వనపర్తిలో మహాత్మా గాంధీకి వర్తకులు, ఆర్యవైశ్యులు నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వర్తకులు ఆర్యవైశ్యులు

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వర్తకులు దోమ శివ బొడ్డు శంకర్ సంబు రవి వై వెంకటేష్ హెచ్ఎంటి రవి ప్రసాద్ ఆర్యవైశ్యులు ఏపూరి శ్రీనివాసులు కొట్ర రామకృష్ణ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ కందికొండ సాయిరాం మారం గోవిందు గుప్త ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్ బచ్చు సౌజన్య వాసవి క్లబ్ అధ్యక్షులు ఆకుతోట రాఘవేంద్ర రాజ్ మెడికల్ షాపు శంకర్ కూన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

జయంతి వారి వివాహ వేడుకలలో ప్రముఖ న్యాయవాది…

జయంతి వారి వివాహ వేడుకలలో ప్రముఖ న్యాయవాది

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా రాజనగరం అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఆర్ జి గార్డెన్ లో శనివారం జరిగిన శ్రీమతి జయంతి సునిత శ్రీనివాసులు శెట్టి కుమారుడు మణిదీప్ లలిత సోనాలిక తో జరిగిన వివాహ వేడుకలలో వనపర్తి ప్రముఖ న్యాయవాది పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు అయిత కృష్ణ మోహన్ కుటుంబ సభ్యులు ప్రముఖ వ్యాపారి గోకారం రాజు జర్నలిస్ట్ లు పోలిశెట్టి బాలకృష్ణ పోలిశెట్టి సురేష్ ఈపూరి వెంకటేష్ 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నూతన వధూవరులను ఆశీర్వదించారు

కల్వకుర్తిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు….

కల్వకుర్తిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు.

రికార్డ్ ధరలకు అమ్మవారి చీరలు వేలం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత తొమ్మిది రోజులుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారము అమ్మవారి లడ్డును వేలంపాట నిర్వహించారు. ఉర్కొండ మండలం ఇప్పపహట గ్రామానికి చెందిన వీరమల్ల బాలస్వామి రూ.82,116 వేలకు దక్కించుకున్నారు. అలాగే అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు మొదటి రోజు ధాన్యలక్ష్మి దేవి చీరను గార్లపాటి శ్రీనివాసులు రూ.58, 116, రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ చీరను బాదం గణేష్ రూ.53,1 16, మూడవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చీరను రామస్వామి రూ.65, 116, నాలుగవ రోజు కాత్యాయన దేవి అలంకరణ చీరను గంప వెంకటేష్ రూ.49, 116, ఐదవ రోజు ధనలక్ష్మి దేవి అలంకరణ చీరను1,35,116, ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ చీరను పోలా పర్వతాలు రూ.77,116, ఏడవ రోజు శాకాంబరి అలంకరణ చేరను కూన శ్రీనివాసులు రూ. 61,116 ఎనిమిదవ రోజు సరస్వతి దేవి అలంకరణ చీరను గంప శ్రీనివాసులు రూ.61, 116, తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకరణ చీరను కొరివి శ్రీనివాసులు రూ.92, 116 పదవరోజు మహిషాసుర మర్ధిని దేవి అలంకరణ చీరను వీరమల్ల పాండు రూ.70, 116 11వ రోజు పుష్పలంకరణ చీరను గంప సురేందర్ రూ.55, 116, అమ్మవారి వడిబియ్యం వేముల శ్రీనివాసులు రూ. 46,116 వేలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాఠం లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోఅమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ…

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోఅమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అలంకరణ తో భక్తులకు దర్శనం ఇచ్చారు పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాం గౌరవ అధ్యక్షులు నాగబంది యాదగిరి యూవజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పిన్నం వసంత ఆర్యవైశ్య మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ పూజలు చేయిస్తున్నా రు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version