భాగ్యనగర్ తాండా 4వ వార్డు లో వ్రృద్దుల ఇంటిలోనికి చేరిన మురుగు నీరు.
పట్టించుకోని నాయకులు ప్రభుత్వం అధికారులు.
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ గ్రామపంచాయతీ పరిదిలో గల నాలుగోవ వార్డులో సందు రోడ్డులో గూగులోత్ సామిని బొజ్యా వ్రృద్దుల ఇంటి దగ్గర వర్షం నీరుతో వాగును తలపిస్తుంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంటిదగ్గర వర్షపు నీరు నిలువ ఉండిపోయి మోకాళ్ళ లోతు వ్యర్దపు నీరు వచ్చి చెరడంవలన వారు బైటకు వెళ్ళలేని దుస్థితి లో బిక్కు బిక్కు మంటూ ఇంటిలో నె ఉండవలసి పరిస్థితి ఉందని వెనకాల ఉన్న సిమెంట్ రోడ్డుకు సైడ్ కాలువ లేక పోవడం కారణంగా నిలువ ఉన్న వర్షం నీరుతో పాటు మురుగు నీరు చేరుట వలన విషజ్వరాలు మలెరియ డెంగ్యూ బారిన పడె ప్రమాదం ఉన్నదని. కోంత మంది వర్షం నీళ్ళు వేళ్ళ కుండా అడ్డుగా మట్టిని పోయించినారని వారినిఅడ్డుగ ఉన్న మట్టిని తోలగించమని వెడుకున్న కానీ తోలగించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ పక్కన ఉన్న వారిని అడిగితే గొడవలకు దిగుతున్నారని ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపాలని తెలిపారు.
Ward 4 of Bhagyanagar Tanda.
ఆ వ్రృద్ద దంపతులైన గుగులోత్ సామిని బొజ్యా మొకాళ్ళ లోతు వ్యర్దపు దుర్గందపు నీళ్ళ లో నుండె నడిచివేళ్ళె దుస్థితి లో ఉన్నారు వారి దినస్తితిని చూసిన స్థానిక నాయకులు పట్టించుకున్న నాథుడే లేడని సింగరేణి మండల ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేంబడి ఉన్న మట్టిని తోలగించి సైడు కాలువలు తిపించి ఆ వ్రృద్దుల ఇంటిలోనికి వ్యర్థ పునీరు చేరకుండ చూడండి అంటూ వారు తమ ఆవెదన వ్యక్త పర్చారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం మైలారం గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ సర్పంచులు ఎస్ వరుణ కుమారి పబ్బ సదయ్య వారి ఆధ్వర్యంలో మైలారం గ్రామంలో భూక్య సమ్మయ్య నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సమ్మయ్య నాయక్ మాట్లాడుతూ గ్రామ కమిటీ అధ్యక్షునిగా నాకు సహకరించిన పార్టీ నాయకులకు గ్రామ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు గ్రామ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మోరే మహిపాల్ ప్రధాన కార్యదర్శి కుసుమ మహేందర్ కోశాధికారి దౌడు రమేష్ కార్యదర్శి జంగా రవి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి, మవురం రాజు, రవి, నర్సీములు, బాల్ రెడ్డి,నాగరాజు,రాములు, చింతల స్వామి, ఎల్లం యాదవ్, దుర్గయ్య, నాని, మైసయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు ఉన్నారు.
నూతన ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని సన్మానించిన పాత్రికేయులు
పరకాల,నేటిధాత్రి
పరకాల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీని, కోశాధికారి గా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోగా పరకాల విలేకరుల తరఫున మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల పాత్రికేయులు ఘంటారామం రవీందర్,ఉదయం దినపత్రిక రిపోర్టర్ రాజు,నేడు సందీప్,నేటిదాత్రి రిపోర్టర్ అంబేద్కర్ ల్,వరంగల్ వాయిస్ రిపోర్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 23న జహీరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, కండేం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.
Collector Sandeep Kumar
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.
సోమవారం జరిగిన డీఎస్పీల బదిలీలో భాగంగా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిని బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్గొండ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సైదాను జహీరాబాద్ డీఎస్పీగా బదిలీ చేశారు.
పుష్కరాల వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు.
చిట్యాల నేటి దాత్రి
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల సూపర్వైజర్ జయప్రద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇన్చార్జి డి డబ్ల్యూ ఓ మల్లేశ్వరి మూడు స్టాల్స్ ను పుష్కర ఘాటు వద్ద రెండు, టెంపుల్ వద్ద ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ లో రెండు మిస్సింగ్ కేంద్రాలు ఒకటి క్రష్ ఏర్పాటు చేసి క్రష్ సెంటర్లో పిల్లలకు ఆటలు పాటలతో పాటు పోషకార పదార్థాలు అందించడం మిస్సింగ్ సెంటర్ల లొ తప్పిపోయిన పిల్లలు, వృద్దులు, మహిళలు మైకుల ద్వారా తెలిపి సేద తీర్చుటకు వసతి కల్పిస్తు పోషకాహార పదార్థాలు అందించి మళ్లీ పేరెంట్స్ కి అప్పగించడం, ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ లన్ని సఖి సెంటర్ హెల్ప్ లైన్ మహిళా శక్తీ సేవలపై అవగాహన కల్పించడం. ప్రైవేట్ స్కూల్ కు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నవని అందులో ఉన్న ఫ్రీ స్కూల్ మెటీరియల్ తో స్టాల్ పెట్టి మైకు ల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా సూపర్వైజర్స్ ముగ్గురు చొప్పున రెండు రోజుల ఒకసారి డ్యూటీ లు చేయడం జరిగిందండి. జయప్రద, సరోజ, అప్సర,సుల్తానా సూపర్వైజర్సు మహిళా శక్తి నుండి మమత సఖి నుండి మాధవి హాజరైనారు.ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గ, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మేడం ,అశోక్ , సిడిపిఓ మల్లేశ్వరి , రాధిక విజిట్ చేస్తూ ఐసిడిఎస్ సేవలను చాలా అభినందించారు.
గీతం యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పట్టా పొందిన డాక్టర్ దీప్తి..
వరంగల్ తూర్పు, నేటిధాత్రి.
వరంగల్ నగరానికి చెందిన స్కాలర్ ఆర్ దీప్తి, గీతం యూనివర్శిటీ విశాఖపట్నం లోని, స్కూల్ ఆఫ్ ఫార్మసీ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీకి అర్హత సాధించారు. ఈ విషయాన్ని ఇటీవల విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రకటించారు. గీతం యూనివర్సిటీ పరిశోధనా స్కాలర్ అయిన రయిల్లా దీప్తి “అడెనిన్-ప్రేరిత దీర్ఘకాలిక కిడ్నీ నష్టం మరియు కార్డియోవాస్కులర్ ఆల్టరేషన్స్-టార్గెటింగ్, టిజిఎఫ్, కాస్పేస్ 3, ఎంచుకున్న సహజ సమ్మేళనాల రక్షణ ప్రభావాల మూల్యాంకనం” అనే శీర్షికతో తన పిహెచ్‌డి పరిశోధనను సమర్పించింది.
Dr. Deepthi
ఆమె గీతం విశ్వవిద్యాలయంలో ఫార్మసీ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుహాసిన్ పర్యవేక్షణలో తన పరిశోధన చేశారు. వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ దీప్తి, ప్రస్తుతం హనుమకొండ జిల్లా, ఓగ్లాపూర్‌లోని కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంకిత భావంతో డాక్టర్ దీప్తి పిహెచ్‌డి పూర్తి చేయడం పట్ల తోటి స్కాలర్స్, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు దీప్తిని అభినందించారు.
గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో సిరిసిల్ల జడ్జి ప్రత్యేక పూజలు
సిరిసిల్ల టౌన్ మే 20 (నేటిధాత్రి):
ఈరోజు పట్టణ కేంద్రంలోని బహుళ అష్టమి సందర్భంగా సిరిసిల్లలోని గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి వారి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాధికా జైస్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్ , ఆలయ కార్యదర్శి కుడిక్యాల శంకర్ మేజిస్ట్రేట్ ని శాలువాతో సన్మానించారు. అలాగే ఆలయ పూజారి గోషికొండ సత్తయ్య పంతులు జడ్జి కి ఆశీర్వచనాలు అందించారు. వీరి వెంట ఆలయ కమిటీ సభ్యులు పంతం రవి, శ్రీపతి పరుశరాం, చిలగాని శ్రీనివాస్ ఉన్నారు.
ప్రత్యక్ష పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిరచిన బీజేపీ నేతలు
ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మపై ప్రజల్లో సడలని విశ్వాసం
సంస్థాగత లోపాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్
డెస్క్ ,నేటిధాత్రి:
అస్సాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏకూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలో తన రాజకీయ ఆధిపత్యాని కి తిరుగులేదని నిరూపించింది. రాష్ట్రంలోని మొత్తం 376 జిల్లాపరిషత్ స్థానాల్లో 301 గెలుచు కున్న ఎన్‌డీఏ కూటమి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. వీటిల్లో కూటమికి 76శాతం ఓట్లు లభించడం విశేషం. ఈ అప్రతిహత విజయం ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఇక రాష్ట్రంలోని అంచలోక్ పంచాయతీ (ప్రాతినిధ్య పంచాయతీ ఎన్నికలు)ఎన్నిల్లో మొత్తం 2192 సీట్లలో 1445 సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి తనకు తిరుగు లేదని నిరూపించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 66శాతం ఓట్లు సాధించడంతో తనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరుగులేదన్న సత్యాన్ని వెల్లడిరచింది. 2018లో కూటమి సాధించిన ఓట్లకంటే ఇప్పుడు మరిన్ని ఓట్లు సంపాదించడం గమనార్హం. ఇదే సమయంలో గత ఎన్నికల్లో పోలయిన ఓట్లశాతంతో పోలిస్తే 25% వృద్ధి నమోదు చేయడం కూటమికి అస్సాంలో తిరుగులేద న్న సత్యం రుజువైంది. విచిత్రమేమంటే లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2024 సంవత్సరానికి సరిగ్గా ఏడాది తర్వాత, 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ ఎన్నికలు జరగ డం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లాపరిషత్ (జెడ్‌పీఎం)లో 72 స్థానాలు, అంచలోక్ పంచాయతీలో (ఏపీఎం)లో 481 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా ఏఐయుడీఎఫ్ 8 జెడ్‌పీ ఎం స్థానాలను, ఏపీఎంలో 64 స్థానాలకు పరిమితమైంది. ఇక అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని రాయ్‌జోర్ దళ్ మూడు జెడ్‌పీఎం మరియు 17 ఏపీఎం సీట్లను గెలుచుకుంది. అస్సాంలో పంచాయతీ ఎన్నికలు మే 2, 7 తేదీల్లో జరగ్గా 11వ తేదీన కౌంటింగ్ ప్రారంభమై 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అస్సాంలో మొత్తం 14 మిలియన్లమంది ఓటర్లుండగా 74శా తం ఓటింగ్ నమోదైంది.
అస్సాం పంచాయతీ చట్టరా1994 ప్రకారం రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పడిరది. అయితే 2023లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ సవరణ చట్టం అభ్యర్థులకు రాజకీయ గుర్తుల కేటాయింపునకు అనుమతించింది. అయితే గోవన్ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థు లకు పార్టీ గుర్తులు కేటాయించలేదు. నిజానికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 2023లోనే జరగాల్సి వుంది. శ్రీభూమి జిల్లాలో డీలిమిటేషన్ ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, హయ్యర్ సెకండరీ పరీక్షలు ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించాల్సి రావడంతో, ఈ ఎన్నికలను మే నెలలో నిర్వ హించారు.
ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆసక్తి ప్రదర్శించిన నియోజకవర్గం జోర్హాట్. ఎందుకంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో జోర్హాట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. హిందువులు అత్యధికంగా వుండే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు విపక్షాల్లో ఆశలు పెంచింది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లు సాధించవచ్చునని కాంగ్రెస్ ఎంతో నమ్మకంతో వుంది. కానీ పార్టీ ఆశలను వమ్ము చేస్తూ కేవలం మూడు అంచలోక్ సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీ ఏకంగా 73 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), అఖిల్ గొగోయ్ (రాజోరీదళ్), లూరింజ్యోతి గొగోయ్ (అస్సాం జాతీయ పరిషత్)లు ముగ్గురు ఏకమై ఈ సారి పంచాయతీ ఎ న్నికల్లో ప్రచారం నిర్వహించారు. విశేషమేంటంటే ఈ ముగ్గురిని పరిశీలకులు ‘‘ముగ్గురు గొగోయ్‌ల కూటమి’’ అంటూ వ్యవహరిస్తుంటారు. వీరిలో గౌరవ్ గొగోయ్ ప్రధాన స్రవంతికి చెందిన రాజకీయవేత్త కాగా, అఖిల్ గొగోయ్‌కి రైతు ఉద్యమాలు నిర్వహించినవాడిగా మంచి పేరుంది. ఇక లూరింజ్యోతి గొగోయ్ అస్సామీ మరియు అహోం భాషోద్యమాలు నిర్వహించిన చరిత్ర వుంది. నిజానికి జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టుండేది. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో అస్సామీ, అహోం హిందూ విద్యావంతుల్లో పెరిగిన వ్యతిరేకత బీజేపీ ఓటమికి కారణమైంది. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ పుంజుకోవడం విశేషం.
గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అంత్యలోక్ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్లశాతం, సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. 2018లో 55శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ, ఇప్పుడు ఏకంగా 75శాతం ఓట్లు సాధించింది. ఇదే కాంగ్రెస్‌కు గతంలో 35% ఓటు షేర్ వుండగా ఇప్పుడది 18%కు కుంచించుకుపోయింది. ఎగువ ఆస్సాం ప్రాంతంలో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే కేవలం ఎగువ అస్సాం మాత్రమే కాదు, మొత్తం అస్సాంలో కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా పోటీపడిన దాదాపు ప్రతిచోట బీజేపీ విజయం నమోదు చేసింది. అయితే బార్పేట, దరాంగ్, ధుబ్రి, హోజాయ్ నియోజకవర్గాల్లో మైనారీటీల ఓటర్లు అధికం. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు సాధించింది.
మొత్తంమీద చెప్పాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఓరునోదయ్’ నగదు బదిలీ పథకం, ప్రభుత్వానికి అనుకూల ఫలితాలనిచ్చిందనే చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల కల్పన కోసం నిర్వహించిన డ్రైవ్ కూడా ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచింది. వీటితో పాటు కొన్ని సాంస్కృతిక అంశాలు కూడా అధికారంలో వున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఏర్పడటానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘రaుమోయ్ బినందిని’’ పండుగను తోటపనుల్లో పాల్గనే స్థానిక ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ నిర్వహణలో ప్రభుత్వం పాల్గనడం ద్వారా స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు ముఖ్య మంత్రి హిమంత్ బిశ్వ శర్మ అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలు ప్రజలను ఆకట్టుకుం టున్నాయి.
ప్రస్తుతం జరిగిన ఈ ఎన్నికల్లో సాధించిన విజయం, అధికార ఎన్డీఏ కూటమిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా 2026లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 104 స్థానాలున్న అసెంబ్లీలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలు మా ర్గం సుగమం చేశాయని కూటమి నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విపక్ష కాంగ్రెస్‌లో సంస్థాగత లోపాలు స్పష్టంగా కనిపించాయి. వీటిని సరిదిద్దుకొని సరైన నాయకుల నేతృత్వంలో పార్టీని మరింత సమర్థవంతంగా నడపకపోతే రాబోయే ఎన్నికల్లో గెలుపు మాట అట్లా వుంచి ఉనికి కూడా కష్టమయ్యే ప్రమాదం వుంది.
భవిష్యత్తులో ఆధునిక ఆయుధాలు, సాంకేతికత యుద్ధ ఫలితాలను నిర్ణయించలేవు
ఆపరేషన్ సింధూర్‌తో బలూచ్ ఉద్యమానికి ఊతం
పాక్‌ను లంగదీయడానికి సింధూజలాలే బ్రహ్మాస్త్రం
క్యాన్సర్‌లా తొలిచేస్తున్న అంతర్గత శత్రువులు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మనదేశం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలనుధ్వసం చేయడమే కాకుండా సుమారు వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇదే సమ యంలో పాకిస్తాన్‌కు చెందిన 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడమే కాదు, దాని ఆణ్వస్త్ర ప్రాంతాలపై దాడిచేయగలమన్న సంకేతాన్ని స్పష్టంగా అందించింది. మరి ప్రపంచంలోనే అ త్యంత ధూర్త దేశమైన పాకిస్తాన్‌కు ఈశిక్ష సరిపోతుందా? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే విధించే శిక్ష ఎదుటివాడిలో భయం కలగడానికి లేదా ఇకముందు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వుండటానికి నిర్దేశించినదై వుంటుంది. కానీ ధూర్త దేశమైన పాకిస్తాన్ ఈ చర్యతో గుణపాఠం తెచ్చుకుంటుందని అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరోటుండదు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ తాత్కాలికంగా దెబ్బతినుండవచ్చు, కానీ దాని బుద్ధి మార్చుకునేందటి స్థాయిలో గాయం కలిగించలేదన్నది మాత్రం వాస్తవం. అటువంటప్పుడు ఈ ఆపరేషన్ వల్ల మనం సాధించిందేంటి? కలిగిన లాభనష్టాలేంటనే ప్రశలు సహజంగానే ఉదయిస్తాయి.
ఈ ఆపరేషన్ వల్ల అద్భుతమైన మన సాంకేతిక పరిజ్ఞానం, మన ఆయుధసంపత్తి పాటవం, త్రివిధ దళాల సమన్వయ సామర్థ్యం ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఇది మనకు కలిగిన మొదటి ప్రయోజనం. పహల్గామ్ సంఘటనకు ప్రతీకారంగా భారత్ బహుశా బాలాకోట్ లేదా అంతకంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ప్రతికారదాడులకు పాల్పడవచ్చునని పాకిస్తాన్ వ్యూహకర్తలు, సైన్యంఅంచనా వేసివుండవచ్చు. కానీ ఈ స్థాయిలో భారత్ దాడిచేస్తుందని వారు కల్లోకూడా ఊహించి వుండకపోవచ్చు. ఒకవేళ ఆవిధంగా అంచనావేసినట్లయితే పాకిస్తాన్ తప్పనిసరిగా తగిన జాగ్ర త్తలు తీసుకొని వుండేది. అందుకు చైనా దన్ను ఎలాగూ దానికి వుంది. ఈసారి మనం దాడులుతలపెడితే పాక్ స్పందన కచ్చితంగా భిన్నంగా మరింత సామర్థ్యంతో వుండితీరుతుంది. శత్రువు అజాగ్రత్తగా వున్నప్పుడు లేదా అంచనా సరిగ్గా వేయనప్పుడు మనం చేసిన దాడి ఉత్తమ ఫలితాలిచ్చిన మాట వాస్తవం. కానీ ఈసారి పరిస్థితి ఈవిధంగా వుండకపోవచ్చు. అదీకాకుండా ధ్వంసమైనవన్నీ చైనా ఆయుధాలు కనుక, చైనా అహంకారం పూర్తిగా దెబ్బతిన్నది. అంతేకాదు అంతర్జాతీయంగా దాని ఆయుధమార్కెట్ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఈ నేపథ్యంలో పాకి స్తాన్‌ను మరింత బలోపేతం చేసి భారత్‌ను మరింత దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమని భా వించిన తమవద్ద ఉన్న ఉత్తమ ఆయుధాలను దానికి సమకూర్చే అవకాశాలే ఎక్కువ. చేతిలో చిల్లిగవ్వలేని పాకిస్తాన్‌కు ఇదొక అయాచితవరంగా మారకూడదనేంలేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్ తన సామర్థ్యం విషయంలో చైనాను కూడా దాటిపోయిందన్న సందేశం ప్రపంచ దేశాల కు వెళ్లింది. ఇదే సమయంలో ఇప్పటివరకు ప్రపంచానికి వెల్లడికాని చైనా ఆయుధ పాటవంలోని డొల్లతనం ప్రస్ఫుటంగా తెలిసిపోయింది. పాకిస్తాన్‌కు ఇప్పటికే ఏవిధమైన పరువు లేదు కనుక ఈ ఓటమితో దానికి పోయిందేమీ లేదు. కానీ చైనా ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదన్న మాట వాస్తవం. పోయిన ప్రతిష్టను నిలుపుకునేందుకు చైనా అనుక్షణం అవకాశం కోసం ఎదురుచూ స్తుంటుంది. ఇప్పుడు చైనా తన ప్రతిష్ట కాపాడుకోవడం కోసం పాక్‌ను తన ఆయుధ సంపత్తితో మరింత బలోపేతం చేసి భారత్ తనకు సరిసమానంగా ప్రపంచం పరిగణించకుండా వుండటానికి ప్రయత్నించి తీరుతుంది. అమెరికాను మించిపోవాలని ప్రయత్నిస్తున్న చైనా, తనకు సవాలు విసిరే స్థాయిలో భారత్‌ను ఎంతమాత్రం చూడలేదు. దాని దౌర్భాగ్యమేంటంటే అమెరికాతో వాణిజ్య యుద్ధం, ఆపరేషన్ సింధూర్ పుణ్యమాని కుప్పకూలుతున్న డిఫెన్స్ మార్కెట్, మరోవైపు ప్ర పంచ తయారీ హబ్‌గా ఇప్పటివరకు సుస్థిరంగా కొనసాగిన తన పేరు క్రమంగా దెబ్బతింటుండటం, అంతర్గతంగా కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ వంటివి చైనాను పట్టిపీడిస్తున్నాయి. అందువల్ల భారత్‌తో 1962 నాటి దుస్సాహసం ఇప్పుడు చేయడం సాధ్యంకాదు. కేవలం తన ప్రాక్సీ పాకిస్తాన్ ద్వారానే తన లక్ష్యాలు సాధించుకోవాలని చూస్తుంది. ఇక పాకిస్తాన్ జనరల్స్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ వంటివారు జిహాదీ ఉద్యమం ద్వారానే తమ పదవులను సుస్థిరం చేసుకోవాలని చూస్తారు కనుక వారు ఉగ్రవాద నెగళ్లను ఎగదోస్తారు తప్ప విరమించుకోరు. ఇక జిహాదీ ఉగ్ర వాదులు తమ మనసుల్లో నాటుకుపోయిన ‘‘ఆత్మబలిదానం ద్వారా 72మంది అప్సరసలను చేరుకోవడం’’ అనే ఒక విచిత్ర విశ్వాసం నుంచి బయటకు రాలేరు. దీనివల్ల ఉగ్రవాదం సమసిపో దు. ఉగ్రవాదులు పుట్టుకొస్తూనే వుంటారనేదానికంటే మతఛాందసులు ఇటువంటి ప్రలోభాలతో ఉగ్రవాదుల ఉత్పత్తిని కొనసాగిస్తూనే వుంటారనుకోవడం సమంజసం.
పరివర్తనశీలమైన ఈ ప్రపంచంలో అనుక్షణం యుద్ధతంత్రం మారిపోతున్నది. రాబోయే యుద్ధా లు భౌతికం కంటే సాంకేతికత, కృత్రిమమేథ ఆధారంగా జరుగుతాయని ఆపరేషన్ సింధూర్ చెప్పకనే చెప్పింది. రాబోయేకాలంలో ఎఫ్`16, ఎఫ్`35, ఎస్‌యు`57, సుఖోయ్, రాఫెల్ వంటి యుద్ధవిమానాల వల్ల పెద్దగా ప్రయోజనం వుండకపోవచ్చు. ఎందుకంటే యుద్ధరీతి డ్రోన్‌ల వినియోగంవైపు మళ్లింది. అజర్‌బైజాన్`అర్మీనియా యుద్ధం డ్రోన్ల ప్రాధాన్యతను తెలియజేస్తే, ఆపరేషన్ సింధూర్ డ్రోన్‌లను నిలువరించే రక్షణ సాంకేతికత ఆవశ్యకతను ప్రపంచానికి వెల్లడిరచింది. ఇంతగా సాంకేతికత మారిపోతున్నప్పటికీ, సంప్రదాయికంగా వస్తున్న జిహాదీ ఉగ్రవాదంలో కూడా ఇవేరకమైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించే కాలం రాకమానదు. అంటే సాంకేతిక ప్రగతి అనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి అంతుండదు!
ఇప్పటికి ఆపరేషన్ సింధూర్‌లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయం విలువ ప్ర పంచానికి వెల్లడైంది కనుక ఈ రెండు అంశాల్లో రాబోయేకాలంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. అందువల్ల భారత్ రాబోయేకాలంలో సరికొత్త వ్యూహాత్మక పద్ధతులు అనుసరించక తప్పదు. అయితే పాకిస్తాన్‌ను కట్టడిచేయడానికి ఈ సాయుధ పోరాటం లేదా సంఘర్షణ ఎంతమాత్రం పనిచేయవన్నది సుస్పుష్టం. ఈ నేపథ్యంలో భారత్ సాంకేతిక అభివృద్ధితో పాటు జిహాదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి కొన్ని ‘ఉప`సంప్రదాయిక’ పద్ధతులు అనుసరించక తప్పదు. ప్రస్తుతం మనదేశం వీటిని అనుసరిస్తున్నది కూడా! 2030 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న అంచనాల నేపథ్యంలో భారత్ ఈవిధంగా సైనిక సంఘర్షణలకు దిగడంఅభివృద్ధిపరంగా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అదీకాకుండా మనల్ని ఆర్థికంగా దెబ్బకొట్టా లనుకునే పాక్, చైనాలకు ఇది వరంలా మారుతుంది కూడా!
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు నిద్రపట్టకుండా చేయాలంటే, అంతర్గత సంఘర్షణలను చల్లారకుం డా ఎగదోయడమే మార్గం. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ వల్ల, బలూచ్ విమోచనోద్యమానికి ఎంతో ప్రోత్సాహం లభించింది. పాక్ రక్షణ వ్యవస్థలను, వాయుసేన స్థావరాలను ధ్వంసం చేయడంవల్ల దెబ్బతిన్న పాక్ సైన్యంపై బలూచ్ వీరులు మరింత విరుచుకుపడే అవకాశం లభిం చింది. ప్రస్తుతం ఇది జరుగుతున్నది కూడా. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు స్వతంత్ర బలూచిస్తాన్‌ను బలూచ్ సాయుధులు ప్రకటించడం, పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ. తన సైన్యాన్ని పూర్తి సాయుధ సంపత్తితో బలూచ్‌లపై దాడులకు ఉపయోగించలేని పరిస్థితి. ఇప్పటికే ఆర్థి కంగా దివాలాతీసిన స్థితిలో ఇంతటి ఖర్చును పాక్ భరించలేదు. పోనీ చావోరేవో అని బలూచ్‌ల పై సైనిక చర్య తీసుకుంటే, వాయువ్య ప్రాంతంలో తాలిబన్లు కాచుకు కూర్చున్నారు. పీఓకేలో ప్రజల నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే వీటికి పెద్దగా మీడియా కవరేజీ రావడంలేదు. పంజాబ్ రాష్ట్రం తమకు నీళ్లు వదలడంలేదంటూ సింధూ రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సింధూ నదీ జలాలను భారత్ ఆపేయడంతో, అసలు మొత్తానికే పాక్ విలవిలలాడుతోంది. నీరు వదలక పోతే రక్తం పారుతుందని బీరాలు పలికిన నాయకులు ఇప్పుడు నోరు మెదపడంలేదు. మన జలశక్తి వనరుల శాఖకు పాకిస్తాన్ ఒక లేఖరాసింది. నీటి ఎద్దడి తీవ్రంగా వుంది…సిందూ జలాలను దిగువకు వదలమన్నది ఆ లేఖ సారాంశం. పాక్ వంటి ధూర్తదేశానికి తక్షణ మరియు శాశ్వత ఇబ్బందిని కలిగించేది సింధూనదీ జలాలు మాత్రమే నన్నది ప్రస్తుతం సుస్పష్టమైంది. భారత ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకు కఠినవైఖరినే అనుసరిస్తోంది.
మరో ముఖ్య విషయమేంటంటే భారత్‌ాపాక్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేసింది తానేనని ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. ఒబామాకు నోబెల్ ప్రైజ్ వచ్చినట్టుగానే తనకు కూడా శాంతి బహు మతి రావాలన్నది ఆయన ఆకాంక్ష కావచ్చు. అయితే చైనా విషయంలో ట్రంప్ అనుసరించినట్టు గా మనం కూడా పూర్తి శత్రుత్వ వైఖరితో వ్యవహరించే పరిస్థితి లేదు. ఇది చైనాకూ వర్తిస్తుంది. ఇప్పటికీ మనదేశంలోని చాలా పరిశ్రమలు ముఖ్యంగా ఔషధరంగానికి కావలసిన ముడిసరుకు చైనానుంచే సరఫరా అవుతుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యలోటు చాలా అధికం. డోనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్యలోటును అధిగమించడానికి టారిఫ్‌ల యుద్ధానికి తెరతీశారు. ఇదేవిధానం నుసరిస్తే అంతకుమించిన మూర్ఖత్వం మరోటుండదు. ఇప్పటికీ వాణిజ్యం విషయంలో చైనాను మనం పక్కన పెట్టలేం. అందువల్ల ఈ లోటును పూడ్చుకోవడానికి ఇతర మార్గాలు ఎన్నుకోవ డం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. ముఖ్యంగా మనం కూడా ప్రపంచ తయారీ హబ్‌గా తయారవాలంటే ఇప్పటికప్పుడు సాధ్యమయ్యేదీ కాదు. అందువల్ల ఔనన్నా కాదన్నా చైనాతో మనకు ‘శత్రుామిత్ర’ మిశ్రమ వైఖరి అనుసరించక తప్పదు.
అన్నింటికన్నా మనదేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం మరోటుంది. అంతర్గతం గా పనిచేస్తున్న దేశవ్యతిరేకులు మరియు అతిచైతన్య దేశభక్తులతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఉగ్రస్థావరాలపై దాడులు జరిపిన తర్వాత, పాక్ మనపై యుద్ధానికి ఉపక్రమిస్తే, మనదేశంలో శాంతి కాముకుల లాబీ ఒక్కసారిగా చైతన్యవంతమైంది. యుద్ధంవల్ల అంతా నష్టమే కాబట్టి మనం తక్షణం ఉపసంహరించుకోవాలంటూ ఈ శాంతికాముక లాబీ సుద్దులు చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాదు ఉగ్రస్థావరాలను ధ్వంసంచేసి భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిస్తే, ఈ విజయాన్ని కూడా బలహీనపరచే స్థాయిలో వీరి కథనాలు వెలువడటం విచిత్రం. పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల చర్యను మరుగునపడేసి, మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని, యుద్ధం మంచిదికాదంటూ వీరి ప్రచారం కొనసా గింది. ఇక అతిచైతన్య దేశభక్తులు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా పీఓకేను ఆక్రమించాల్సింది ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేజేతులారా వదిలేసిందంటూ వీరి భావోద్వేగాలు! ప్రభుత్వంలో వి ధానకర్తలు, పటిష్ట నాయకత్వం అటువంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుం టారు. అంతేకాని, తాత్కాలిక భావోద్వేగాలకు లేదా యుద్ధంవల్ల నష్టం వస్తుందని చెప్పే సుద్దులను వారు పట్టించుకోరు. ఆపరేషన్ సింధూర్ వల్ల మన ప్రతిష్ట పెరగడమే కాదు, డిఫెన్స్ రంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో మనకు సానుకూల వాతావరణం ఏర్పడిరదన్నది సత్యం. ప్రపంచం మనల్ని చూసే విధానంలో సమూలంగా మార్పు తీసుకొచ్చింది. దీన్ని ఈ రెండు వర్గాలుగుర్తించాలి.
-అప్పటి నాయకులను కాదని కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదా!
-కాంగ్రెస్ కష్టకాలంలో వున్నప్పుడు గెలిచావా?
-కాంగ్రెస్ గాలిలో గెలవడం తప్ప ఎదురీతలో ఎమ్మెల్యే అయ్యావా!
-పట్టుమని ఇద్దరు ఎమ్మెల్యేలనైనా ఒంటి చేత్తో గెలిపించావా!
-నీ గెలుపు కోసం అప్పటి పెద్ద నాయకుల మీద ఆధారపడలేదా!
-పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చిన ‘‘పొంగులేటి’’ మీదనా నీ విరుపు.
-42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల గెలుపులో ‘‘పొంగులేటి’’ హస్తం.
-హస్తం పేరుతో రాజకీయం తప్ప త్యాగం లేనిది జీవన్ రెడ్డి వ్యవహారం.
హైదరాబాద్,నేటిధాత్రి:
మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. జీవన్‌రెడ్డికి అసహనం తన్నుకొస్తోంది. కోపం కట్టలు తెంచుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను చూస్తేనే ఆయనకు చిర్రెత్తుకొస్తోంది. పైగా ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న నాయకులను చూసినా, ఆఖరుకు మంత్రులను చూసినా ఆయన సహనం కోల్పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్దం కాకుండా ప్రవర్తిస్తున్నారు. మంత్రులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఆ నాయకులు ఇస్తున్న గౌరవం కూడా పుచ్చుకునేందుకు సిద్దంగా లేడు. కారణం తనకు పదవి లేకపోవడం. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడికైనా పదవి అనేది ప్రజలు ఇచ్చేది. దాన్ని దూరం చేసుకున్న తర్వాత పొందడం ఎంతో కష్టం. ఎందుకంటే నిజంగానే టి. జీవన్‌రెడ్డి ప్రజా నాయకుడైతే, ప్రజల మేలు కోరుకునే నాయకుడైతే, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుండే నాయకుడే అయితే ఆయనకు ఓటమి దరి చేరి వుండేదికాదు. జీవన్‌రెడ్డికి గెలవడం కొత్త కాదు. ఓడిపోవడం కూడా కొత్త కాదు. కాని గతంలో పదవులు వచ్చేవి. కాని తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ వేరు. ఇప్పుడు కాంగ్రెస్ వేరు. అప్పుడు ఉమ్మడి పాలకులకు సద్దులు మోస్తే పదవులు వచ్చేవి. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తే పదవులు వస్తున్నాయి. ఈ విషయం ఇంకా జీవన్‌రెడ్డి గమనించినట్లు లేరు. అందుకే తనకు పదవులు కావాలనగానే ఒళ్లో వాలిపోతాయనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చర్చించుకోవాలి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల పర్యటనకు వచ్చారు. సీనియర్ నాయకుడిగా జీవన్‌రెడ్డిని కాదనేవారు లేరు. ఆయన అధికారిక కార్యక్రమంలో పాలు పంచుకుంటే వారించేవారు లేరు. అడ్డుకునేవారు అసలే లేరు. పైగా అభివృద్ది పనుల కోసం మంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఎంతో హుందాగా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జీవన్‌రెడ్డి బాధ్యత. జగిత్యాల అభివృద్ది ప్రణాళిక ఆయన కర్తవ్యం. అది మర్చిపోయి సొంత పార్టీ ప్రభుత్వాన్ని పది మందిలో పలుచన చేయడం ఆయన వయసుకు సరైంది కాదు. ఆయన హోదాకు అసలే మంచిది కాదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. అందులో ఒకసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఐదుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. అది కూడా కాంగ్రెస్ పెట్టిన బిక్ష వల్లనే గెలుపొందారు. ఇది చాలదా? ఇంకా పదవులు కావాలా? అయినా ఎప్పుడూ నాకే పదవి కావాలి. ఎప్పుడూనేనే అదికారంలో వుండాలనుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని ప్రజాస్వామ్యంలో మాత్రం ఒక్కరే ఎల్లకాలం పదవులు అనుభవించాలనుకోవడం కూడా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం. గతంలో కూడా అనేక సార్లు జీవన్‌రెడ్డి ఓటటి పాలయ్యారు. కాని అప్పుడు పార్టీ ఆయనను పక్కన పెట్టలేదు. ఆయన గౌరవానికి భంగం కల్గించలేదు. గెలిచినా, ఓడినా ఆయనకు టిక్కెట్లు ఇస్తూనే వచ్చింది. పార్టీ ఆయనను గెలిపిస్తూనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంత కాలం ఆయనకు మంత్రి పదవి కూడా అవకాశమిచ్చింది. గౌరవించింది. ఇంతకన్నా పార్టీ ఏం చేయాలి. పదేళ్లపాటు కాంగ్రెస్‌పార్టీ ప్రతిపక్షంలో వున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు అధికారానికి దూరమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎలా అదికారంలోకి వచ్చింది? ఎందుకు వచ్చింది? అనే సంగతి జీవన్‌రెడ్డికి తెలియందా? జగిత్యాల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంత గౌరవంగా పెద్దమనిషిగా జీవన్‌రెడ్డికి అభివాదం చేశారు. ఆలింగనం చేసుకోవాలనుకున్నారు. కాని దాన్ని తిరస్కరించడం అనేది జీవన్‌రెడ్డి తలబిరుసు తనమనే చెప్పాలి. ఆ సమయంలో ఆయన హావభావాలు ఎంతో భయంకరంగా వున్నాయి. అదే సమయంలో జీవన్‌రెడ్డి తన అనుచరల ముందు మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞాపన పత్రమిచ్చారు. అది శ్రీనివాస్‌రెడ్డి తీసుకున్నారు. వెంటనే వెళ్లండి…మీ పనులు మీరు చూసుకోండి. మా పనులు మేం చేసుకుంటాం…ఇక మేరు ఏలుకోండి? అంటూ హేళన చేసినట్లుగా జీవన్‌రెడ్డి వ్యాఖ్యనించారు. జీవన్‌రెడ్డి వ్యాఖ్యల వల్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పోయేదేమీ లేదు. కాని జీవన్‌రెడ్డి తనకు తానుగా తన గౌరవాన్ని తనే తగ్గించుకున్నారు. తాను ఆవేశపరుడినని నిరూపించుకున్నారు. కాంగ్రెస్‌లో వుంటూ ప్రభుత్వ కార్యక్రమంలో పాలుపంచకోవాల్సిన జీవన్‌రెడ్డి, కార్యక్రమ విశిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడం పార్టీ వ్యతిరేకతగానే భావించాలి. అయినా ఆయన అక్కసు మంత్రి శ్రీనివాస్ రెడ్డి మీద చూపించాల్సిన అసవరం లేదు. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, జీవన్‌రెడ్డిది ఒకే జిల్లా కాదు. టీ.జీవన్‌రెడ్డి రాజకీయాలతో పొంగులేటి ప్రభావితమైనదేమీ లేదు. పొంగులేటికి రాజకీయ అవకాశాలు ఇచ్చిన చరిత్ర జీవన్ రెడ్డికి లేదు. నిజంగా నికార్సైన కాంగ్రెస్ వాదే జీవన్‌రెడ్డి అనుకున్నప్పుడు పార్టీ అధిష్టానంతో మాట్లాడుకోవచ్చు. అంత అర్హత వుంటే పదవులు తెచ్చుకోవచ్చు. ఒక వేళ పార్టీ జాతీయ నాయకత్వం జీవన్‌రెడ్డికి పదవి ఇవ్వాలంటే, ప్రజా ప్రతినిధిని చేయాలనుకుంటే రాష్ట్ర నాయకులు ఎవరూ అడ్డుచెప్పరు. అంత సాహసం కూడా చేయరు. కాని ఆయన అక్కసంతా రాష్ట్ర నాయకుల మీదనే…ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అదికారంలోకి వచ్చిందన్న అక్కసుతో జీవన్‌రెడ్డి వున్నారా? అన్న అనుమానం కూడా కల్గుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే తన ప్రాదాన్యత తగ్గిపోతుంది..ప్రతిపక్షంలో వుంటే తనకు గౌరవం లభిస్తుందని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశాలులేకపోలేవు. ఎందుకంటే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల అందరికంటే ముందుగా సంతోషపడాల్సింది జీవన్‌రెడ్డి. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. తన పార్టీ అధికారంలోకి వస్తే చాలు. కాంగ్రెస్ పార్టీ అదికారంలో వుంటే చాలు అనుకోవాలి. కాని ఆయనకు ఆ సంతోషం లేదు. ఆ ఆనందం అసలే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నా, లేకున్నా తనకు పదవి మాత్రం ముఖ్యమనుకునేలా జీవన్‌రెడ్డి వ్యవహార శైలి వుంది. తాను మాత్రమే కాంగ్రెస్ వాదినన్నట్లు ఆయన వ్యహరిస్తున్నారు. నిజానికి జీవన్‌రెడ్డి ఆది నుంచి కాంగ్రెస్ నాయకుడు కాదు. ఆయన ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు. రాజకీయ ఓనమాలు తెలుగుదేశంలో దిద్దుకున్నాడు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఎన్టీఆర్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. మొదటి సారి ఎమ్మెల్యే అయినా ఆయన రాజకీయ చంచలత్వం అప్పటి నుంచే చూపించడం మొదలు పెట్టారు. రాజకీయ అత్యాశను అప్పటి నుంచే ప్రదర్శించారు. జీవన్‌రెడ్డికి టికెట్ ఇచ్చి, గెలిపించిన ఎన్టీఆర్‌ను మర్చిపోయారు. నాదేండ్ల బాస్కర్‌రావు వర్గంలో చేరిపోయారు. మరో నెల రోజుల కోసం ఆశపడి మొత్తానికే తెలుగుదేశానికి దూరయ్యారు. నాదేండ్లను నమ్ముకొని, అత్యాశకు పోయి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. తెలుగుదేశం నుంచి భహిష్కరించబడ్డాడు. నాదేండ్లతోపాటు కాంగ్రెస్‌లో చేరిపోయాడు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాడు. తర్వాత కాంగ్రెస్ గెలిచినప్పుడల్లా గెలుస్తూవచ్చాడు. అంతే కాంగ్రెస్‌కు ఆయన వల్ల ఒరిగిందేమీ లేదు. పైగా జీవన్‌రెడ్డి పచ్చి సమైక్య వాది. తెలంగాణ వ్యతిరేకి. ఉమ్మడి పాలకుల చెప్పినట్లు ఆడిన మర బొమ్మ అని అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపిగా గెలిచిన కేసిఆర్‌కు రాజీనామాకు పరోక్షంగా జీవన్‌రెడ్డి కారకులయ్యారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం కరీంనగర్‌లో లేదని నిరూపించేందుకు కేసిఆర్ మీద పోటీ చేశారు. ఆ సమయంలో కేసిఆర్ మీద పోటీ చేయడానికి ఇష్టపడలేదు. తెలంగాణ కోరిక ప్రజల్లో లేదని చెప్పడానికి ఎవరికీ మనసు రాలేదు. అందుకే ఆ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కాని అప్పటికే మంత్రిగా పనిచేస్తున్న జీవన్‌రెడ్డి నేను పోటీ చేస్తానని వచ్చారు. కేసిఆర్‌ను ఓడిస్తానని సవాలు చేసి, రంగంలోకి దిగారు. మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే ఎంపిగా పోటీ చేశారు. ఓడిపోయారు. అయినా ఆయన తెలంగాణ వాది కాలేకపోయారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేస్తే జీవన్‌రెడ్డి రాజీనామా చేయడానికి ముందూ వెనుక ఆలోచించాడు. అయినా ఆ రాజీనామాకు కట్టుబడి లేకుండా వెంటనే రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి పచ్చి అవకాశవాదిగా ముద్ర పడిన జీవన్‌రెడ్డి, తానేదో ఫక్తు కాంగ్రెస్ నాయకుడిగా చెప్పుకోవడం విడ్డూరం. గత ఎన్నికల్లో 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒంటిచేత్తో గెలిపించి, పార్టీ అదికారంలోకి రావడానికి కృషి చేసిన పొంగులేటి మీద అక్కసు చూపించి, జీవన్‌రెడ్డే అబాసు పాలయ్యారు. తన పెద్దరింకంలో గొప్పతనంలేదని, కుత్సిన గుణం వుందని మరోసారి నిరూపించుకున్నారు.
జిల్లా కలెక్టర్ తో కలసి అధికారులు, రైస్ మిల్లర్లతో నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే సమీక్ష.
నర్సంపేట,నేటిధాత్రి:
అకాల వర్షాలు,గాలిబేవత్సానికి రైతులు నష్ట పోకుండా ధాన్యం కొనుగోలుల పట్ల వేగంపెంచాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.సోమవారం నర్సంపేట రైతు వేదికలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలసి అధికారులు, రైస్ మిల్లర్లతో నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు.
Rice Millers.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రబి కాలంలో నియోజకవర్గంలోని 6 మండలాల్లో అధిక వరి దిగుబడి వచ్చిందని, ఇప్పటివరకు 40 శాతం ధాన్యం కొనుగోలు చేసారని అన్నారు. క్షేత్ర స్థాయిలో మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి అధికారులు ధాన్యం నిలువ వివరాలు సేకరించి ,దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా లారీలను, హమాలీలను ఏర్పాటు చేసుకొని వేగవంతంగా మిల్లులకు తరలించాలని సూచించారు.రైస్ మిల్లర్లకు సామర్ధ్యాన్ని బట్టి వెంటనే కేటాయింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. కొంత మంది మిల్లర్లు కావాలని తరుగు పేరుతో రైతులను ఇబ్బం దులు పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ట్రక్ షీట్ ప్రకారమే తీసుకోవాలని కోతలు విధిస్తే ఉపేక్షించేది లేదన్నారు. 1638 రకం ధాన్యం ను గ్రేడ్ ఏ క్రింద పరిగణించి వాటిని తిరస్కరించకుండ తీసుకోవాలని తెలిపారు.ఎక్కువ నూకలు వస్తున్నాయని బోయిల్డ్ రైస్ క్రింద తీసుకోనుటకు అనుమతించాలని మిల్లర్లు ఎమ్మెల్యే కు తెలుపగా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకొంటామని ఎమ్మెల్యే అన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజ ను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో 1.07 మెట్రిక్ టన్నుల అంచనా ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 31.54 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. , ఇంకను 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓపిఎం ఎస్ నమోదు వెంటనే చేయాలని,తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపించాలని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలను వెంటనే ఖాళీ చేసే ప్రయత్నం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకూడదని అన్నారు.
Rice Millers.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించాలని తెలిపారు.అవసరమగు లారీలు సమకూర్చాలని జిల్లా రవాణా అధికారిను కలెక్టర్ ఆదేశించారు. హమాలీల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లుల వద్ద సకాలంలో అన్‌లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షించాలన్నారు. తగినంత టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ సమీక్ష లో ఆదనవు కలెక్టర్ సంధ్యా రాణి, నర్సంపేట మార్కేట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ ఉమారాణి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా.. హైదరాబాదులోని సికింద్రాబాద్ బల్మర్ క్లాసిక్ గార్డెన్ లో సోమవారం దళిత రత్న అవార్డుల ప్రధానం చేశారు. బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షులు చింతల రాజలింగం ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కళ్లెం యాదయ్యకు దళితరత్న అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు ఉత్సవాల సందర్భంగా తనకు దళిత రత్న అవార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
దుగ్గొండి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనుల పరిశీలన..
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో రామ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ చేసుకోండి. బిల్లులు కూడా వెంటనే చెల్లించబడతాయని లబ్ధిదారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన ఇనాగ్రేషన్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తానని లబ్ధిదారులతో కలెక్టర్ వివరించారు.
Collector Dr. Satya Sarada..
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రావిచంద్రా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి,హౌసింగ్ పీడీ గణపతి, డిఇ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర…. మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మొగుళ్ళపల్లి మండలం, పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు, గండ్ర వీరాభిమాని బోయిని స్వామి గారి తమ్ముడు బోయినిరాములు – స్వరూప గార్ల కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్ని నూతన దంపతులను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .
వారి వెంట మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, నాయకులు బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి, చెక్క శ్రీధర్ గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, రాజేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నేర్పాటి శ్రీనివాస్, యూత్ ఉపాధ్యక్షులు జన్ని రాజు, మాజీ కో ఆప్షన్ నెంబర్ రహీం, సీనియర్ నాయకులు గుండారపు రాజు, బండి కుమార్ స్వామి, తిమ్మాపురం ఆనంద్, ఆకినపల్లి చిరంజీవి, మరియు గండ్ర అభిమానులు పాల్గొన్నారు
లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి
ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
లేబర్ కోడ్స్ రద్దు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ,ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్స్ విధానాన్ని అమలు చేయాలని కనీస పెన్షన్ Rs/- 9000 ఇవ్వాలని, స్కీం వర్కర్లు ను కార్మికులుగా గుర్తిస్తూ కనీస వేతనం అమలు చేయాలని హమాలి,బీడీ,భవన నిర్మాణం, ఆటో అండ్ మోటార్,తదితర రంగంలో పనిచేస్తున్న సంఘటిత కార్మికులకు సామాజిక బాధ్యత కల్పించాలని ఈ.ఎస్.ఐ,ఈ.పి.ఎఫ్, ఇన్సూరెన్స్,సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్లపై మే 20 న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు కార్మిక వర్గనికి పిలుపునిస్తుంది.
అలాగే మే 20న జరగవలసిన సమ్మెను దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని,కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
కానీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో సాధారణ పరిస్థితిలో నెలకొన్న స్థితిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వాయిదా వేయటం సరికాదని ఐ ఎఫ్ టి యు భావిస్తుంది.
ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే కేంద్ర కార్మిక సంఘాలు మే 9న ఢిల్లీలో సమావేశమైన సందర్భంలోనే నాటి నిర్దిష్ట పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే కార్మికులకు వాయిదా వేయాల్సిన విషయాన్ని అర్థం చేయించడానికి అవకాశం ఉండేది.దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగి కార్మికులు సమ్మెకు సన్నద్ధమై ఉన్న తరుణంలో అకస్మత్తుగా సమ్మెను వాయిదా వేయడం వలన కార్మికులను నిరాశ నిస్పృహ గురి చేసుకున్నది.
ఈ నిర్ణయం కార్మిక వర్గంలో కార్మిక సంఘాల పట్ల విశ్వాసం సన్నగిల్లడం కోసం దోహదపడుతుంది.
భవిష్యత్తు కాలంలో కార్మిక వర్గం సమ్మెలకు దూరంగా ఉండే ప్రమాదం ఉంటుంది.కేంద్రం మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడిని మరింత ముమ్మరంగా చేయడానికి అవకాశం ఇప్పటికే టోకెన్ సమ్మెలు, ఒక్కరోజు సమ్మె వలన కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై తాగిన ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం లేకుండా పోతున్న తరుణంలో కార్మిక వర్గంలో క్రమంగా మిలిటేన్సిని పెంచుతూ నిరవధిక సమ్మెల వైపు కార్మిక వర్గాన్ని సన్నద్ధం కర్తవ్యాన్ని కలిగి ఉండి కార్మిక సంఘాలు ముందుకు పోవాల్సిన తరుణంలో ఈ తరహా సమ్మేలను కూడా నిర్మాణాత్మకంగా నడపకపోతే కార్మికుల నుండి కార్మిక సంఘాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.సమ్మె వాయిదా పట్ల ఐ ఎఫ్ టి యు కు భిన్నభిప్రాయం ఉన్నప్పటికీ ఐక్య కార్యక్రమం పట్ల ఉన్న గౌరవం ఐక్య ఉద్యమాలకు ఉన్న ప్రాధాన్యత దృశ్య ఐక్య కార్యచరణలో నిర్దేశించుకున్న పద్ధతులకు కట్టుబడి ఉండే సంస్థగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ ఉమ్మడి పిలుపులో మా సంస్థ కూడా భాగస్వామిగా ఉన్నందున మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేస్తూ చేసిన నిర్ణయానికి కట్టుబడి మే 20 న జరగాల్సిన,నిరసన ప్రదర్శన కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్ని జిల్లాల్లో మా సంస్థ అన్ని జిల్లాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ రాష్ట్రంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐ ఎఫ్ టి యు కార్మికులను విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.
తెలంగాణ జాగృతి మహిళాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలుగా మారిపెల్లి మాధవి
ప్రగతి గ్రామైఖ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం
మరిపెడ నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా విఓఎ ఉద్యోగుల సంఘం,మరిపెడ మండల కమిటీ,ప్రగతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో చిల్లంచర్ల గ్రామంలో తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి కి ఘనంగా సన్మానించినారు. జాగృతి వ్యవస్థపాక అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మే,16, 2025 న మాధవిని నూతనంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. ఈ సందర్భంగా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వి ఓ ఎ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలమైనా నిర్మాణం చేసిన పనితనాన్ని గుర్తించిన కవిత ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కవితక్క కు కృతజ్ఞతలు తెలిపారు.
Women’s
తనకిచ్చిన బాధ్యతను అలుపెరుగకుండా,మహిళల అభివృద్ధికి, మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందని గుర్తు చేశారు,మహిళల సమస్యల మీద పోరాడుతనని, సమాజంలో మహిళపై జరిగే అఘైత్యాలు, అరాచకాలని జాగృతి తరుపున అరికడతామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వివోఏల మరిపెడ మండల అధ్యక్షులు రాంపల్లి వెంకన్న గౌడ్,కొండూరు వెంకటయ్య, నాగంజన చారి,నూక రవి, వీరన్న, శాంత కుమారి, జాగృతి నాయకులు గంధసిరి వేణు,నాగిరెడ్డి, దోమల సోమయ్య, ఈరగాని ఉపేందర్,సిరాజ్,మురళి, నూక సురేష్,వివో సభ్యులు శిరీష, రేఖ కేతమ్మ, బొల్లు రమణ, ఆశ, బొల్లు హైమా, రేఖా లింగమ్మ, మౌనిక, శోభ, ఉప్పమ్మ, వినోద, మంజుల, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం నుండి శ్రీ సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు
ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మ రావు పేట గ్రామంలో భద్రాచలం నుండి శ్రీ సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలు అందించడం జరిగింది.. ప్రతి సంవత్సరం గోటితలంబ్రాలను శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచల సీతారాముల కల్యాణానికి పంపించడం జరుగుతుంది వారు కూడా శ్రీరామనవమి కళ్యాణం తర్వాత మళ్లీ మనకు ఆ కళ్యాణ తలంబ్రాలను పంపించడం అనాదిగా వస్తుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీలక్ష్మి మేడం తలంబ్రాలను పంపించడం జరిగింది . ఈ ముత్యాల తలంబ్రాలను గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి అందించడం జరుగుతుంది దాదాపు 200 మంది జయశంకర్ జిల్లాతో పాటు ములుగు జిల్లా వారు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం జరిగింది . ధర్మరావుపేట తో పాటు బస్సు రాజు పల్లి 1000 క్వాటర్స్ తిరుమలగిరి కాశీందేవ్ పేట గ్రామాల వారికి పంపించడం జరుగుతుందని ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.