ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, ఎంపీటీసీ ,జెడ్పిటిసి, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.
