వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ బిసి మాజీ ఎమ్మెల్యేల
పేరు ప్రకటించినందుకు సీఎం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
వనపర్తి నెటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ దివంగత వనపర్తి బీసీ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాలకృష్ణయ్య ఎం జయ రాములు యాదవ్ పేర్లు వనపర్తి లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే జయ రాముల కుటుంబ సభ్యులు అరవిందు వశిష్ట భరణి అరుణ రోహిణి అల్లుడు రంగస్వామి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము 40 సంవత్సరాలు నుండి మా కుటుంబ సభ్యులం వనపర్తి లో లేకున్నా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ యాదవ్ పోరాటం చేసి బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకపోయినందుకు అభినందించారు .ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్ గౌని కార్డు యాదయ్య బొడ్డుపల్లి సతీష్ నాగవరం వెంకటేష్ పుట్టపాకల బాలు రాములు యాదవ్ రాజేష్ బాబుగౌడ్ నరసింహ తిమ్మన్న ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు