వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మైన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం బషీర్ బాగ్ లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన అనంతరం రాచాల యుగంధర్ గౌడ్ విలేకరుల తో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డి ఎస్ ఓ పై ఆధారాలతో లోకాయుక్త లో ఫిర్యాదు చేశామని రాచాల తెలిపారు. రైస్ మిల్లు కు సంబంధించి మిషన్లు మోటర్లు,ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయించడంతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్ , విజిలెన్స్ డిజి , సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.
తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు మాత్రమే డి ఎస్ ఓ ధాన్యం కేటాయిస్తూ.ప్రభుత్వ.రూల్స్ పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా కక్ష చూపుతున్నారని ఆరోపించారు.
కొంత మంది అధికారుల చర్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచాల కోరారు.
ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు గాలిగల్ల సాయిబాబా, చింటు తదితరులు ఉన్నారు.
