జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ ఆలయ అభివృద్ధికి నూతన దశ…

జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ ఆలయ అభివృద్ధికి నూతన దశ…!!

– సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి నిదర్శనం – వేములవాడ రాజన్న ఆలయం..!!
సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం పొందారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి మరియు ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

“ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు.
ముఖ్యంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల, దివ్యక్షేత్ర పునరుద్ధరణ ప్రణాళికలను వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వేములవాడ ఆలయ అభివృద్ధి పట్ల ప్రభుత్వ కట్టుబాటు మరియు జరుగుతున్న పనుల పురోగతిని స్వామివారికి వివరించారు.
జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మరింత వైభవంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడండి…

హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడండి
– బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

వేములవాడ ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా కోటిలింగాలను అక్కడి నుండి మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆలయ ప్రాంగణంలో ఇతర మతస్తుల నిర్మాణాలు కూడా ఉన్నవి వాటిని జరపకుండా కోటిలింగాలను మాత్రమే జరపాలని ప్రయత్నం చేస్తున్నారని దీనివలన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ (విటిఏ.డి.ఏ) వైస్ చైర్మన్ కి మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనుక ముందుగా దర్గాను తొలగించిన తర్వాత ఏ కార్యక్రమమైన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపున జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం, సంతోష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజు రెడ్డి, జిల్లా కార్యదర్శి గొప్పడి సురేందర్రావు, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు రావు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు వేణుగోపాలరావు, కోడె రమేష్, మిర్యాల్కార్ బాలాజీ, రాపెల్లి శ్రీధర్, బురుగుపల్లి పరమేష్, సౌల క్రాంతి, బిజెపి సీనియర్ నాయకులు గజ బింకర్ చందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version