విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో మూడు దశల పోరాటం.

మొదటి దశలో భాగంగా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మండల స్థాయిలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పణ

విద్యారంగంలో పేరుకుపోయిన 51 సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం.

ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి.

317 బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి.

టి పి టీ ఎఫ్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య, కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్యల డిమాండ్ .

కేసముద్రం/ నేటి దాత్రి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వం ముందుంచిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ, ఏకీకృత సర్వీస్ రూల్స్ మొదలగు 51 అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టిపిటిఎఫ్ మహబూబాద్ జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి( యు.ఎస్.పి.సి ) చేపట్టిన మూడు దశల పోరాటం లో, మొదటగా మండల కేంద్రంలో తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించాలన్న పిలుపు మేరకు గురువారం మండలంలోని యు. ఎస్. పి. సి. భాగస్వామ్య సంఘాలైన టీ.పి.టీ. ఎఫ్, డి. టీ. ఎఫ్. సంఘాల నేతృత్వంలో కేసముద్రం మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, యు.టి. ఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, డి టి ఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలను పెండింగ్లో ఉంచిన గత ప్రభుత్వాన్ని గద్దె దించామని అన్నారు. కానీ ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వం కూడా ఆ సమస్యలను అలాగే కొనసాగించి ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చిన ఉచితాల హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పరుగులు తీస్తుందని విమర్శించారు. కానీ ఉద్యోగస్తులకు మాత్రం హక్కుగా రావాల్సిన వాటిని పెండింగ్లో పెడుతుందని వాపోయారు. విద్యారంగంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పిఆర్సి ,డి ఏ లు ప్రకటించాలని,,ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని, కస్తూరిబాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, గురుకుల వ్యవస్థను తొలగించి గ్రామాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆ రోజె అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నన్నపురాజు నరసింహరాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరి ప్రణయ్ కు మార్, జి. శ్రీనివాస్, తండా సదానందం ,జిల్లా కౌన్సిలర్ సదయ్య, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి లావుడ్యా భద్రాసింగ్, కార్యదర్శి భట్టు భద్రు, డి టి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ గంగుల శ్రీనివాస్, కార్యదర్శి సుంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో స్థానిక విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

మండల కేంద్రంలో స్థానిక విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

మిస్ చార్జీలు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ

మంగపేట:- నేటి ధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సర్వేలు చేయడం జరిగింది విద్యారంగ సమస్యలపై ఈ సర్వేలో భాగంగా జూనియర్ కాలేజ్ విద్యార్థులతో ఎం ఆర్ ఓ ఆఫీస్ వరకు ర్యాలీ మండల కమిటీ మండల ఉపాధ్యక్షులు చందు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ హాజరైన మాట్లాడుతూ జాయింట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వినతి పత్రం అందజేసి అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా మండల వ్యాప్తంగా ప్రభుత్వ బడులలో పూర్తిస్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ టీచర్, లేనటువంటి పరిస్థితి నెలకొంది అదేవిధంగా హాస్టల్లో మిస్ చార్జీలు విడుదల కాక విద్యార్థులకు పౌష్టికాహారం అందలేక బలహీన అవుతున్నారని పూర్తిస్థాయిలో తరగతి గదిలో ఫ్యాన్లు బెంచీలు కాంపౌండ్ వాల్ త్రాగునీరు సమస్య అదే విధంగా మెనూ ప్రకారంగా భోజనం హాస్టల్లో పెట్టడం లేదని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఇలా అయితే విద్యార్థులకు విష జ్వరాలు గజ్జి తామర లాంటివి అచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ , రాష్ట్రవ్యాప్తంగా 9000 కోట్ల స్కాలర్షిప్ విడుదల కాక పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని పూర్తిస్థాయిలో విద్య చదవలేక పోతున్నారు అదే క్రమంలో స్కూలు విద్యార్థులు కళాశాల విద్యార్థులు వారి యొక్క గ్రామం నుంచి వచ్చే క్రమంలో ఇసుక లారీలు ఇబ్బందికరంగా రోడ్లపై ఉన్నాయని దీనిపై అధికారులు విచారణ జరపాలి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు కళాశాల విద్యార్థులకు హాస్టల్ ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దీనిపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోకిల బాలిశ్వర్, సహకారదర్శి మధులత, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి నర్సింగరావు, కిరణ్

వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి.

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి

మోతే రాయలింగు సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు

మంచిర్యాల జులై 01 నేటి దాత్రి:

 

వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. మంగళవారం ప్రపంచ వ్యవసాయ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో అన్నదాతలు ముఖ్యంగా సన్నకారు రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు కొనుగోలు దారుల నడుమ దళారీ వ్యవస్థను నిర్మూలించనంతకాలం ప్రయోజనం ఉండదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఆహార భద్రతను కలిగించినా, రైతులకు మాత్రం ఆదాయ భద్రతను ప్రభుత్వాలు ఇవ్వలేక పోతున్నాయని అన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన సరుకులను రైతుల నుంచి ప్రభుత్వం కనీస మద్దతు ధరలతో కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రత్యేక యంత్రాంగంగా నెలకొల్పాలన్నారు.ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో దళారు వ్యవస్థను నిర్మూలించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్నారు.కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కుమ్మం సురేందర్, కలువల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యా రంగంలో మార్పు మొదలైంది నారా లోకేశ్.

విద్యా రంగంలో మార్పు మొదలైంది నారా లోకేశ్…

 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.అమరావతి, జూన్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకే రోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆయన కేబినెట్‌లో విద్య శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో విద్యా రంగంలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదవిన విద్యార్థులు మంచి ర్యాంకులు పొందారు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా తల్లికి వందనం కింద వారి ఖాతాల్లో రూ.15వేలు సైతం ప్రభుత్వం వేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి చిన్నారుల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు.

చెల్పూర్ సెక్టర్ లో పోషణ పక్వాడ్.

చెల్పూర్ సెక్టర్ లో పోషణ పక్వాడ్

సూపర్వైజర్ అప్సర సుల్తానా

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ సెక్టర్ సూపర్వైజర్ అప్సర సుల్తానా ఆధ్వర్యంలో గాంధీ నగర్ గ్రామం లో పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు ఆకుకూరలు పండ్లు పోషక విలువలను పెంపొందించుకోవడం కోసం అంగన్వాడిలో ఇచ్చేటువంటి పాలు గుడ్లు కూరగాయల తోటి అన్నము ప్రతిరోజు అంగన్వాడికి వచ్చి గర్భిణీలు బాలింతలు పిల్లలు తినాలని సూపర్వైజర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ ఆర్ కోమల దేవి కె కోమల ఏ కోమల సుజాత సునీత లలిత లత సుభద్ర జ్యోతి రమాదేవి సుమలత సుసాన్ శోభ సునీత రామ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version