9 లీటర్ల నాటుసారా పట్టివేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: బైక్పై నాటుసారా తరలిస్తున్న కర్ణాటకలోని కలబుర్గి జిల్లా చించోళి తాలూకా శ్రీనగర్ తండాకు చెందిన పాండును అరెస్టు చేసినట్లు జహీరాబాద్ ఆబ్కారీ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి తొమ్మిది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.