించిన కనీసం రైతులను కనికరించడంలో అటు యంత్రాంగం ఇటు అధికారి యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారని విమర్శ కూడా ఉంది, ఏఎంసీకి ఎన్నికైన చైర్మన్
లు తమకు ఎంత లాభం వస్తుంది తీసుకుందామా వెళ్లిపోయామని ఉన్నారే కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, పలమనేరు మార్కెట్ యాడ్ కోసం ఎంపిక చేసిన 40 ఎకరాల స్థలం శంకుస్థాపనకే పరిమితమైంది కానీ రైతులకు సౌకర్యాలు అందించడంలో విఫలమైందని అర్థమవుతుంది అటు కర్ణాటక రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించుకుంటూ రైతులకు ప్రోత్సాహం ఇస్తుంటే పక్కనే ఉన్న పలమనేరు మార్కెట్ యార్డులో అధికారులు దళారులు చేతుల్లో రైతుల్ని పెట్టి ముప్పతిప్పలు పెడుతున్నారు ఇందులో దళాలు చేతునుంచి అధికారులు ఎంత తీసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా అసౌకర్యంగా ఉన్న పలమనేరు మార్కెట్ యార్డ్ ను నూతనంగా కేటాయించిన స్థలానికి మార్చి దళారుల వ్యవస్థను దూరం చేసి పూర్తిగా రైతులను ఆదుకోకుంటే రాబోవు రోజుల్లో పలమనేరు మార్కెట్ యార్డ్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైతులు మక్కువ చూపాల్చి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై పై జిల్లా
అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని పలమనేరు నియోజకవర్గం ప్రజలను అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

రైతులు దళారులను నమ్మి మోసపోకండి.

భూభారతి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తాం..

తహసిల్దార్ ఇమామ్ బాబా.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ బుదవారం రోజున నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ చిట్యాల మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలలో ఈనెల 3 తారీఖు నుండి 20వ తారీకు వరకు రెవిన్య సదస్సులు నిర్వహించడం జరిగిందని ఈ రెవెన్యూ గ్రామంలోని రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను దరఖాస్తు రూపంలో వారి ఊరిలో జరిగిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సర్వే చేసి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని అన్నారు, అలాగే కొందరు దళారులు భూములను పట్టా చేయిస్తామని నమ్మబలుకుతున్నారని తమ దృష్టికి వచ్చింది అని వారిని నమ్మి మోసపోవద్దని ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే తహసిల్దార్ కార్యాలయంలో నేరుగా నన్ను సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరినారు, అలాగే ఇప్పటివరకు జరిగిన రెవెన్యూ సదస్సులలో 16 గ్రామాల నుండి దాదాపు 5570 దరఖాస్తులు రావడం జరిగిందని ఇప్పటివరకు దాదాపు 5వేల దరఖాస్తులను స్కాన్ చేసి ఆన్లైన్ చేశామని ఆగస్టు 15 లోపు దరఖాస్తులను గ్రామాల వారీగా పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు పట్టా చేయడం జరుగుతుందని అలాగే భూభారతి అనేది నిరంతర ప్రక్రియని అని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఒక హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలో ఇంకా భూభారతిలో ఇవ్వని రైతులు నేరుగా తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డిస్క్ లో దరఖాస్తు లు ఇవ్వాలని తెలిపారు ,అలాగే ఇప్పటివరకు 16 రెవెన్యూ గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నవి, చైన్ పాక గ్రామ సభలో 156 హెల్ప్ డెస్క్ లో 170, చల్లగరిగె గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 153, చిట్యాల గ్రామ సభలో 126 హెల్ప్ డెస్క్ లో 195, దూత్ పల్లి గ్రామ సభలో 109 హెల్ప్ డెస్క్ లో 90, గిద్ద ముత్తారం గ్రామసభలో 99 హెల్ప్ డెస్క్ లో 79, గోపాలపూర్ గ్రామసభలో 176 హెల్ప్ డెస్క్ లో 65, జడల్ పేట గ్రామసభలో 264 హెల్ప్ డెస్క్ లో 200, జూకల్ గ్రామసభలో 269 హెల్ప్ డెస్క్ లో 147 ,కైలాపూర్ గ్రామసభలో 126 హెల్ప్ డెస్క్ ల 64, కాలువ పళ్లి గ్రామసభలో 40 హెల్ప్ డెస్క్ లో 19, ముచిని పర్తి గ్రామసభలో 250 హెల్ప్ డెస్క్ లో 86, నవాబుపేట గ్రామసభలో 350 హెల్ప్ డెస్క్ లో 182,నైన్ పాక గ్రామసభలో 787 హెల్ప్ డెస్క్ లో 159, తిరుమలపూర్ గ్రామసభలో 189 హెల్ప్ డెస్క్ లో 35, వెంచరామీ గ్రామసభలో 42 హెల్ప్ డెస్క్ లో 35, ఒడితల గ్రామసభలో 417,ఈఈ గ్రామాలలో ఇప్పటివరకు వచ్చినదరఖాస్తులు, గ్రామ సభలలో ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇచ్చామని దాని ద్వారా దరఖాస్తుదారులు వారి స్టేటస్ ను పరిశీలించుకోవచ్చని తెలిపారు, అలాగే ప్రభుత్వం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా విభజించి పరిశీలించి అర్హులైన వాళ్లకు పట్టాలు జారీ చేయడం జరుగుతుందని అన్నారు మొదటిది ,2014 కన్నా ముందు రైతులు భూములు కొనుగోలు చేసి 2018 లో సాదా బైనమకింద ఆన్లైన్ చేసిన రైతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలించడం, రెండవది 2014 తర్వాత కొనుగోలు చేసిన భూములను సాదా బైనమ కింద ఆన్లైన్ చేయని దరఖాస్తులను పరిశీలించడం, మూడవది ప్రభుత్వ భూములను నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్నా భూములను పరిశీలించి ప్రభుత్వం అసైన్ కమిటీలను వేసిన తర్వాత వాటి దరఖాస్తులనుకూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు, అలాగే ప్రభుత్వ భూములను అమ్మిన కొన్న నేరమని దళాల నమ్మి మోసపోవద్దని అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రైతులకు ఒక వరం లాంటిదని కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం:-

పొన్నం బిక్షపతి గౌడ్ జయశంకర్ భూపాలపల్లి బిఎస్పి అధ్యక్షులు:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శనివారం నాడు టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తూ వారు చెప్పిన వారికే ఇండ్లను మంజూరు చేస్తూ, గ్రామంలో లేని వారికి స్థిరమైన గృహాలు ఉన్నవారికి కూడా ఇండ్లను మంజూరు చేస్తున్నారని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించకుండా చేస్తున్న అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఇట్టి దందా నడిపిస్తున్నారని అన్నారు. తక్షణమే ఇట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు కలెక్టరేట్ ముందు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యే పేదలతో ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ మండల తదితర నాయకులు పాల్గొన్నారు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

‘రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, బాలానగర్, మొదంపల్లి, మోతీ ఘనపూర్, హేమాజీపూర్ గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్వినీ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో.. డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, ఆది రమణారెడ్డి, లింగారం యాదయ్య గౌడ్, బత్తుల రాఘవేందర్, భాస్కర్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అదేవిధంగా, గత ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇలాంటి అనేక హామీలను ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఇంతకీ ఇరవై ఐదేళ్ల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా? తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా? అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఎమ్మార్వో ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version