కంది,వరి పంటలను సందర్శించిన శాస్త్రవేత్తలు
యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచనలు
పరకాల,నేటిధాత్రి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమంలో భాగంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, డాక్టర్.ఎల్.కృష్ణ,శాస్త్రవేతలు డాక్టర్ భార్గవి,డాక్టర్.పద్మజ
ల బృందం శుక్రవారం నాడు పరకాల క్లస్టర్ మాదారంలో గల వరి,కందుల పంటలను సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు శాస్త్రవేత్తలు రైతులకి వరి మరియు కంది పంటలో విత్తనోత్పత్తిలో చేపట్టవలసిన మెలకువల గురించి మరియు సేంద్రియ ఎరువులు వాడకం పెంచుకుని యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతుల కి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పరకాల క్లస్టర్ మాదారం విస్తరణ అధికారి శైలజ,రైతులు పాల్గొన్నారు.
