భారతదేశ 77 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ
నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఈ గణతంత్ర దినోత్సవం ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలం, వారి సుదీర్ఘ పోరాటం ద్వారా వచ్చిన స్వాతంత్ర్య ఫలాలను పరిపాలనలో అమలు చేయాల్సిన
బాధ్యతలు, విధులను తెలిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు.దిశానిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైనది.
ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగం మూలం.
మనదేశం భిన్నత్వంలో ఏకత్వం కలది.
వివిద వర్గాల వారు వారి విశ్వాసాలకు అనుగుణంగా భగవద్గీత, ఖురాన్, బైబిల్ ను గౌరవిస్తారు.కాని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవించేది దేశ రాజ్యాంగాన్ని. దేశాన్ని అభివృద్ధి పధంలో నడపడానికి అందరూ కృషి చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పి ఆర్ యు సి సి మెంబర్ షేక్ ఫరీద్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఆర్ సుభాష్,పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల,అనుషమ్మ, పద్మజ,గ్రామల మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ లు,మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
