తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..ఒంటేరు చక్రి
హన్మకొండ, నేటిధాత్రి:
తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ ఇటీవల తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ ల విభజన లాగ జరిగిందని అవివేకం తో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ పోరాటాల ద్వారా ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనం అని దేశానికి ఒక స్పూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన అలాంటి ఒక గొప్ప పోరాటాల స్ఫూర్తిని చిన్నతం చేస్తూ మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.పోరాట,ఉద్యమ స్పూర్తి లేని బీజేపీ నాయకులకు ఏం తెలుసు తెలంగాణా ప్రజల మనోభావాలు,బేషరతు గా తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాల్సిందే అని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.
