దర్గా హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ దక్కన్ 767 ఉరోస్ ఉత్సవాలు
◆:- టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ మరియు టీఆర్పీ పార్టీ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండల్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహీర్ దక్కన్ 767 దర్గా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా
బాన్దారి మరియు కాదమెన్ దర్గా కమిటీ వారి ఆహ్వానం మేరకు జ్యోతి పండాల్ దర్గాని సందర్శించి చాదర్ని సమర్పించడం జరిగింది. అలాగే టిఆర్పి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హరీష్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ ఆనెగుంట శ్రీకాంత్ మరియు జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్ దర్గా పై చాదర్ని కప్పి పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ ఈ ఉరుసు భక్తికి, ఐక్యతకి మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిందని అలాగే కమిటీ వారు ఈ జాతరను పార్టీలకి కులమతాలకి అతీతంగా నిర్వహించి అందరిని ఆహ్వానించడం చాలా చాలా సంతోషించదగ్గ విషయమని జ్యోతి పండాల్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హరీష్, రాకేష్, శ్రీకాంత్, లోకేష్, షాకిర్ అలీ మరియు దర్గా కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు
