సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాల నియాత్రణే లక్ష్యంగా ప్రతి సైబర్ వారియర్స్ పని చేయాలి.
సైబర్ నేరాలు,సైబర్ నేరానికి గురైతే ఎలా స్పందించాలి అనే అంశాలపై ప్రజల్లో అవగహన కల్పించాలి.
సైబర్ నేరాలపై వచ్చే పిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని,బ్యాంకులో ఫ్రీజ్ అయి నగదు బాధితులకు అందేలా కృషి చేయాలని,సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ సూచించారు.
ఈసందర్భంగా ఎస్పీమాట్లాడుతూ…..
సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించబడ్డ సైబర్ వారియర్స్ సైబర్ నేరాలపై వచ్చే పిర్యాదులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని, సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయిన వ్యక్తులు డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నట్లయితే వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.
అనుకోని రీతిలో సైబర్ నేరానికి గురైతే ఖంగారు పడకుండా వెంటనే 1930 ఫోన్ నెంబర్ కు,NCRP potral గాని,దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఉన్న సైబర్ వారియర్ ని సంప్రదించాలన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్స్ కి ప్రత్యేకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక ఫోన్ నెంబర్ అందజేయడం జరిగిందన్నారు.
పోలీస్ స్టేషన్లలో ఉన్న సైబర్ వారియర్స్ కి అనుమానిత లింక్స్ విశ్లేషించడం,అలాగే సోషల్ మీడియా,ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేయడం వంటి వాటిపై వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్,ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు.
పోలీసు అధికారులు నేరుగా వాట్సాప్ వీడియోకాల్స్ చేయరని,డిజిటల్ అరెస్టులని కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్ల బలంగా మారిందని, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండటానికి అప్రమత్తతే ప్రధాన ఆయుధం అన్నారు.ఈసమావేశంలో జిల్లా సైబర్ సెల్ ఆర్. ఎస్.ఐ జునైద్, సైబర్ సెల్ సిబ్బంది, అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.