జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం తెలంగాణలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వేడుకలను జిల్లా బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపి శంకర్ నాయక్ రాజేంద్రప్రసాద్, బీసి. సంక్షేమ శాఖాధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు పద్మశాలి సంఘం నాయకులు.సామాజికవేత్త రాజారాం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు