అక్రమంగా భూములను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.
తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వి సి కె పార్టీ నాయకులు.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలం కేంద్రంలో మంగళవారం రోజున వీసీకే పార్టీ నాయకులు తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలసి చల్లగరిగ గ్రామానికి 308 గల సర్వే నెంబర్ కు సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది, అన్నారు ప్రభుత్వం అణగారిన వర్గాల ప్రజలకు పేదలకు ఇచ్చిన భూములను చల్లగరిగ గ్రామానికి సంబంధించిన కొంతమంది దళారులు ఆ భూములపై ఎలాంటి హక్కు లేకుంన్నా వారు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులను సాగు చేసుకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు పి ఓ టి 1977 చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను అమ్మకూడదు కొనకూడదు అని తెలిసినా కూడా ప్రభుత్వం మీద గౌరవం లేకుండా ప్రభుత్వ అధికారులకు తెలియకుండా గ్రామంలో ఉన్న కొంతమంది అక్రమ దారుల అండదండలతో ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూములను అన్యాయంగా అమ్ముకోవడం చట్ట విరుద్ధం నేటి వరకు ఎన్ని భూములు అమ్ముకున్నారో ఇంకా మిగులు భూమి ఎంత ఉన్నది అనే విషయాలపై తక్షణమే విచారణ జరిపించి అక్రమ దారులపై తగిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని గౌరవనీయులు అయినా చిట్యాల మండలం ఎమ్మార్వో కి వివరించడం జరిగింది పలు ప్రభుత్వ భూముల విషయం విన్న ఎమ్మార్వో వెంటనే స్పందించారు తక్షణమే విచారణ జరిపించి పేద ప్రజలకు న్యాయం చేస్తానని ప్రభుత్వ భూములు కాపాడుతానని ఎమ్మార్వో హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విసికే విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యాత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ విసికే పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపెల్లి రమేష్ మరియు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు కొల్లూరి అశోక్ నోముల శివశంకర్ సిరిపెల్లి తిరుపతి సిరిపెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.