పిల్లల ఎత్తివేత నిర్ణయంపై శ్రీనివాస్ రెడ్డి హర్షం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బొప్పనపల్లి, గ్రామ యువ నాయకులు శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ ఎమ్మెల్యేలకు లేని పిల్లల నిబంధన కేవలం లోకల్ బాడీలో అమలు చేయడం వల్ల ఎంతోమంది నాయకులు పోటీకి దూరం అయ్యరని తెలిపారు.,మా ఓట్లు మా పిల్లలు ఓట్లు అవసరం ఉంది కాని మేము పోటీకి పనికి రాకుండా పోతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో వారికి కూడా పోటీ చేసే అవకాశం దక్కిందని, దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.అన్నారు
