సైబర్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి.

సైబర్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాల నియాత్రణే లక్ష్యంగా ప్రతి సైబర్‌ వారియర్స్ పని చేయాలి.

సైబర్ నేరాలు,సైబర్ నేరానికి గురైతే ఎలా స్పందించాలి అనే అంశాలపై ప్రజల్లో అవగహన కల్పించాలి.

సైబర్‌ నేరాలపై వచ్చే పిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని,బ్యాంకులో ఫ్రీజ్ అయి నగదు బాధితులకు అందేలా కృషి చేయాలని,సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ సూచించారు.

ఈసందర్భంగా ఎస్పీమాట్లాడుతూ…..

సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించబడ్డ సైబర్ వారియర్స్ సైబర్‌ నేరాలపై వచ్చే పిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని, సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.

అనుకోని రీతిలో సైబర్ నేరానికి గురైతే ఖంగారు పడకుండా వెంటనే 1930 ఫోన్ నెంబర్ కు,NCRP potral గాని,దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఉన్న సైబర్ వారియర్ ని సంప్రదించాలన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్స్ కి ప్రత్యేకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక ఫోన్ నెంబర్ అందజేయడం జరిగిందన్నారు.

పోలీస్ స్టేషన్లలో ఉన్న సైబర్ వారియర్స్ కి అనుమానిత లింక్స్ విశ్లేషించడం,అలాగే సోషల్ మీడియా,ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేయడం వంటి వాటిపై వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్,ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు.

పోలీసు అధికారులు నేరుగా వాట్సాప్ వీడియోకాల్స్ చేయరని,డిజిటల్ అరెస్టులని కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్ల బలంగా మారిందని, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండటానికి అప్రమత్తతే ప్రధాన ఆయుధం అన్నారు.ఈసమావేశంలో జిల్లా సైబర్ సెల్ ఆర్. ఎస్.ఐ జునైద్, సైబర్ సెల్ సిబ్బంది, అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల అబ్రహం నగర్ ,సర్దార్ వల్లభాయ్ నగర్ ఏరియాలో నివసించే సింగరేణి కార్మికులకు, మంచినీళ్లు అందించేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాకుబ్ ఆలీ సింగరేణి అధికారులను కోరారు. స్పందించిన సింగరేణి అధికారులు శనివారం కల్వర్టులో ఉన్న కొన్ని నీటి పైపులైన్లను తొలగించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. నీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి యాకూబ్ అలీ అన్నారు. లింగేశ్వర పాఠశాల నుండి అబ్రహం నగర్ బోర్డ్ వరకు కూడా కొత్త పైప్ లైన్లు వేయాలని సింగరేణి అధికారులను కోరుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కి నూతన నీటి పైప్ లైన్ వేయించాలని కోరడం జరిగిందని తెలిపారు.స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, కాలనీ వాసుల నీటి అవసరం నిమిత్తం నూతన పైప్లైన్ వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని యాకుబ్ ఆలీ అన్నారు.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం

 

నేటిధాత్రి:హన్మకొండ

 

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్

భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో
గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి అంబులెన్సు తెచ్చింది బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అని మరిచిపోవద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 15 నెలలు అవుతున్నా భీమదేవరపల్లి మండల ప్రజల కోసం కనీసం 30 పడకల హాస్పటల్ ను కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలం లో హన్మకొండ సిద్ధిపేట హైవే రోడ్డు పై మండల ప్రజలకు హాస్పటల్ కావాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. అయినా ఇప్పటి వరకు కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదు. మండల పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50 వేల జనాభా ఉన్నా మండలానికి ఒక ఎండి డాక్టర్ కానీ. ఒక గైనాకలాజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్ లేకుండా మండల ప్రజలు అల్లాడిపోతున్నారు

అమెరికా దుశ్యర్యలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థులపై అక్రమ వలసలు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు చేస్తున్న దుశ్యర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నోరువిప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మేరు సంఘం భవన్లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.విదేశీ ఉన్నత విద్య కోసం భారతదేశం అమెరికాతో స్నేహ సంబంధాలు కలిగి ఉందని, కానీ డోనాల్డ్ ట్రంపు వచ్చిన తరువాత అక్రమ వలసలు అంటూ విద్యార్థులకు సంకెళ్లు వేస్తూ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటం సరైందికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన,ఎస్సి వర్గీకరణ అమలు కోసం తీర్మానం పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన సరిగ్గా జరగలేదని,సర్వే నిష్పక్షపాతంగా దాపరికం ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ అనేక పోరాటాలు చేస్తే సాధించిన వర్గీకరణ అని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేటట్టు చూడాలని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేసే దిశగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో భూ పోరాటాలతో ఇళ్ల స్థలాల కోసం 8 ఏళ్లుగా సిపిఐ పార్టీ నర్సంపేటలో కొనసాగించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలులేని పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాల పట్టాలిచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చి ఆదుకోవాలని తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ హామీ లాగా రాష్ట్ర ప్రభుత్వ హామీ మిగిలిపోవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఔట్సోర్సింగ్ లాంటి వారికి బకాయిపడిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడాలి

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తూ రెండో రాజధాని చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.నర్సంపేట పట్టణంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు.ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చేసేందుకు గిరిజన విశ్వవిద్యాలయం,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు.రెండో రాజధాని వరంగల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఒరగబెట్టిందని,వరంగల్ అభివృద్ధి కావాలంటే ప్రణాళిక సిద్ధం చేసి విడుదల చేయాలన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రాజెక్టులు పరిశ్రమలు రావాలని లేకుంటే సిపిఐ భవిష్యత్తులో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version