ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఏర్పాటు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఏఎస్ రావు నగర్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానేటిధాత్రి:

 

ఎఎస్ రావు నగర్ డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు వారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ
ఆరోగ్య కేంద్రంలో వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకుఉపయోగపడుతుందని అన్నారు
వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసినందుకు కేశెట్టి ప్రసాద్ ను ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాజేంద్రన్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, సీనియర్ నాయకులు అజిజ్, సుంకు శ్రీకాంత్ రెడ్డి, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీను, తాడూరి అనిల్ కుమార్, భద్రగామ నరసింహ, మామిడి శ్రీనివాస్, పూర్ణ యాదవ్, మల్లారెడ్డి,శ్రీహరి, సత్యనారాయణ, తాడూరి ఉష రాణి,భవాని, సునీత, సంధ్య, మాదవి, మీనా, రాణి,మరియ తదితరులు  పాల్గొన్నారు.

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు.

దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు

తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో తల్లి జ్ఞాపకార్ధంగా పేదల దహార్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కుమారులు వివరాల్లోకి వెళితే పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి విజయలక్ష్మి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో కృంగి పోయిన ఆ కుటుంబం తల్లి జ్ఞాపకాలు, మధురస్మృతులు మర్చిపోలేని చిట్టి రెడ్డి విజయ్, అజయ్ ఇద్దరు కుమారులు గ్రామంలో తన తల్లి పేరున సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు ఆటోవాలకి, కూలీలకు, ప్రయాణికులు, పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు 200 నుండి 400 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు అనంతరం విజయలక్ష్మి కుమారుడు చిట్టిరెడ్డి విజయ్ మాట్లాడుతూ మాతల్లి పేరు సేవా కార్యక్రమం చలివేంద్రంతో ఆగేది కాదు అని పేదల పిల్లల చదువు,గ్రామ అభివృద్ధి లో,చిన్నపిల్లల ఆపరేషన్ విషయంలో ఎప్పుడు నేను ముందుంటానని అన్నారు నేను పుట్టిన ఊరు నా కన్న తల్లి తో సమానం అని నా ఊరు రుణం తీర్చుకోవడంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గజ్జి ఐలయ్య,చిట్టి రెడ్డి జంగా రెడ్డి,చల్లరాజిరెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, గుర్రం రమేష్, జలంధర్ రెడ్డి, ఉమ్మడి రమేష్, భద్రయ్య నాలుక వెంకటేష్, సురేందర్, అంకెశ్వర మొగిలి, బోయిన అశోక్ బోయిన ఓదెలు బోయిని పైడి, బగ్గి పైడి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version