దొమ్మటి సాంబన్న కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలి…

దొమ్మటి సాంబన్న కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలి

పార్టీకోసం కష్టపడ్డా నాయకుడు సాంబన్న

అల్లం కార్తీక్ కాంగ్రెస్ యువ నాయకులు

పరకాల,నేటిధాత్రి

రాజ్యసభ ఎంపీగా దొమ్మటి సాంబయ్యకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకులు అల్లం కార్తీక్ కోరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారని
గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలతో మమేకమై సేవలందించారని పేర్కొన్నారు.అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకుడని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సాంబన్న అని అన్నారు.రాజ్యసభలో ప్రజల గొంతుకగా నిలబడగల సామర్థ్యం సాంబన్నకు ఉందన్నారు.పేదలు,రైతులు, కార్మికుల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రస్తావించగల ధైర్యం ఆయనకు ఉందని రాజకీయ అనుభవం,ప్రజాదరణ రెండూ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.అలాంటి సమయంలో సాంబన్నకు అవకాశం ఇవ్వడం సముచితమని సమాజంలోని వివిధ వర్గాల మద్దతు సాంబన్నకు ఉందని తెలిపారు.
పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని పరిగణించి అవకాశం ఇవ్వాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version