ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం లో మరో ముందడుగు
కొత్తగూడ,నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కొత్తగూడ మండల ప్రజల చిరకాల కోరిక.. త్వరలో తీరానున్న పెద్ద ఆసుపత్రి కల..!!తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుడాక్టర్ అనసూయ సీతక్క
ప్రత్యేక దృష్టితో ఉమ్మడి కొత్తగూడ ప్రజల కోసం 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన సంగతి విధితమే
శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో..ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం లో భాగంగా సాయల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమం లో.. డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,హలవత్ సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, నాయకులు కందుల సందీప్, రవి, తదితరులు పాల్గొన్నారు,.,