కుక్కల దాడుల్లో మరణించిన 20 మేకలు.

కుక్కల దాడుల్లో మరణించిన 20 మేకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ పరిది కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామంలో ముజఫర్ పటేల్ రైతుకు చెందిన మేకలపై కుక్కల దాడులతో 20 మేకలు మరణించాయని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్థికంగా పెద్దఎత్తున నష్టం జరిగిందని, తమకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో అదుకొని తమ బతుకుదేరువైన మేకల కోసం ఆర్థికంగా ఆదుకుంటూ తమకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. కుక్కల దాడుల్లో 20 మేకలు మృతి చెందగా, మరో 5 మేకలకు గాయలయ్యాయని రైతులు తెలిపారు.

కుక్కల దాడిలో జింక మృతి.

కుక్కల దాడిలో జింక మృతి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

కుక్కలు దాడి చేసి జింకను చంపేసాయి. ఈ ఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామ శివారులో గల మామిడి తోటలో జరిగింది. స్థానికుల వివరాలు జింకను కుక్కలు వెంబడిస్తూ తరుముకుంటూ వస్తున్నా క్రమంలో రైతు సంతోష్ రెడ్డీ అది గమనించి జింకను కుక్కల నుండి రక్షించిన ఫలితం లేకుండా పోయింది. స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, సోహిల్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.

వీధిశునకం సైరవిహారం*

వీధిశునకం సైరవిహారం*
ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బాలుడిపై దాడి
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బాలుడు రామంచ అయాన్ రెండు సంవత్సరాల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు తెలిపారు హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం గతంలో కూడా పలుమార్లు వీధి కుక్కలు దాడి చేశాయని అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని గ్రామస్తులు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్.

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్
విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని జిల్లా కలెక్టర్ మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని సూచించారు. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆమె తల్లితండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు.
అనంతరం ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్ బ్యాంక్ ను కలెక్టర్ పరిశీలించారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి, వైద్య సేవల తీరుపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version