ఎంబీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.

ఎంబీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

నిరుద్యోగ ఎంబీసీ యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులను https: //www. tgobmms. cgg. gov. in 3໖ లో చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నాలుగు రోజులపాటు ఉచితంగా శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు.

నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం

నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం
. రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

 

 

మండల కేంద్రంలో
బి ఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులుసీనియర్ నాయకులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు తీసుకొని మూడు నెలలు గడిచిన ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల యువత జేబులు చిల్లుపరిచి ఇన్కమ్,క్యాస్ట్, రెసిడెన్సి సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు గురిచేసి దరఖాస్తులు పెట్టుకొని మూడు నెలలు గడిచిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కాలం వెళ్లబుచ్చుతూ యువతరాన్ని నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వెంటనే వారు ఇచ్చిన హామీల్లో భాగంగా రాజీవ్ వికాస్ పేరుతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి మేళా

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

తేదీ. 03/07/2025. గురువారం రోజున ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ నడికూడ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేళ నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గజ్జెల విమల ఆధ్వర్యంలో మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పేద నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లాజిస్టిక్స్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణానంతరము ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యందు ఉద్యోగ అవకాశం కల్పించబడును శిక్షణ కాలంలో ఉచిత భోజనము మరియు వసతి యూనిఫామ్స్ స్కాలర్షిప్ మరియు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం చే ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.ఈ అవకాశాన్ని నడికూడ మండలంలోని అన్ని గ్రామాల నుండి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ యొక్క విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మరియు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని తేదీ.03/07/2025. రోజున గురువారం ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి హాజరు కాగలరని ఎంపీడీవో గజ్జెల విమల తెలిపారు‌. పూర్తి వివరణ కోసం 9849131050,9642141539. సంప్రదించగలరు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన( డిడియు-జి కే వై ) కార్యక్రమంలో భాగంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉపాధి వైపు మళ్ళించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వ ర్యంలో ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువకులు కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సూచించారు. హైదరాబాద్ లో నాలుగు నెలలు వివిధ రంగాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ జ్ఞానాన్ని పెంచి భవి ష్యత్తులో ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకు లకు ఉపాధి కల్పించడం ప్రధానంగా తీసుకున్నారని, ఇలాంటి కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా మండల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకు న్నట్లు డిడియు- జీకే వైఅధికారులు సునీల్, శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్లా చక్రపాణి,మారేపల్లి రవీందర్ చిందంరవి,దుబాసి కృష్ణమూర్తి భాస్కర్, మారేపల్లి రాజు, కట్టయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి యువతీ యువకులు నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మన నాయకుడు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు ఆదేశాల మేరకు ఈనెల 26 తారీఖున జరగబోయే మేఘా జాబ్ మేళా కు గోపాలపురం మూర్తి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి రమాదేవి ఎ ఎస్ ఐ సమ్మిరెడ్డి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, జ్యోతి, నీలవర్ణ ఆశ వర్కర్స్ మహిళా సమైక్య CA కోడూరు ఓంకార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవిందుల భద్రయ్య హెడ్ కానిస్టేబుల్ యాకయ్య పిసి నాగరాజ్ యూత్ నాయకులు పనస రాకేష్, సునీల్ కుంచాల, కత్తి మహేష్ శ్రీకాంత్ మూల నాగరాజ్, గ్రామంలోని యువతీ యువకులు మెగా జాబ్ మేళా లో అధికసంఖ్యలో పాల్గొని 70 మంది యువతి యువకులు, పేర్లు నమోదు చేసుకున్నారు.

నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా.

నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా

పరకాల- భూపాలపల్లి ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో నిర్వహణ

సీఐ రంజిత్ రావు

శాయంపేట నేటిధాత్రి!

 

తేది: 04-04-2025 రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కావున శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువత మీ సర్టిఫికెట్లతో తప్పకుండా జాబ్ మేళాలో పాల్గొని మీకున్నటు వంటి స్కిల్స్, టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ద్వారా ఉద్యోగాలు పొందండి. జాబ్ మేళా ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కావున నిరుద్యోగ యువత అందరూ పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో
బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

కోట్లాది రూపాయల ధన
ప్రవాహంతోనే బిజెపి గెలుపు

కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలిచిన నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని, కేసులకు భయపడే కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపి కోట్లాది రూపాయలను వెదజల్లి ధన ప్రవాహంతోనే గెలిచిందని విమర్శించారు. గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే బిజెపితో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని, లోపల నుంచి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువద్దనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ బిజెపి ఒకటయ్యాయని పేర్కొన్నారు. కేసుల నుంచి బయటపడందుకే కేసీఆర్ కొత్త నాటకం ఆడారని, చేసిన పాపం ఊరికే పోదని చెప్పారు. నరేంద్ర మోడీ ఎక్కడ తమ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తాడని భయంతోనే కెసిఆర్ బిజెపికి సపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపించారు. ఆ పార్టీ రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నదని, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులకు పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వారికి ఏం న్యాయం చేశారు బిజెపి నేతలు ఆత్మవంచన చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పిట్టకథలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నారు తప్ప గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోయారని మండిపడ్డారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వం పదకోండు ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వెల్లడించాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే యాభై ఐదువేల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులకు అండగా ఉంటున్నదని, నిరుద్యోగుల పక్షపాతిగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అండగా నిలిచిన నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతో కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version