సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీరాంపూర్ క్షురకులు

సేవే లక్ష్యంగా క్షురకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రస్తుత జీవన విధానంలో ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితులు లేవు.అలాంటి రోజులలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని క్షురకులు సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.మంగళవారం నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ప్రాంతంలోని సాయి దృష్టి అందుల పాఠశాల, వృద్ధాశ్రమంలోని 9 మంది వృద్ధులకు సేవాస్పూర్తితో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రయ్య,మండల ఉపాధ్యక్షులు కళ్యాణం లక్ష్మణ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కురిమిళ్ళ మోహన్ కటింగ్, గడ్డాలు చేశారు.అనంతరం కీర్తిశేషులు కళ్యాణం ఏనమ్మ, వెంకటి జ్ఞాపకార్థం వారి కుమారుడు కళ్యాణం లక్ష్మణ్, పద్మ ఆశ్రమంలోని వృద్ధులకు కొత్త వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వృత్తిరీత్యా అనేకమందికి కటింగ్,గడ్డాలు చేస్తూ ఉంటామని,కానీ ఇలాంటి వారికి చేసిన సేవ ఎంతో తృప్తినిస్తుందని అన్నారు.అలాగే మనకు తోచిన సహాయం,మనకంటే కింది స్థాయిలో ఉన్నవారికి అందించాలని కోరారు.

ర్ మ్ పి డాక్టర్ దాతృత్వం, 30వ సారి రక్తదానం.

ర్ మ్ పి డాక్టర్ దాతృత్వం, 30వ సారి రక్తదానం.
చందుర్తి, నేటిదాత్రి:

 

చందుర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ (R. M. P) అత్యవసర సమయంలో 30వ సారి రక్తదానం చేశాడు. కనగర్తి గ్రామానికి చెందిన బాలలక్ష్మీకి అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నందువలన డాక్టర్ ఆనంద్ రెడ్డి హాస్పిటల్ లో
B poistive blood ని డొనేట్ చేయడం జరిగింది. ఇన్నిసార్లు రక్తదానం చేసిన వనపర్తి సతీష్ ని గ్రామస్తులు అభినందించారు. అలాగే వనపర్తి సతీష్ మాట్లాడుతూ రక్తదానం అనేది అందరూ చేయాలని రక్తదానం చేయడం వల్ల ఇతర ప్రాణాలను కాపాడుతామని తెలియజేశారు.

రక్తదానం మహాదానం,,,,

రక్తదానం మహాదానం,,,,

రక్తం అందక మంది 1,50,000 మృతి,,,,

ప్రతి ఒక్కరు రక్తదానానికి సిద్ధం కావాలి,,,,,,

యు వకులు ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం ఆనందకర విషయం,,,,,

రామాయంపేట అక్టోబర్ 27 నేటి ధాత్రి (మెదక్)

 

 

రక్తదానం మహాదానమని దానివల్ల ఎందరో ప్రాణాపాయ స్థితి నుండి చిరంజీవులు అవుతారని రక్తదానం చేయడానికి అందరు సిద్ధం కావాలని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ అన్నారు, సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్నేహ బందు మరియు పోలీసులు రామాయంపేట పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 1,50,000 మంది రక్తం అందగా మరణిస్తున్నారన్నారు అవసరమైన సమయానికి రక్తం ఇస్తే ఎందరో చిరంజీవులుగా మారతారన్నారు అందుకే రక్త దానం అనేది ఎన్నికైన గొప్ప విషయం అన్నారు ప్రమాదాల్లో

 

క్షతగాత్రులైన వారికిరక్తం బాగా సహకరిస్తుందన్నారు సమయానికి రక్తం అందిస్తే వారికి నూతన జీవితం అందించడం జరుగుతుందన్నారు యువత చాలామంది ఈరోజు రక్తదానికి సహకరించడం నూతన జీవితాలను వెలిగించడం జరుగుతుందన్నారు రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ రామాయంపేట ఎస్సై ఆర్ బాలరాజ్ నిజాంపేట్ ఎస్సై రాజేష్ నార్సింగ్ ఎస్ఐ సృజన పోలీసులుతదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు స్నేహబంధు లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version