వైభవంగా దత్త చండీయాగం…

వైభవంగా దత్త చండీయాగం

◆:- అంకురార్పణ చేసిన పీఠాధిపతులు

◆:- వైదిక సారథ్యం వహించిన పండితులు

◆:- యాగంలో పాల్గొన్న 108 మంది రిత్వికులు

◆:- యజ్ఞానికి హాజరైన దంపతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి క్షేత్రంలో ఈనెల 4 మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులుశ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి, ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం ఆధ్వర్యంలో 21 యజ్ఞ గుండమూలలో శ్రీ దత్తాత్రేయ యజ్ఞం,5 గుండములలో యజ్ఞములతో త్యాయాహ్నిక శ్రీ చండి హోమాన్ని వైదిక

మంత్రాలతో శాస్త్రోత్తంగా ప్రారంభమైంది. ఉదయం 10:24 గంటలకు ఆశ్రమ పీఠాధిపతులు యజ్ఞ వాటికలో వేదోక్తంగా ఈ క్రతువును ప్రారంభించారు, తొలి రోజు శ్రీ దత్త, చండీ మహాయాగం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. గురుపూజతో ప్రారంభమై గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, మంటపారాధన, ఆవాహిత దేవపూజ, శ్రీ యంత్రపూజ, శ్రీ చండీ పారాయణం, మహా మంగళహారతితో మధ్యాహ్నం 4: 05 కు పూర్ణాహుతితో తొలిరోజు యజ్ఞం భక్తిశ్రద్ధలతో ముగిసింది.

శ్రీ దత్త, గాయత్రి మంత్రాలతో బర్దిపుర్ పరిసర ప్రాంతాలు భక్తిపారవశ్యంతో ప్రతిధ్వనించాయి. యాగానికి సుమారు 100 మంది దంపతులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు హాజరై శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శించుకున్నారు. 3 రోజులపాటు యాగం కొనసాగనుంది. జహీరాబాద్ డిఎస్పి సైదా సిబ్బంది పూజలకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు…

దత్త జయంతికి దత్తగిరి ముస్తాబు

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోనే దత్తక్షేత్రాలలో ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి ఈ నెల 4న దత్తజయంతి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దత్తజయంతి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం పర్యవేక్షణలో ఈనెల 2, 3, 4 తేదీల్లో 21 యజ్ఞగుండాలతో దత్తయజ్ఞాలు, శ్రీచండీ హోమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు అవధూతగిరి మహారాజ్, సిద్దేశ్వరనందగిరి

పేర్కొన్నారు. యజ్ఞాల కోసం ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తుల తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం పచ్చటి పందిళ్లు, తాగునీరు, భోజన వసతి, భక్తులకు దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దత్తాత్రేయ మందిరం, జ్యోతిర్లింగాల మండపం, ఆత్రేయ మహర్షి, అనసూయ, గోమందిరం, రేణుకామాత మందిరాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు. వైద్యాధికారి డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version