అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్
గుండాల,నేటిదాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్వాన పరిస్థితులపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా వ్యవహరించి భౌతికరిదారులకు దిగటం ఎంతవరకు సరైనదని గుండాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు డిజిటల్ మీడియా ద్వారా రహదారుల పరిస్థితి పై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ మణుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసి కాలబెట్టడం ఎంతవరకు సరైంది అని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక అడిగే వారి పైన వారి పార్టీ కార్యాలయాల పైన దాడులకు దిగితే పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారు అనుకోవడం వారి అవివేకమని అన్నారు. అభివృద్ధి చేతకాక అడిగే వారిపై దాడులు చేయడమే మీ సంస్కృతి ఇదే మీ ప్రజా పాలన అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకలేక ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త రకం నాటకం తెరలేపిందని అన్నారు . ఈ దారిలో పాల్గొన్న కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి సారించి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని లేని పక్షంలో మరింతగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా ముందుకు కదులుతాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగటం మానుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా వెళ్లి వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగమ అధ్యక్షుడు సయ్యద్ అజ్జు,బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు,పార్టీ నాయకులు గడ్డం వీరన్న, కటికం నాగేశ్వరరావు, జాడి ప్రభాకర్, గోగ్గల రాంబాబు,పొంబోయిన సుధాకర్, బొమ్మెర్ల శ్రీను, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర సతీష్, గంగాధరి ప్రమోద్, జనగం లాలయ్య, భూక్య శ్రీను, ఆగయ్య, గంగాధరి నాగన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
