కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T143001.704.wav?_=1

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు బాధితులు సహకరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెల్ 9849905923 నెంబర్ తెలిపారు ఈ మేరకు నష్టపోయే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ సహకరించిన బాధితుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణకు సహకరిస్తున్నామని బాధితుడు దన్నోజిరావ్ తెలిపారు

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T133401.870.wav?_=2

 

ఒకే కుటుంబానికి మూడు కార్పొరేషన్ లోన్లు

★చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభివృద్ధి సంస్థ స్కీములకు ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఆర్థిక సహాయం అందుతుంది, అయితే జహీరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కార్పొరేషన్ లోన్లు అధికారులు మంజూరు చేశారు. ఈ పథకాలు సాధారణంగా ఒక కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం.ఒకేసారి ఆర్థిక సహాయం అందిన తర్వాత మళ్లీ తిరిగి ఐదు సంవత్సరాల వరకు ఆ కుటుంబానికి వర్తించదు కానీ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు లోను మంజూరు చేయడంపై సార్వత్రిక ఉత్కంఠ నెలకొంది దీనిపై అధికారులు పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఒకే కుటుంబానికి చెందినవారు మూడు వేర్వేరు కార్పొరేషన్ల నుండి రుణాలు పొందడం అనేది సాధారణంగా నిబంధనలకు విరుద్ధం, దీనికి సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకోవడానికి మీరు సంబంధిత కార్పొరేషన్ కార్యాలయాలను సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే ఈ నియమాలు ఎప్పటికప్పుడు మారవచ్చు.

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకo…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T132830.504.wav?_=3

 

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకo
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అమ్మవారికి అభిషేకం ధైర్యలక్ష్మీగా భక్తులకు దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూ రిరఘునాథచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు .ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు నవరాత్రులలో అమ్మవారి కి అభిషేకము ఉంటుందని అమ్మవారికి ఒక్కరోజు అర్చన చేయించుకునే భక్తులు 100 రూపాయలు ఆలయంలో చెల్లించాలని వారు పేర్కొన్నారు మహిళలచే ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఉంటాయని వారు తెలిపారు 33 వార్డు మాజి కౌన్సిలర్ తిరుమల్ బీచుపల్లి యాదవ్ కట్టసుబ్బయ్య భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు

పి సి బి అధికారుల నిర్లక్ష్యం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T131410.024.wav?_=4

 

పి సి బి అధికారుల నిర్లక్ష్యం

◆:- దిగ్వాల్ గ్రామం లో కాలుష్య సంక్షోభానికి ఆజ్యం పోస్తోంది

పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ నుంచి విషపూరిత పొగ రావడం తో పిల్లలు మరియు పెద్దలు బాధపడుతున్నారు

◆:- ప్రజలు ప్రభుత్వ చర్యను కోరుతున్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

(టి ఎస్ ఐ టి) కాలుష్య నియంత్రణ మండలి (పిసిబీ) అధికారుల విస్తృత నిర్లక్ష్యం వల్ల పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ నుంచి వల్ల కలిగే తీవ్రమైన వాయు మరియు నీటి కాలుష్యం దిగ్వాల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.పదేపదే తనిఖీలు చేసినప్పటికీ, పరిశ్రమ విషపూరిత వాయువులు మరియు ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తూనే ఉన్నాయి, దీనివల్ల స్థానికులు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు ఉబ్బసం బారిన పడుతున్నారు. దిగ్వాల్ తోపాటు వివిధ గ్రామాలు అనేక గ్రామాల్లో ,పిల్లలు దగ్గుతుంటారు, వ్యవసాయ భూములు ఎండిపోతాయి మరియు పశువులు చనిపోతాయి. పిసిబీ అధికారులు

 

ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమ యజమానుల కీలుబొమ్మలు”గా మారారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రసాయన 54 మంది కార్మికులు మరణించిన తర్వాత కూడా, అధికారులు భద్రతా నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారు, కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు పిసిబీ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి, ప్రజల ఆగ్రహం పెరుగుతోంది.. ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకోవడంలో విఫలమైతే, ప్రజల జీవితాలు మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కూడా కూలిపోతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.పొగలు కక్కుతున్న దిగ్వాల్ పిరమల్ ఫార్మా కంపెనీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు కాలుష్య నివా రణపై అధికారులు చర్యలు తీసుకున్నపటికీ మళ్ళీ కంపెనీ రాత్రి పగలు తేడా లేకుండా మళ్ళీ పొగ వద్ద లడం జరుగుతుంది దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దిగ్వాల్లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉ న్న ఈ ఫార్మా యూనిట్, గత 2018-19లో నీటి కాలుష్యం కారణంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎ న్టీ) 2019లో రూ.8.31 కోట్ల జరిమానా విధిం చింది. ఈ జరిమానా రోజుకు రూ.60,000గా 1,3 86 రోజులకు వర్తించేలా నిర్ణయించారు.

 

PCB negligence, Digwal pollution, Piramal Pharma, toxic smoke, water pollution, villagers health issues, lung disease, skin disease, asthma, agriculture damage, cattle deaths, groundwater contamination, NGT fine, Telangana pharma hub, environmental crisis, villagers protest, corporate profits vs public health, government inaction

 

యూనిట్ చుట్టూ 1.5 కి.మీ. వరకు దక్షిణ దిశలో, తూర్పు, పడమర దిశల్లో 500 మీటర్ల వరకు భూమి, భూ గర్భ జలాలు మురికిపోయాయి. ఈ కాలుష్యం వల్ల రైతుల పొలాలు, పంటలు దెబ్బతిన్నాయి. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలోని భూగ ర్భ జలాలు మురికిగా మారాయి. ఆ నీటతో పంట లు పెంచుకుంటే, పంటలు అన్నీ చెడిపోతున్నాయి. ఆ నీటను తాగడం, వల్ల చర్మ రోగాలు, గుండె సం బంధిత వ్యాధులు వచ్చాయి. రోజూ బాటిల్లో లో నీరు కొనుగోలు చేస్తున్నాం. ఇలా ఎంతకాలం?’ అని గ్రా మస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సగం మందికి పైగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా రు. 2005 నుంచే ఈ కాలుష్యం గురించి ఫిర్యాదు లు వచ్చాయి, కానీ పూర్తి నివారణ లేదు. 2025లో కూడా పరిస్థితి మారలేదు. యూనిట్ నుంచి ఉధృత పొగలు, రాత్రి పగలు తేడా లేకుండా పొగ విడుదల లు కొనసాగుతున్నాయి. ఇటీవల బయోమాస్ బ్రికె ట్లకు మారడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గించు కుంటున్నట్టు కంపెనీ ప్రకటించింది, కానీ స్థానికు లు దీన్ని కాగితం మీద మాటలు’గా చూస్తున్నారు. గ్రామంలోనే పిరమల్ ఆరోగ్య సేవా కేంద్రం ఉం ది, కానీ కొందరు దీన్ని కాలుష్యం చేసి, నీటి ఏటీలు (వాటర్ ఏటీలు) ద్వారా లాభపడటం’గా ఆరోపిస్తు న్నారు. రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఎ) టెక్నాలజీతో నీరు సరఫరా చేస్తున్నారని, ఇది కూడా పర్యావరణానికి హాని కలిగిస్తోందని పలువురు అంటున్నారు. గ్రామ ప్రజలు 2018లో యూనిట్ విస్తరణకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా గాలి, నీరు, నేల మీద హక్కు మాకే’ అనే నినాదా లతో ఆందోళన చేశారు.

 

తెలంగాణలో ఫార్మా హబ్ గా మారుతు న్నప్పటికీ, ఈ కాలుష్య సమస్యలు రాష్ట్ర విధానాల్లో లోపాల వల్లే పెరుగుతున్నాయని ఆక్టివిస్టులు ఆరోపి స్తున్నారు. ఈ సంఘటన పై స్పందించి అధికారులుమాకు న్యాయం చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిగ్వాల్ పిరమల్ పార్మా కంపెనీ విషపూరిత వ్యర్థాలను విడుదల చేయడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు

కాలుష్య నివారణ చర్యలు ఎక్కడ?

కాలుష్య నియంత్రణ మండలి పిసిబి అధికారుల విస్తృత నిర్లక్ష్యం వల్ల దిగ్వాల్ పిరమల్ ఫార్మా కంపెనీ వల్ల కలిగే తీవ్రమైన వాయు మరియు నీటి కాలుష్యం నివాసితులు ఇబ్బంది. పడుతున్నారు. పదేపదే తనిఖీలు చేసినప్పటికీ, పరిశ్రమలు విషపూరిత వాయువులు మరియు ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తూనే ఉన్నాయి,
దీనివల్ల స్థానికులు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు ఉబ్బసం బారిన పడుతున్నారు, వ్యవసాయ భూములు ఎండిపోతాయి మరియు పశువులు చనిపోతాయి. పిసిబి అధికారులు ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమ యజమానుల “కీలుబొమ్మలు”గా మారారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య
కారక పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు పిసిలి నిర్లక్ష్యంపై విచారణ జరపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి, ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకోవడంలో విఫలమైతే, ప్రజల జీవితాలు మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కూడా కూలిపోతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

‘‘హవాలా మార్గంలో’’..’’రిజిస్ట్రార్ల లంచాలు’’!?

`‘‘నేటిధాత్రి’’ చేతిలో వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ‘‘లంచావతారుల చిట్టా’’

`ఏసీబీ అధికారులకే చుక్కలు చూపిస్తున్న లంచావతారులు

`తెలివి మీరిపోయిన రిజిస్ట్రార్లు!?

`ఏసిబికి చిక్కకుండా కొత్త కొత్త పన్నాగాలు!

`చేతికి మట్టి అంటకుండా లంచాలు!

`మార్వాడీలతో రిజిస్ట్రార్ల స్నేహాలు.

 

 

`షాపింగ్‌ మాల్స్‌లతో ఆర్థిక లావాదేవీలు!

`అధికారుల లంచాలతో నడుస్తున్న షాపింగ్‌ మాల్స్‌?

`రిజిస్టార్ల కొత్త పోకడకు పరాకాష్ట.

`ఎంత మందిని పట్టుకుంటారో చూద్దాం!

`దొరికితే వరుసగా అందరం దొరికి పోదాం?

`ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత?

`మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో మనమూ చూద్దాం!

`కోర్టుకు వెళితే కొలువు అదే వస్తుంది?

`లీవ్‌ లో ఉన్న రిజిస్టార్లు వారి అనుచరులతో జరుపుతున్న చర్చలు?

`అందరం దొరికి పోతే పని చేసేటోడు ఎవడుంటాడో చూద్దాం?

`ప్రభుత్వానికే సవాలు విసురుతున్న రిజిస్ట్రార్లు?

`రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారో!

`ఎవడొచ్చి చేస్తాడో చూద్దాం!?

`కొంతమందికి అగర్వాల్లు వీరికి అనుచరులు?

`చెప్పిన చోట ఇస్తారు? అందుకోవాల్సిన చోట అందుకుంటారు !

హైదరాబాద్‌, నేటిధాత్రి:
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని పెద్దలు ఊరికే అనలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరుల ఆటలు సాగడం లేదు. లంచాలు తీసుకోకుండా అధికారులు ఊరుకోలేరు. గతంలో బాజాప్తాగా లంచాలు తీసుకోవడం అలవాటైన ప్రాణాలు. ఒక్కసారిగా లంచాలు తీసుకోకుండా పనిచేయాలంటే వారికి చేతులు రావడం లేదు. ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చినా వారికి భయం లేదు. ఉద్యోగాలు పోతాయన్న భయం అసలే లేదు. ప్రభుత్వాదేశాలు లెక్క చేసేదేమిటన్నట్లు అవినీతి సాగిస్తూనే వున్నారు. లంచాలు తీసుకుంటూనే వున్నారు. ఓ వైపు నిత్యం పట్టుబడుతున్నా, అధికారుల్లో పెద్దగా చలనం లేదు. భయం అంతకన్నా లేదు. మహా అయితే ఏం జరుగుతుంది? నాలుగు రోజులు జైలుకెళ్తాం..అంతకు మించి జరిగేదేమీ వుండదు. ఉద్యోగమైతే పోయేది కాదు. ఎంత ఖర్చైనా సరే మళ్లీ ఉద్యోగం తెచ్చుకోవడం ఖాయం. అంతకు నాలుగు రెట్లు సంపాదించుకోవడం తధ్యమన్నట్లు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. అయితే నిత్య సంతర్పణలు సాగే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మాత్రం గతానికి భిన్నంగా లంచాల దారి మళ్లింది. లంచాలు నేరుగా తీసుకోకుండా కొత్త మార్గం అన్వేషించారు. లంచాలు మానుకునే ప్రసక్తే లేదన్నట్లు రిజిస్ట్రార్లు తయారయ్యారు. ఇప్పుడు హవాలా మార్గం ఎంచుకున్నారు. ఏసిబి అదికారులు రావడం. రెడ్‌ హాండెడ్‌గా పట్టుకోవడం. జైలుకెళ్లడం..ఈ తిప్పలంతా లేకుండా లంచాలు తీసుకొని పని చేసే కొత్త దారి వెతుక్కున్నారు. తలనొప్పి తగ్గించుకున్నారు. భయపడుతూ సంతకాలు చేయాల్సిన పని లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే పరిస్ధితులకు అనుగుణంగా మారాలి. లంచాలు తీసుకునే కొత్త దారిని వెతుక్కొవాలనుకున్నారు. మొత్తానికి సబ్‌ రిజిస్ట్రార్లు తెలివిమీరిపోయారు. ఏసిబికి చిక్కకుండా పన్నాగాలు పన్నుతున్నారు. చేతికి మట్టి అంటకుండా లంచాలు తీసుకుంటున్నారు. కనీసం అనుచరులకు కూడా తెలియకుండా చూసుకుంటున్నారు. సమాచారం ఎక్కడా లీక్‌ కాకుండా చూసుకుంటున్నారు. డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎలా పోతున్నాయో కూడా తెలియకుండానే చేతులు మారేలా చేసుకుంటున్నారు. ఇచ్చేవాడికి, పుచ్చుకునే వాడికి తప్ప మూడో వ్యక్తికి తెలియనంత గుట్టు చప్పుడు కాకుండా లంచాలు తీసుకుంటున్నారు. కడుపు నిండా తింటున్నారు. కంటి నిండా నిద్రపోతున్నారు. తెల్లారి అక్రమైనా, సక్రమైన సరే రిజిస్ట్రేషన్లకు లంచాలు లేకుండా సంతకాలు చేయడం లేదు. గతం కాన్నా దర్జాగా లంచాలు తీసుకుంటున్నారు. గతాన్ని మించి వసూలు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రిజిస్ట్రార్లు పీక్కు తింటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను లంచాల పేరుతో కాల్చుకుతింటున్నారు. ఇందుకు ఎంచుకున్న కొత్త దారి మార్వాడి. వాళ్లు ప్రజలకు కొత్త. తెలంగాణ ప్రాంతానికి కొత్త. విస్తరించిన అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలతో సఖ్యత కొత్త. వారితో హైదరాబాద్‌లో బడాబాడా మార్వాడీలతో హవాల లావాదేవీలు మొదలు పెట్టారు. తెలంగాణలో మార్వాడీల చేతుల్లో వున్న షాపింగ్‌ మాల్స్‌ యజమానులకు నేరుగా లంచాల డబ్బు చేరేలా మార్గం వేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ శాఖలో వుండే ఉద్యోగుల్లో వుండే ఐక్యత మరే ఉద్యోగుల్లోనూ కనిపించదు. ఆ ఐక్యత మళ్లీ మార్వాడీల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇదే రిజిస్ట్రార్లను, మర్వాడీలను కలిపింది. ఒక మార్వాడీకి ఇబ్బంది వస్తే, మరో మార్వాడీ సాయం చేస్తాడు. ఒక రిజిస్ట్రార్‌కు సమస్య వస్తే రిజిస్ట్రార్‌లంతా ఏకమౌతారు. ఈ మధ్య ఓ రిజిస్ట్రార్‌ కూతురు పెళ్లి చేస్తే తెలంగాణలో వున్న రిజిస్ట్రార్‌లంతా కలిసి కట్నాల కింద లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. అంటే వారిలో వుండే ఐక్యతను అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలో ఇటీవల పెద్దఎత్తున వెలుస్తున్న షాపింగ్‌ మాల్స్‌ కూడా ఉన్నత స్దాయి అదికారులు, రిజిస్ట్రార్ల లంచాల సొమ్ములతోనే వెలుస్తున్నాయి. నడుస్తున్నాయన్న విషయం తెలుస్తోంది. షాపింగ్‌ మాల్స్‌లకు అవసరమైన సరుకు కోసం లంచాల డబ్బును సమకూర్చుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇది తెలంగాణలో వున్న రిజిస్ట్రార్ల కొత్త పోడకు పరాకాష్ట అని చెప్పకతప్పదు. అంతే కాకుండా ఇలా ఏసిబీ అధికారులు పదే పదే తమపై నిఘా వల పెట్టడాన్ని సహించలేకపోతున్నారట. ఎలాగైనా పట్టుకోవాలన్న కసితో వున్న ఏసిబి అదికారులకు దొరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇలాగే నిత్యం నిఘా పెట్టి వేదిస్తే ఉద్యోగాలను వదులుకోవడానికి కూడా సిద్దమనే సంకేతాలు పంపాలన్న ఆలోచనలు చేస్తున్నారట. ఎంత మందిని పట్టుకుంటారో పట్టుకోండి? అనేలా ఏక కాలంలో కావాలనే అందరం దొరికిపోయే ప్లాన్‌ చేద్దామని కూడా అనుకుంటున్నారు. ఎంత తెలివి తక్కువ వాళ్లైనా ఇలా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. కాని రిజిస్ట్రార్లలో స్టాటజీ మరో రకంగా వుంది. అందుకే దొరికితే వరసగా దొరికిపోదాం? ఉద్యోగమైతే ఎక్కడికిపోదు. తెలంగాణలో వున్న 140 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగులే అతి తక్కువ. అందులోనూ సబ్‌ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు అంత పట్టుబడితే పని చేసే వారుండరు. ఏకంగా శాఖనే స్ధంబించిపోతుంది. మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో చూద్దామనే దాక రిజిస్ట్రార్లు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలో రిటైర్‌ అయ్యే అవకాశమున్న రిజిస్ట్రార్లను కావాలనే ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానపడుతూ కొంత మంది లాంగ్‌ లీవ్‌ పెట్టారు. వారి అనుచరులకు ఇన్‌చార్జిల బాధ్యతలు అప్పగించి వారి చేత పనులు పూర్తి చేయిస్తున్నారు. వచ్చే సంపాదనలో వాటలు తీసుకుంటున్నారు. అటు జీతాలు తీసుకుంటున్నారు. ఇటు లంచాలు తీసుకుంటున్నారు. అలా కూడా లంచాలు నేరుగా తీసుకోకుండా ఎక్కడిక్కడ కొందరు అగర్వాల్‌లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు వెళ్లి, కార్యాలయాల సమీపంలో వున్న మార్వాడీలకు ఇస్తారు. తర్వాత ఆ సొమ్మును మర్వాడీలు రిజిస్ట్రార్లకు ముట్ట జెప్పుతారు. అందుకు ప్రతి ఫలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, పట్టణాలలో మార్వాడీలకు పెద్దఎత్తున భూములు కూడా రిజిస్ట్రేషన్ల కూడా చేసిపెడుతున్నట్లు తెలుస్తోంది. దసరా, దీపావళి పండుగ వేళల్లో తెలంగాణలో కొన్ని వేల కోట్ల బట్టల వ్యాపారం సాగుతుంది. అందులో షాపింగ్‌ మాల్స్‌లోనే ఎక్కువగా జరుగుతుంది. ఇక నుంచి ఏసిబి అధికారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కాకుండా నేరుగా అన్ని షాపింగ్‌ మాల్స్‌ లావాదేవీలను పరిశీలిస్తే గుట్టంతా బైటకు వస్తుంది. మాల్స్‌ పెట్టుబడుల్లో వున్న పెద్ద పెద్ద అధికారులు, రిజిస్ట్రార్ల బాగోతమంతా వెలుగులోకి వస్తుంది. రిజిస్ట్రార్ల ఆట కట్టినట్లౌవుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాయాల మీద ఏసిబి రైడ్స్‌ చేసే సమయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునే వారు కార్యాలయానికి వచ్చే ముందు ఎక్కడికి వెళ్లి వస్తున్నారో నిఘా పెడితే మొత్తం అవినీతిని జల్లడపట్టినట్లౌవుంది.

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ…

నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరణ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

గుండాల మండల నూతన తహసీల్దార్ గా ఖాసీం బుధవారం బాధ్యతలను స్వీకరించారు . నూతన తహసీల్దార్ ఖాసీం ను తహసీల్దార్ ఆఫీస్ స్థాఫ్ సన్మానించి, స్వాగతం పలికారు.

బాలానగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ…

బాలానగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను జోగులాంబ గద్వాల జిల్లా జోన్ +7 రేంజ్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు క్రమశిక్షణతో సమయపాలనతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకొని పక్షమే స్పందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ పరిశుభ్రత కేసుల దర్యాప్తు నాణ్యత పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున గౌడ్, ఎస్సైలు లెనిన్, శివానందగౌడ్, శివ నాగేశ్వర్ నాయుడు, ఏఎస్ఐలు సుజ్ఞానం, గోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్….

ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా యాంసాని వెంకటేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
దీనిలో భాగంగా ప్రధాన కార్యదర్శి కొంరవెల్లి రమేష్, కోశాధికారి కేశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెల్లంకి వేణుగోపాల్,దోమకుంట్ల శ్రీకాంత్ లను జిల్లా అధ్యక్షులు తోట సురేష్ ప్రధానకార్యదర్శి దొడ్డ మోహన్ రావు,కోశాధికారి శ్రీరామ్ రవీందర్ వర్కింగ్ ప్రసిడెంట్ వేణిశెట్టి రఘు ఎన్నికల అధికారులు కొనిశెట్టి మునిందర్ పబ్బతి నాగభూషణం వారి ఆధ్వర్యంలో నడికూడ మారుతీ గార్డెన్స్ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీటర్లు మంజూరు చేయాలి…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీటర్లు మంజూరు చేయాలి
…మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరి లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.బుధవారం రాయికల్ పట్టణం పర్యటనలో భాగంగా ఇందిరమ్మ లబ్ధిదారులు తాము ఇంటి నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోగా విద్యుత్ శాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారని విద్యుత్ మీటర్ల మంజూరు చేయించాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాజీమంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సత్వరం స్పందించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంబంధిత జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారి సుదర్శనం,రాయికల్ విద్యుత్ శాఖ ఏఈ నవీన్ తో చరవాణిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విద్యుత్ మీటర్ల సమస్యను అడిగి తెలుసుకున్నారు.నిరుపేదలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు విద్యుత్ మీటర్ల మంజూరుకై నిబంధనలలో సడలింపుతో అర్హులైన వాళ్లకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,షాకీర్,బత్తిని భూమయ్య, దాసరి గంగాధర్,రాకేష్,సింగని రమేష్,రాజారెడ్డి,కొమ్ముల ఆదిరెడ్డి,ఏలేటి జలంధర్ రెడ్డి,కొత్తపెళ్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక వసతుల కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి…

ప్రాథమిక వసతుల కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి

రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:

 

మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో గల 3వ వార్డ్ శివాజీ నగర్ కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ కి వినతి పత్రం సమర్పించారు.వార్డులో ఇప్పటికీ సి.సి. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో బురద, మురుగు సమస్యలు అధికమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడం వలన రాత్రివేళ బయటకు వెళ్ళడం కష్టమవుతోందని నివాసులు తెలిపారు.చిన్నపాటి వర్షానికి బురదమయమై పాఠశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాన్లు, టాక్సీలు మట్టిలో దిగబడుతున్నాయని,కనీస సౌకర్యాలు కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన చేపట్టాలని వారు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడుతూ.. రాయికల్ పట్టణంలో ఎక్కడెక్కడ సిసి రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల అవసరాలు ఉన్నాయో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.వినతి పత్రం సమర్పించిన వారిలో గంగవ్వ,మానస,రమ,జ్యోతి, లక్ష్మి,లత,జయసుధ,పద్మ, రజిత,శ్వేత తదితరులు ఉన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సాయి కృష్ణ సూచించారు ఇటీవల కురు స్తున్న భారీ వర్షాలతో ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు లేకుండా చూసు కోవాలని నీరు నిలిచిన ప్రాంతా ల్లో ఈగలు దోమలు చెరి అనారోగ్యాల పాలవుతారని కచ్చి తంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు ప్రస్తుతానికి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్ దగ్గు జలుబు స్కిన్ ఇన్ఫెక్షన్లు విరోచనాలు వాంతులు రక్త కణాలు తగ్గడం లాంటి సమస్యలతో హాస్పిటల్ కు రోగులు వస్తున్నట్లు తెలి పారు ప్రజలు సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు

స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి…

స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 25 ఆస్పత్రులలో నిర్వహించే స్కానింగ్ సెంటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు
బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా మెడికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్ లతో పాటు ఇప్పటికే ఉన్న స్కానింగ్ సెంటర్లకు అనుమతి గురించి అడ్వైజర్ కమిటీ ముందు ఉంచామన్నారు ఆరోగ్యశాఖ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగినది అని తెలిపారు.
సీనియర్ సివిల్ జడ్జ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగరాజు మాట్లాడుతూ లింగ నిర్ధార పరీక్ష చేయడం చట్టరీత్యా నేరం వీరికి కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు
సెక్స్ రేషియో తక్కువగా ఉన్నటువంటి మండలాలు ఒడితల, రేగొండ,కాటారం,చెల్పూర్,మహా ముత్తారం ఆజాంనగర్, నందు విడుదలవారీగా ఆశలకు ఏఎన్ఎం లకు సమావేశం నిర్వహించి డాక్యుమెంట్ ఫిల్మ్ ద్వారా మోటివేట్ చేసే విధంగా ప్లాన్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీదేవి ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ కవిత గైనకాలజిస్ట్, డాక్టర్ అనీషా గైనకాలజిస్ డాక్టర్ సుధాకర్ పీడియాట్రిషన్, ప్రసాద్ సోషల్ వర్కర్, శ్రీదేవి డెమో, శౌరిల్లమ్మ డిపిహెచ్ఎన్ఓ మొదలగు వారు పాల్గొన్నారు

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం…

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పకీరు గడ్డ అంగన్వాడీ టీచర్ ప్రమీల ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ పోషణ మాస కార్యక్రమం అనేది ఈరోజు అంగన్వాడి సెంటర్లో నిర్వహించడం జరిగింది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి అంగన్వాడి నుండి ఇచ్చే బొడ్డును పిల్లలకు అరువుగా అందివ్వాలి. దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంగన్వాడి నుండి వచ్చే పోషణ మాస వస్తువులను ప్రతి ఒక్కటి తీసుకుంటే తల్లి తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు అలాగే
అంగన్వాడి కేంద్రమును ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ అవసరమైన సేవలు వినియోగించుకోవాలి డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు పిల్లలకు
గంటలోపు మూర్రిపాలు పట్టించాలి ఏడవ నెల నుంచి అనుబంధ ఆహారము, తల్లిపాలతో పాటుగా ఇవ్వాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో శోభారాణి ఘటన గర్భిణీలు పిల్ల తల్లులు పాల్గొన్నారు

దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలో దుర్గామాత దీక్ష తీసుకున్న స్వాములకు బుధవారం గ్రామానికి చెందిన జిపి.స్వామి స్వగృహంలో అన్నదాన బీక్షను స్వాములకు అందించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చల్మెటి నాగరాజు, ఉపాధ్యక్షులు తుమ్మలి రమేష్, కోశాధికారి బజార్ చిన్న తిరుమల్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, సదాశివలింగం, నాయిని వెంకటేశం,సిద్ధరాంరెడ్డి, రంజిత్ గౌడ్, నాయిని లక్ష్మణ్, నవీన్,శివ,కర్ణాకర్,వినయ్ గౌడ్,మహేష్,ప్రశాంత్, బూరుపల్లి శివకుమార్,చంద్రకాంత్ గౌడ్, దుర్గామాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.

పెరటి కోళ్ల పెంపకం పై అవగాహనా…c

పెరటి కోళ్ల పెంపకం పై అవగాహనా

ముత్తారం :- నేటి ధాత్రి

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా వారు పెద్దపెల్లి లోని వివిధ మండలాలలోని గ్రామాలలో పోషకాహార భద్రత మరియు మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పెరటి కోళ్ల పెంపకం మీద అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామమును కృషి విజ్ఞాన కేంద్రం మూడు సంవత్సరాల పాటు దత్తత తీసుకొని గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని రైతులు మరియు మహిళల్లో పోషకాహార భద్రతను పెంపొందించడానికి మరియు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పెరటి కోళ్ల పెంపకం మీద శిక్షణ మరియు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా పిడి డిఆర్డిఏ కాళిందిని మాట్లాడుతూ మహిళలకి అందిస్తున్న వివిధ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు అలాగే కృషి విజ్ఞాన కేంద్రం వారు పోషకాహార భద్రత లో భాగంగా షెడ్యూల్డ్ కులాల ఉపరి ప్రణాళిక కింద పెరిటి కోళ్ల పంపిణీ ని సద్వినియోగం చేసుకొని వీటిని గ్రామంలోని మహిళలు ఒక ఎంటర్ప్రైస్ గా తీర్చిదిద్దాలని మండలంలో అడివి శ్రీరాంపూర్ ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. డాక్టర్ అమాగంటి శ్రీనివాస్, పుధాన శాస్త్రవేత్త మరియు అధిపతి ,కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి జిల్లా వారు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం గ్రామాల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి రైతులకు వివరించారు. షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక కింద కృషి విజ్ఞాన కేంద్రం వారు పంపిణీ చేస్తున్న అసిల్ జాతి మేలైన పెరటి కోళ్ల పెంపకం ను గ్రామంలోని రైతులు చేపడుతూ దీనిని ఒక ఉపాధి మార్గంగా పాటించాలని అలాగే గ్రామంలోని రైతులకి వ్యవసాయ ఆధారిత సమస్యలు ఏవైనా ఉంటే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించి వారి నుండి వ్యవసాయ అభివృద్ధికి సలహాలను తీసుకోవాలని సూచించారు. ఈ అసిల్ జాతి కోళ్ళు సంవత్సరానికి 120 నుండి 140 వరకు గుడ్లను పెడుతుందని అలాగే మూడు నెలల్లో రెండున్నర కేజీల బరువు వస్తుందని దీని మాంసం కూడా మంచి రుచి కలిగి మార్కెట్లో అధిక డిమాండ్ కలిగి ఉంటుందని రైతులకు వివరించారు. ఈ అసిల్ జాతి కోళ్లకు గుడ్లను పొదిగే గుణము ఉండదు. గ్రామంలో మహిళలు ముందుకు వచ్చినట్లయితే వారికి కృషి విజ్ఞాన కేంద్రం తరఫున 100 నుండి 200 గుడ్లు కెపాసిటీ గల చిన్న హేచరీ యూనిట్ని కూడా ఇవ్వగలమని తెలియజేశారు కావున రైతులు ఈ అవకాశం ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందగలరని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఏ ఎమ్ సి వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ భాస్కర రావు డాక్టర్ వినోద్ కుమార్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ మల్లీశ్వరి తో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు

మడికొండ రామలీల మైదానంలో దసరా ఉత్సవాల వైభవం…

దసరా ఉత్సవాలు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల పునరుజ్జీవనానికి ప్రతీక…

మడికొండ రామలీల మైదానంలో అంగరంగ వైభవంగా జరగబోయే దసరా ఉత్సవాల ఏర్పాట్లు…

భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వైభవం నిండిన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానికులు సమన్వయంతో కృషి చేయాలి..

దసరా ఉత్సవాల స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ (నేటిధాత్రి):

హన్మకొండ జిల్లా కాజీపేట పరిధిలో మండల పరిధిలోని మడికొండ అయోధ్యపురం రోడ్డులో గల మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన రామలీల మైదానంలో అంగరంగ వైభవంగా జరగబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా మైదానాన్ని శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
దసరా ఉత్సవాలు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల పునరుజ్జీవనానికి ప్రతీక. ప్రజలంతా సక్రమంగా పాల్గొనేలా విద్యుత్, నీరు, పారిశుధ్యం, భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.

 

ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వైభవం నిండిన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానికులు సమన్వయంతో కృషి చేయాలన్న ఎమ్మెల్యే నాగరాజు దసరా ఉత్సవాలు ప్రతి ఇంటికీ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. సమాజంలో ఐకమత్యం, సత్సంకల్పం, ధర్మం కోసం పోరాడిన శ్రీరాముని మహోన్నతతను గుర్తుచేస్తాయి. భద్రతా బందోబస్తు వరకు అన్ని అంశాలను పక్కాగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని అందరూ గుర్తించాలి. కాబట్టి స్థానికులు, సన్నాహక కమిటీ సభ్యులు, అధికారులు కలసి పనిచేస్తే ఈ ఏడాది దసరా ఉత్సవాలు చారిత్రాత్మకంగా నిలుస్తాయి” అని వివరించారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా..

యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధ వారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో యూరియా సరఫరా, క్రాప్ బుకింగ్, ఉద్యాన పంటలు సాగు తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో యూరియా సరఫరాపై టాస్క్ ఫోర్స్ టీములు పటిష్టమైన నిఘా పెంచాలని సూచించారు. మండలాల వారిగా యూరియా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న మండలాల నివేదిక అందించాలని ఆదేశించారు.
పి.ఏ.సి.ఎస్ కేంద్రాల వద్ద రైతులకు సరిపడేంత యూరియా నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని
టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మికంగా రిటైల్ షాపుల లో తనికీలు చేపట్టాలని,
ప్రైవేటు డీలర్లు కొన్ని చోట్ల బ్లాక్ చేసే అవకాశం ఉందని పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
యూరియా కు కొరత లేదని, రాబోయే 15 రోజులు చాలా కీలకమని పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మొగుళ్ళ పల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ చేయడం జరిగిందని భూసేకరణ చేపట్టిన భూమిలో పంటలు సాగు చేపట్టకుండా అలాగే సాగులో ఉన్న పంటలు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా నిల్వలు, విక్రయాలపై నివేదికలు
ఏ రోజుకారోజు అందచేయాలని ఆదేశించారు. రైతు బీమా క్లెయిమ్స్ లో జాప్యం జరుగకుండా సత్వరమే విచారణ చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో అవసరమైన యూరియా కొరకు నివేదికలు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. అదనపు సేల్స్ పాయింట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏలు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ..

విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2025- 26 సంవత్సరానికి గాను విదేశీ విద్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.యు.ఎస్.ఎ, యు.కె,ఆస్ట్రేలియా,కెనడా, సింగపూర్,జర్మనీ,జపాన్, సౌత్ కొరియా,న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్,ప్రొఫెషనల్ కోర్సులలో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు నవంబర్ 19వ తేదీ లోగా ఆన్ లైన్ లో www.telangana.epass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.అభ్యర్థులు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులములవారై ఉండాలని, వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలని, పిజి.చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలని, టి.ఓ.ఈ.ఎఫ్.ఎల్, ఐ.ఈ.ఎల్.టి.ఎస్, జి.ఆర్.ఈ, జి.ఎం.ఎ.టి ఎక్కువ శాతం అర్హత,పాస్ పోర్ట్,వీసా కలిగి ఉండాలని,విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది ఉండాలని,ఒక కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన…

నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన

◆:- పి.రాములు నేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ నూతన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ గా విచ్చేసిన అధికారి గారికి జాగో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రాములు నేత గారు వారి కార్యవర్గంతో వెళ్లి ఘనంగా స్వాగతం పలికారు తర్వాత కార్యక్రమంలో జహీరాబాద్ లో తిష్ట వేసిన కొన్ని సమస్యలపై చర్చించగా సానుకూలంగా స్పందించిన రెవిన్యూ డివిజన్ అధికారి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసి దశలవారీగా సమస్యలను అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినారు కార్యక్రమంలో జాగో తెలంగాణ వ్యవస్థాపక ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ మహమ్మద్ ఫసియోద్దీన్ అరవింద్ పేర్ల దశరథ్ పాల్గొని రెవిన్యూ డివిజనల్ అధికారికి శాల్వా పూలమాలతో సన్మానించినారు,

error: Content is protected !!
Exit mobile version