నివాళులు అర్పించిన నాగుర్ల
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి చెందిన నాగూర్ల బాపూరావు ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు నర్సక్కపల్లి గ్రామానికి చేరుకుని, స్వర్గీయ నాగూర్ల బాపూరావు పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాగూర్ల బాపూరావు మృతి కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు.వారి కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,బీఆర్‌ఎస్ నాయకులు,రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
