రక్తదానం మహాదానం,,,,
రక్తం అందక మంది 1,50,000 మృతి,,,,
ప్రతి ఒక్కరు రక్తదానానికి సిద్ధం కావాలి,,,,,,
యు వకులు ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం ఆనందకర విషయం,,,,,
రామాయంపేట అక్టోబర్ 27 నేటి ధాత్రి (మెదక్)
రక్తదానం మహాదానమని దానివల్ల ఎందరో ప్రాణాపాయ స్థితి నుండి చిరంజీవులు అవుతారని రక్తదానం చేయడానికి అందరు సిద్ధం కావాలని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ అన్నారు, సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్నేహ బందు మరియు పోలీసులు రామాయంపేట పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 1,50,000 మంది రక్తం అందగా మరణిస్తున్నారన్నారు అవసరమైన సమయానికి రక్తం ఇస్తే ఎందరో చిరంజీవులుగా మారతారన్నారు అందుకే రక్త దానం అనేది ఎన్నికైన గొప్ప విషయం అన్నారు ప్రమాదాల్లో
క్షతగాత్రులైన వారికిరక్తం బాగా సహకరిస్తుందన్నారు సమయానికి రక్తం అందిస్తే వారికి నూతన జీవితం అందించడం జరుగుతుందన్నారు యువత చాలామంది ఈరోజు రక్తదానికి సహకరించడం నూతన జీవితాలను వెలిగించడం జరుగుతుందన్నారు రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ రామాయంపేట ఎస్సై ఆర్ బాలరాజ్ నిజాంపేట్ ఎస్సై రాజేష్ నార్సింగ్ ఎస్ఐ సృజన పోలీసులుతదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు స్నేహబంధు లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
