రేపు టిఆర్పి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా…
టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ శ్రీమతి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో
రగ్గుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బస్ స్టాప్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో
అనాధలు, అభాగ్యులు, నిరుపేదల కోసం చేపట్టబడింది.ఈ సేవా కార్యక్రమంలో
ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ హర్ష జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్
సచిన్ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ,“ఎంతోమంది బీదలు, నిరుపేదలు, అభాగ్యులకు అండగా నిలుస్తూ నిరంతరం ప్రజాసేవ చేస్తున్న తీన్మార్ మల్లన్న గారి జన్మదినాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది”
అని తన భావాలను వ్యక్తం చేశారు.
