లాల్సబ్ గడ్డలో బిసి ఉద్యమానికి భారీ బలం

*లాల్సబ్ గడ్డ, సంగారెడ్డి జిల్లా లో భారీగా చేరిన మైనారిటీ సోదరులు.*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుస చేరికలతో ఊపందుకున్న బిసి నినాదం – జ్యోతి పండాల్
లాల్సాబ్ గడ్డ మున్సిపల్ ఏరియా, సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా నుండి బారి ఎత్తున్న మైనారిటీ సోదరులు చేరడం జరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ కడువ వేసి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది, అలాగే మొహమ్మద్ నవాజ్ గారిని మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ ప్రతి గ్రామ స్థాయిలో తీన్మార్ మల్లన్న గారి పోరాటం ప్రజలకు చేరుతుందని అన్నారు. మా బిసి ఉద్యమాన్ని “టీఆర్పీ చైతన్య బాట” ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాము అని మరియు మా వాటాని మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని మేము మాకున్న అక్కుతో సాధించుకుంటాము అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. తర్వాత మైనారిటీ సోదరులు టీఆర్పీ నాయకులని (జ్యోతి పండాల్, రమేష్ యాదవ్ మరియు అనిల్ కుమార్) సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు నవాజ్, మీడియా మిత్రులు యదాన్న, మైనారిటీ సోదరులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

“రాయికోటీ వినోద బాలరాజ్‌కి గ్రామంలో భారీ మద్దతు”

సర్పంచ్ పోటీలో విద్యావంతురాలు రాయి కోటి వినోద బాలరాజ్

◆:- ఇంటింటి ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు

◆:- గ్రామ అభివృద్ధియే నా లక్ష్యం

◆:- ఆశీర్వదించి బారి మెజారిటీతో గెలిపించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామానికి చెందిన రాయి కోటి వినోద బాలరాజ్ విద్యావంతురాలు అయినందువల్ల మండల మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అబివృద్ధియే మా లక్ష్యం కాబట్టి సొంత ఊరికి సేవచేయాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న మీరందరూ రాయి కోటి వినోద బాలరాజ్ ఆశీర్వదించి బారి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ఇటి కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ ప్రెసిడెంట్ ఎజాస్ బాబా గాజుల కృష్ణ సజావుద్దీన్ దత్తు తోఫిక్ సంజీవు గడ్డం అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version