బిఆర్ఎస్ నాయకుడు బీజేపీలో చేరిక

బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఆసరవెల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు గుండబోయిన తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ నిధులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గ్రహించి బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి యాదగిరి,నాయకులు ఊటుకూరి చిరంజీవి గౌడ్, హుసేన్,కిషన్,సుమన్,వీరన్న,స్వామి,రాజకుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మంగపేట మండల స్థానిక ఎన్నికల డిమాండ్

మంగపేట మండలం లో స్థానిక ఎన్నికలు జరగడానికి మోక్షo ఎప్పుడో

ఎన్నికల కమిషన్ మంగపేట మండలం మీద చోరువా తీసుకొని స్థానిక ఎన్నికలు జరిగే విదంగా చూడాలి

మంగపేట నేటిధాత్రి

 

ములుగు జిల్లా మంగపేట మండలం 2013 ఎన్నికల నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చినది కానీ ఇప్పుడు 25 /11/2025 నోటిఫికేషన్ ప్రకారం కోర్ట్ స్టే ఇవ్వలేదు కనుక మంగపేట మండలం లో స్థానిక ఎన్నికలు జరిపించాలి అని ఎస్సి బీసీ ప్రజా సంఘాల నాయకులు స్థానిక ఎన్నికలు లేక సుమారు 20 సంవత్సరాలు లేనట్లేన ఈ సారి స్థానిక ఎన్నికలు జరగకుంటే ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు జరిపిస్తే మంగపేట మండల ప్రజలు ప్రతి ఒక్కరు నోటకే ఓట్ వేస్తామని ప్రజలనుండి మాటలు వినుపిస్తున్నవి ఏదేమైనా సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానికులు ఎవరైనా పరవాలేదు కాను స్థానిక ఎన్నికలు జరుగలి మంగపేట గిరిజనులు మంగపేట ఏజెన్సీ అని గురిజనేతలు మంగపేట మండలం నాన్ ఏజెన్సీ అనీ వివాదం తో 15 సంవత్సరాలు పూర్తి అయింది కానీ కోర్ట్ లో ఉన్న విషయాన్నీ ఇంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఈ విషయం పై స్వందించకపోవడం మంగపేట మండల ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మంగపేట మండలం విషయం పై స్వంధించి స్థానిక ఎన్నికలు జరిపించే విదంగా చోరువా తిసుకోవాలని గుగ్గిళ్ల సురేష్ మాదిగ విలేకర్ల సమావేశం లో మాట్లాడం జరిగింది సుప్రీం కోర్ట్ లో ఉన్నటువంటి కేసును త్వరగా ప్రభుత్వలు స్వందించి మంగపేట మండల కేంద్రంలో స్థానిక ఎన్నికలు జరిగే విదంగా చూడాలి ప్రజలు ఉద్యోగ పరంగా కానీ మండల అభివృద్ధి పరంగా కానీ ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ప్రజలు వెనుక పడడం జరుగుతుంది ఈ సారి స్థానిక ఎన్నికలు జరకుండా ఉంటే రాబోయే రోజులల్లో ఎమ్మెల్యే ఎన్నికలు గాని ఎంపి ఎన్నికలు గాని ఇంకా ఎ ఎన్నికలు కూడా జరగకూడదు గుగ్గిళ్ల సురేష్ మాదిగ మంగపేట ప్రజా నాయకులు మాట్లాడడం జరిగింది బీసీ మండల నాయకులు గాదె శ్రీనివాస్ చారి, దంతానపల్లి నరేందర్, పరికి శ్రీనివాస్, యాసం హరీష్, ఈసంపల్లి సురేందర్ మాదిగ తదితరులు పాలుగోన్నారు

స్వతంత్ర అభ్యర్థిగా గీత పోటీ

సూర్యనాయక్ తండా గ్రామ ప్రజలకు సేవలు చేయడమే నా లక్ష్యం

ఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: జర్పుల గీత

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా సూర్య నాయక్ తండాకు ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెం డెంట్ గా పోటీ చేయునట్లు జర్పులగీత ప్రకటించారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించి నట్లు తెలిపారు. గ్రామ అభి వృద్ధి, పారదర్శక పాలన, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధా న్యతలు అని పేర్కొన్నారు గ్రామానికి అవసరమైన ప్రతీ పనిని సాధించేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. నిరంతర ప్రజా సేవ చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజల హృదయా లలో నిలవడమే నా లక్ష్యం అంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. గ్రామ ప్రజల అభి మానం, సహకారమే తమ విజయం నిర్ణయిస్తుందని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి చీరల పేరుతో కాంగ్రెస్ మోసం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T164148.757.wav?_=1

 

ఇందిరా మహిళా శక్తి చీరల పేరుతో కాంగ్రెస్ మోసం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండల్ సోషల్ మీడియా ఇంచార్జ్ బాపు నాయక్ అన్నారు.గత పదేళ్లుగా కేసీఆర్ బతుకమ్మ చీరలు మహిళలకు అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా మహిళలకు చీరలు ఇవ్వకుండా ఇప్పుడు కేవలం ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీ చేస్తూ మహిళల ఓట్ల లబ్ధి కొరకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని మరిచిందని,చీరలతో పాటు రెండేళ్లుగా రావలసిన 2500 రూపాయలతో పాటు చేయూత పెన్షన్ బకాయిలు, ఆసరా పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వాలన్నారు. లేదంటే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని అన్నారు.

ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు…

ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, ఎంపీటీసీ ,జెడ్పిటిసి, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.

పిల్లల ఎత్తివేత నిర్ణయంపై శ్రీనివాస్ రెడ్డి హర్షం…

పిల్లల ఎత్తివేత నిర్ణయంపై శ్రీనివాస్ రెడ్డి హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బొప్పనపల్లి, గ్రామ యువ నాయకులు శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ ఎమ్మెల్యేలకు లేని పిల్లల నిబంధన కేవలం లోకల్ బాడీలో అమలు చేయడం వల్ల ఎంతోమంది నాయకులు పోటీకి దూరం అయ్యరని తెలిపారు.,మా ఓట్లు మా పిల్లలు ఓట్లు అవసరం ఉంది కాని మేము పోటీకి పనికి రాకుండా పోతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వారికి కూడా పోటీ చేసే అవకాశం దక్కిందని, దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.అన్నారు

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు..

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు
ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ గూటికి సీనియర్ నాయకులు
స్థానిక ఎన్నికల వేళ అయినవోలులో కాంగ్రెస్ పార్టీకి షాక్

నేటి ధాత్రి అయినవోలు:-

 

స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అయినవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శుక్రవారం ఐనవోలు గ్రామం నుంచి కాంగ్రెస్ నుండి భారీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సీనియర్ నాయకులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో చింత అశోక్ (మాజీ వార్డు మెంబెర్ ఎం. ఆర్.పి.ఎస్ మాజీ మండల అధ్యక్షులు)మోలుగురి బాబు (మాజీ సొసైటీ డైరెక్టర్)
బరిగల ఈసాక్ (మాజీ వార్డు మెంబెర్)కొత్తూరి జాన్సన్ (మాజీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి)
చింత రఘు (మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు)సీనియర్ నాయకులు కొత్తూరి కర్రె కొమురయ్య, మోలుగురి లచ్చయ్య,చింత రాములు మంద రాజు మొదలగు వారు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అయినవోలు మండలంలో ఉన్న కీలక నేతకు అనుచర వర్గాలుగా ఉన్నవారే ఎక్కువగా ఉండడం విశేషం..
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంపుల మోహన్ మండల ఇంచార్జ్ పోలేపల్లి రాంమూర్తి
మాజీ సర్పంచులు ఉస్మాన్ ఆలీ, పల్లకొండ సురేష్ సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్
గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుప్పెలి రాజు తదితరులు పాల్గొన్నారు

బీసీ సంఘాల బంధుకు మద్దతు….

బీసీ సంఘాల బంధుకు మద్దతు

బంధులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ

మంగపేట నేటిధాత్రి

 

మంగపేట మండలం రాజుపేట నుండి కమలాపురం వరకు నిర్వహించిన బైక్ లతో ర్యాలీలలో పాల్గొనీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, బంద్ కు మద్దతు తెలిపారు.ఈ ర్యాలీ లో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, చిలకమర్రి రాజేందర్, మాలికంఠ శంకర్ , గాదె శ్రీనివాస చారి, గ్రామ కమిటీ అధ్యక్షులు, యాగ్గడి అర్జున్, మునిగేల సాంబులు, పార్టీ నాయకులు లోడి కృష్ణ, పూసల నర్సింహా రావు , నక్క యాకయ్య, యూత్ నాయకులు ముప్పారాపు సందీప్, కేక్కం జగదీష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

బీసీ బంద్ లో పాల్గొన్న ఎంసిపిఐ (యు)

బీసీ బంద్ లో పాల్గొన్న ఎంసిపిఐ (యు)

నర్సంపేట,నేటిధాత్రి:

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సామాజిక రాజకీయ పార్టీలు చేపట్టిన తెలంగాణ బంద్ కు ఎంసిపిఐ (యు) సంపూర్ణ మద్దతు తెలిపింది.నర్సంపేట లో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 లో బీసీ రిజర్వేషన్ అంశాన్నిచేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటాలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు అనుమాల రమేష్ ,బంగారు ముత్తయ్య,అచల,మేడిద ప్రమీల,ఈర్ల అనుష ,మాదాసి రాజు,జి అంజి, సుశీల,శ్రీను,రాములు, ఐలమ్మ, జన్ను నీల,ప్రమీల పాల్గొన్నారు.

దుగ్గొండి మండలంలో…

బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త బిసి బంద్ కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో చేపట్టిన నిరసనలో ఎం సిపిఐ పార్టీ నాయకులు పాల్గొని ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ కార్యదర్శి మొహమ్మద్ రాజా సాహెబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు,డివిజన్,మండల సభ్యులు కుమారస్వామి, కొమురయ్య, సురేందర్,చందర్ రావు,భాస్కర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి…

బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి
-నల్లబెల్లి గ్రామ బిసి సంఘం నాయకులు
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబేల్లి గ్రామంలో బీసీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో బీసీలకు 42% బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తెలపాలని తెలంగాణ బంద్ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మరియు వివిధ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ , కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు డోలి సతీష్, బిఆర్ఎస్ నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల సురేష్, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం కొరకై ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతే అనే నినాదంతో దేశంలోనే కుల గణనకు నాంది పలికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి దాని ఆధారంగా 52 శాతం ఉన్న బీసీ జనాభాకు ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో రాజకీయంగా విద్య ఉద్యోగ పరంగా రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ తో ఆర్డినెన్స్ , రాష్ట్ర అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం బిల్లును బీసీ బిల్లు ఆమోదించి గవర్నర్కు రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా మూడు నెలలు గడుస్తున్నా ఇంకా దాన్ని కాలయాపన చేయడం ద్వారా బీసీలు నష్టపోతున్నారని తెలుసుకొని ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లడం జరిగింది దాన్ని కొంతమంది కావాల్సి కొని అడ్డుకోవడం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వం బీసీలపై ప్రేమానురాగాలు ఉంటే వారి అభివృద్ధి కోరుకున్నట్లయితే వెంటనే రాష్ట్రపతి గవర్నర్ బిల్లులను ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తంగెళ్ల భాస్కర్ ,గజ్జల దేవేందర్ పసునూరి కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దిలీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, దోమకొండ ప్రభాకర్, చెంగల స్వామి, సురేందర్, భాస్కర్, దోమకొండ ఈశ్వర్, ఆరేల్లి వీరస్వామి, ఫైండ్ల కుమారస్వామి, రాజు, సురేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు

*రాష్ట్రబందులో పాల్గొన్న బిజెపి నాయకులు…

*రాష్ట్రబందులో పాల్గొన్న బిజెపి నాయకులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనకై బీసీ జేఏసీ ఇచ్చినటు వంటి తెలంగాణ బందుకు మద్దతు తెలుపుతూ బందు లో పాల్గొన్న బిజెపి మండల నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామ కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బిసి డిక్ల రేషన్లు లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఆరోజు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలో వచ్చిన కాడి నుంచి బీసీలను మభ్యపెడుతూ బీసీలను మోసం చేసే కుట్ర పన్నుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాలని భారతీ య జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు గడువు పూర్తి అయి రెండు సంవత్సరాలు కావ స్తున్న ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మోసపూరిత హామీల తోటి బీసీలను 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మభ్యపెడు తూ కాలం వెళ్లబుచ్చుతుంది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి అనేది లేదు అని ఏ రోజుకైనా బీసీలకి న్యాయం చేసే పార్టీ బిజెపి పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగి లి, సీనియర్ నాయకులు బూ ర ఈశ్వరయ్య, జిల్లా ఓబిసి మోర్చ నాయకులు ఉప్పు రాజు, మండల ప్రధాన కార్య దర్శి భూతం తిరుపతి, కురా కుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం: బీసీ జేఏసీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T133719.365.wav?_=2

 

బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం: బీసీ జేఏసీ

బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బిజెపిదే :మండల కాంగ్రెస్ కమిటీ

శాయంపేట నేటిధాత్రి:

 

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పించకుండా రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిర సిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘా లను కలుపుకొని శాయంపేట మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటు వంటి అన్ని పార్టీలు బిసి బంద్ ను స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడంతోనే 100% బీసీలకు బంద్ విజయవంతం చేయడం జరిగింది. దానికి తోడు అన్ని సంఘాలు ఏకమవడం బిసి ఉద్యమానికి మరియు బందు కు మరింత బలాన్ని చేకూ ర్చింది, కామారెడ్డి డిక్లరేషన్ లోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% శాతం కల్పించాల్సిన అవసరం ఉంది బంద్ ఫర్ జస్టిస్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది స్వచ్ఛందంగా దుకాణాలు,

విద్యాసంస్థలు బందు పాటిం చి మద్దతు ఇవ్వడాన్ని హర్షి స్తూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఈ ఉద్యమం జరిగిందని భవి ష్యత్తులో బీసీల హక్కులను సాధించేందుకు తోడ్పడుతుం దని అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కలిసికట్టుగా బిసి హక్కుల కోసం పోరాడాలని స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో 42% వాటా అమలు ఆయ్యేదాకా పోరాటం ఆగదని మనమెంతో మనం మనకంత వాటాన్ని సాధిం చేవరకు ఉద్యమం ఆపద్దని పిలుపునివ్వడం జరిగింది అనంతరం వివిధ పార్టీల నాయకులతో పెద్ద ఎత్తున మాందారిపేట ప్రధాన రహ దారిపై రాస్తా రోకో నిర్వహిం చడం జరిగింది

ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మెంబర్ బాసాని చంద్రప్రకాష్, మాది మార్కెట్ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల మార్కె ట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీం దర్, మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి, అబ్బు ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కొమ్ముల భాస్కర్ దుబాసి కృష్ణమూర్తి, మారేపల్లి రాజు, మారపల్లి రాజేందర్, చిందం రవి, నిమ్మ ల రమేష్, బండారి పైడి, జిన్నా రాజేందర్, రేణికుంట్ల సదానం దం, రవి పాల్ వివిధ గ్రామాల నుం చి వచ్చిన కాంగ్రెస్ నాయ కులు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132231.789.wav?_=3

 

బీసీ బందులో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఏకగ్రీవం చేస్తే ₹ 10 లక్షలు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T120211.496.wav?_=4

 

ఏకగ్రీవం చేస్తే ₹ 10 లక్షలు

◆:- సర్పంచ్ ఆశావహుడి ఆఫర్

◆:- రిజర్వేషన్లపై సందిగ్ధత ఉన్నా తగ్గేదేలే..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం : బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో.9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పటికే ప్రారం భమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే రిజ ర్వేషన్ల అంశంపై అంశంపై సందిగ్ధత కొనసాతుండ గానే జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్ష లు అందజేస్తానని ప్రకటించడం స్థానికంగా ఆసక్తిని రేపింది. గ్రామ బిఆర్ఎస్ పార్టీ మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. గ్రామంలో 1500 ఓటర్లు ఉండగా ఇటీవల ప్రకటించిన హైకోర్టు స్టే ఇచ్చిన క్రమంలో మళ్లీ తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చి తనను ఏక గ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించినా ఈదులపల్లి బీసీ (మహిళ)కు రిజర్వ్ అయి ఉండటంతో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ప్రతి పాదనను ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

చందానగర్ లో బిసి జేఏసీ ఆందోళన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T140348.461.wav?_=5

 

చందానగర్ లో బిసి జేఏసీ ఆందోళన

రిజర్వేషన్ల వ్యతిరేకులకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ కు వినతి

‘బంద్ ఫర్ జస్టిస్’ ను విజయవంతం చేయాలని సబ్బండ వర్గాలకు బిసి జేఏసీ పిలుపు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

తెలంగాణలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి బిసి జెఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం చందానగర్ లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిసి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్న వ్యతిరేక శక్తులకు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రాన్ని జేఏసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కో చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, తెలంగాణ బిసి కుల సంఘాల జేఏసీ కన్వీనర్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జేఏసీ నాయకులు తుడి ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ లు మాట్లాడుతూ దేశంలో స్వతంత్రం వచ్చిన నాటినుంచి నేటి వరకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేవలం బిసి లకు మాత్రమే లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

బిసి లకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 18 వ తేదీన బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తలపెట్టిన తెలంగాణ బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కె సాయన్న ముదిరాజ్, బీసీ జేఏసీ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, సగర సంఘం రాష్ట్ర సలహాదారులు కెపి రామ్ సగర, సగర సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక శ్రీనివాస్ సగర, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గంగాధర్ సగర, జేఏసీ నాయకులు జిల్ల గణేష్, సీతారాం సగర, రామకృష్ణ సగర, అశోక్ యాదవ్, నరసింహ, శంకర్ ముదిరాజ్, బాలరాజు సగర, నారాయణ రావు, శివశంకర్, ఆంజనేయులు సగర, చింతకింది రవీందర్ గౌడ్, కుమార్ యాదవ్, చెన్నం రాజు ముదిరాజ్, చందు సగర, శివ సగర, రాము, తిరుమలేష్, అడ్వకేట్ రమేష్, అంజమ్మ, మాధవి, బిక్షపతి, వెంకట నర్సింహా రావు, రమేష్ గౌడ్, రాజు ముదిరాజ్, మధుకుమార్, పెద్ద సంఖ్యలో బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు,

42% రిజర్వేషన్ల కోసం బీసీ బంద్‌కు సగర సంఘం మద్దతు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

బీసీ 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ పిలుపు

బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు

ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి…

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

18న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ జిల్లా జిల్లాఅధ్యక్షులు బీసీ హక్కుల సాధన సమితి

కరీంనగర్, నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బుచ్చన్న అన్నారు. కమాన్ సెంటర్లో లోజరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్యతో కలిసి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బుధవారం కరీంనగర్ లోని కమాన్ సెంటర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించవలసిన బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ బీసీల ఎడల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గమని, ఎందరో న్యాయకోవిదులు నిపుణులు చెప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ఒకసారి జీవో అని ఒకసారి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో మీదా అగ్రకులాలు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశాలు కల్పించేలా వ్యవహారించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు.
ఈమోకా తప్పితే బీసీలు ఆగమై పోతారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వెనుకాల ఉన్న బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు.
కోర్టులో గెలిచామనీ రెడ్లు టపాసులు కాల్చుకొంటున్నారనన్నారు.
ఇందుకు నిరసనగా హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన కేసు ప్రతులను దగ్ధం చేస్తూ ఇదీ బీసీలంతా గమనించాలన్నారు.
బీసీలను రోడ్లు ఎక్కేలా చేస్తున్న అగ్రకులాలు జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని, ఈనెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కోశాధికారి పైడిపల్లి రాజుగౌడ్, నాయకులు బాకం ఆంజనేయులు, జంగం కొమురయ్య యాదవ్, దానవీని రమేష్,మల్లేశం, ఓరుసుబన్నీ, మేకల కుమార్, ఎన్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల నే బీసీలకు అన్యాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T131713.653.wav?_=6

 

బిజెపి రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల నే బీసీలకు అన్యాయం

రాష్ట్రంలో బీసీలు ఉద్యమానికి బిఎస్యూ సంపూర్ణ మద్దతు

బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

పరకాల నేటిధాత్రి

 

బిజెపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వళ్లనే హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేట్ ఇచ్చారని బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రం రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారని ఉన్నంత కులాల వారి మీద ఉన్న ప్రేమ బీసీల పట్ల బిజెపి పార్టీకి లేనే లేదని స్పష్టంగా అర్థమవుతుందని బీసీ ప్రధాని న నీ చెబుతూ మోడీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్ని తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version