తుఫాన్ తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:*
తుఫాన్ కారణంతో వివిధ రకాల పంటలు నష్టపోయిన రైతులను రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మిపురం,నాచినపల్లి,చాపలబండ గ్రామాలలో పర్యటించారు.అలాగే పంటలను పరిశీలించారు.కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంటలు చేతికందే దశలో తుఫాన్ తీవ్రత వలన నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈ నేపథ్యంలో వరి,అరటి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ పరిస్థితులలో ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకొని భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చల్ల నరసింహారెడ్డికొంగర నరసింహస్వామి, అక్కపెళ్లి సుధాకర్, కోడెం రమేష్, గొర్రె సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
