108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి

108 సేవలు సద్వినియోగం చేసుకోవాలి

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజలు 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ 108 కో ఆర్డినేటర్ రవి కుమార్ నిజాంపేట లో గల అంబులెన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్ లో గల పరికరాలు, మందు నిల్వలను పరిశీలించారు. రోడ్డు ప్రమాద సమయం లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఏదైనా అత్యవసర సమయంలో ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఎంటీ స్వామి, పైలెట్ సురేష్ ఉన్నారు.

రాజకీయాలకు అడ్డగా మారిన చిట్యాల సివిల్ ఆస్పత్రి.

రాజకీయాలకు అడ్డగా మారిన చిట్యాల సివిల్ ఆస్పత్రి.

డ్రెస్ కోడ్ పాటించని ఆసుపత్రి సిబ్బంది.

కలెక్టర్ గారూ జర దృష్టి సారించండి.

చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి రాజకీయాలకు అడ్డగా మారింది. చిట్యాల సివిల్ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించకుండా..నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ..రాజకీయ అవతారం ఎత్తి..చిట్యాల సివిల్ ఆస్పత్రిని రాజకీయ వేదికగా మార్చుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని, భూపాలపల్లి శాసనసభ్యులు వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు.

బస్తీ దవాఖానా రాంపల్లి నుండి తొలగించొద్దు…

బస్తీ దవాఖానా రాంపల్లి నుండి తొలగించొద్దు
* కలెక్టర్, డిఎంహెచ్ఓ కి విజ్ఞప్తి చేసిన నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 15 :

 

 

ప్రజా సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా రాంపల్లి నుండి తొలగించవద్దని నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి కోరారు. ఈ మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం తో బాధపడవద్దని కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు బస్తీ దావఖనలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని అత్యధికంగా రాంపల్లి బస్తీ దావాఖణ లో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. అక్కడ నుంచే వేరే చోటకు మార్చడం వలన దాదాపు నాలుగు కిలోమీటర్ల ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. పల్లె దవకాణను వార్డు ఆఫీస్ కి మార్చకుండా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మరో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న బస్తి దావఖన వెంటపడటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.1 కోటి 40 లక్షలతో నిర్మించిన హాస్పిటల్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దివాలా కాంగ్రెస్ ప్రభుత్వం సిబ్బందిని నియమింఛ్చకుండా నిధులు లేవని సాకుతో నిర్మాణం పూర్తి అయిన అస్పత్రి ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామక్కపేట రవీందర్ రెడ్డి, నక్క కిషోర్ గౌడ్ , మెరుగు శ్రీనివాస్ రెడ్డి, రాజు గౌడ్, పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version