`‘‘నేటిధాత్రి’’ చేతిలో వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ‘‘లంచావతారుల చిట్టా’’
`ఏసీబీ అధికారులకే చుక్కలు చూపిస్తున్న లంచావతారులు
`తెలివి మీరిపోయిన రిజిస్ట్రార్లు!?
`ఏసిబికి చిక్కకుండా కొత్త కొత్త పన్నాగాలు!
`చేతికి మట్టి అంటకుండా లంచాలు!
`మార్వాడీలతో రిజిస్ట్రార్ల స్నేహాలు.
`షాపింగ్ మాల్స్‌లతో ఆర్థిక లావాదేవీలు!
`అధికారుల లంచాలతో నడుస్తున్న షాపింగ్ మాల్స్?
`రిజిస్టార్ల కొత్త పోకడకు పరాకాష్ట.
`ఎంత మందిని పట్టుకుంటారో చూద్దాం!
`దొరికితే వరుసగా అందరం దొరికి పోదాం?
`ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత?
`మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో మనమూ చూద్దాం!
`కోర్టుకు వెళితే కొలువు అదే వస్తుంది?
`లీవ్ లో ఉన్న రిజిస్టార్లు వారి అనుచరులతో జరుపుతున్న చర్చలు?
`అందరం దొరికి పోతే పని చేసేటోడు ఎవడుంటాడో చూద్దాం?
`ప్రభుత్వానికే సవాలు విసురుతున్న రిజిస్ట్రార్లు?
`రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారో!
`ఎవడొచ్చి చేస్తాడో చూద్దాం!?
`కొంతమందికి అగర్వాల్లు వీరికి అనుచరులు?
`చెప్పిన చోట ఇస్తారు? అందుకోవాల్సిన చోట అందుకుంటారు !
హైదరాబాద్, నేటిధాత్రి:
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని పెద్దలు ఊరికే అనలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరుల ఆటలు సాగడం లేదు. లంచాలు తీసుకోకుండా అధికారులు ఊరుకోలేరు. గతంలో బాజాప్తాగా లంచాలు తీసుకోవడం అలవాటైన ప్రాణాలు. ఒక్కసారిగా లంచాలు తీసుకోకుండా పనిచేయాలంటే వారికి చేతులు రావడం లేదు. ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చినా వారికి భయం లేదు. ఉద్యోగాలు పోతాయన్న భయం అసలే లేదు. ప్రభుత్వాదేశాలు లెక్క చేసేదేమిటన్నట్లు అవినీతి సాగిస్తూనే వున్నారు. లంచాలు తీసుకుంటూనే వున్నారు. ఓ వైపు నిత్యం పట్టుబడుతున్నా, అధికారుల్లో పెద్దగా చలనం లేదు. భయం అంతకన్నా లేదు. మహా అయితే ఏం జరుగుతుంది? నాలుగు రోజులు జైలుకెళ్తాం..అంతకు మించి జరిగేదేమీ వుండదు. ఉద్యోగమైతే పోయేది కాదు. ఎంత ఖర్చైనా సరే మళ్లీ ఉద్యోగం తెచ్చుకోవడం ఖాయం. అంతకు నాలుగు రెట్లు సంపాదించుకోవడం తధ్యమన్నట్లు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. అయితే నిత్య సంతర్పణలు సాగే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రం గతానికి భిన్నంగా లంచాల దారి మళ్లింది. లంచాలు నేరుగా తీసుకోకుండా కొత్త మార్గం అన్వేషించారు. లంచాలు మానుకునే ప్రసక్తే లేదన్నట్లు రిజిస్ట్రార్లు తయారయ్యారు. ఇప్పుడు హవాలా మార్గం ఎంచుకున్నారు. ఏసిబి అదికారులు రావడం. రెడ్ హాండెడ్‌గా పట్టుకోవడం. జైలుకెళ్లడం..ఈ తిప్పలంతా లేకుండా లంచాలు తీసుకొని పని చేసే కొత్త దారి వెతుక్కున్నారు. తలనొప్పి తగ్గించుకున్నారు. భయపడుతూ సంతకాలు చేయాల్సిన పని లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే పరిస్ధితులకు అనుగుణంగా మారాలి. లంచాలు తీసుకునే కొత్త దారిని వెతుక్కొవాలనుకున్నారు. మొత్తానికి సబ్ రిజిస్ట్రార్లు తెలివిమీరిపోయారు. ఏసిబికి చిక్కకుండా పన్నాగాలు పన్నుతున్నారు. చేతికి మట్టి అంటకుండా లంచాలు తీసుకుంటున్నారు. కనీసం అనుచరులకు కూడా తెలియకుండా చూసుకుంటున్నారు. సమాచారం ఎక్కడా లీక్ కాకుండా చూసుకుంటున్నారు. డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎలా పోతున్నాయో కూడా తెలియకుండానే చేతులు మారేలా చేసుకుంటున్నారు. ఇచ్చేవాడికి, పుచ్చుకునే వాడికి తప్ప మూడో వ్యక్తికి తెలియనంత గుట్టు చప్పుడు కాకుండా లంచాలు తీసుకుంటున్నారు. కడుపు నిండా తింటున్నారు. కంటి నిండా నిద్రపోతున్నారు. తెల్లారి అక్రమైనా, సక్రమైన సరే రిజిస్ట్రేషన్లకు లంచాలు లేకుండా సంతకాలు చేయడం లేదు. గతం కాన్నా దర్జాగా లంచాలు తీసుకుంటున్నారు. గతాన్ని మించి వసూలు చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రిజిస్ట్రార్లు పీక్కు తింటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను లంచాల పేరుతో కాల్చుకుతింటున్నారు. ఇందుకు ఎంచుకున్న కొత్త దారి మార్వాడి. వాళ్లు ప్రజలకు కొత్త. తెలంగాణ ప్రాంతానికి కొత్త. విస్తరించిన అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలతో సఖ్యత కొత్త. వారితో హైదరాబాద్‌లో బడాబాడా మార్వాడీలతో హవాల లావాదేవీలు మొదలు పెట్టారు. తెలంగాణలో మార్వాడీల చేతుల్లో వున్న షాపింగ్ మాల్స్ యజమానులకు నేరుగా లంచాల డబ్బు చేరేలా మార్గం వేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖలో వుండే ఉద్యోగుల్లో వుండే ఐక్యత మరే ఉద్యోగుల్లోనూ కనిపించదు. ఆ ఐక్యత మళ్లీ మార్వాడీల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇదే రిజిస్ట్రార్లను, మర్వాడీలను కలిపింది. ఒక మార్వాడీకి ఇబ్బంది వస్తే, మరో మార్వాడీ సాయం చేస్తాడు. ఒక రిజిస్ట్రార్‌కు సమస్య వస్తే రిజిస్ట్రార్‌లంతా ఏకమౌతారు. ఈ మధ్య ఓ రిజిస్ట్రార్ కూతురు పెళ్లి చేస్తే తెలంగాణలో వున్న రిజిస్ట్రార్‌లంతా కలిసి కట్నాల కింద లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. అంటే వారిలో వుండే ఐక్యతను అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలో ఇటీవల పెద్దఎత్తున వెలుస్తున్న షాపింగ్ మాల్స్ కూడా ఉన్నత స్దాయి అదికారులు, రిజిస్ట్రార్ల లంచాల సొమ్ములతోనే వెలుస్తున్నాయి. నడుస్తున్నాయన్న విషయం తెలుస్తోంది. షాపింగ్ మాల్స్‌లకు అవసరమైన సరుకు కోసం లంచాల డబ్బును సమకూర్చుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇది తెలంగాణలో వున్న రిజిస్ట్రార్ల కొత్త పోడకు పరాకాష్ట అని చెప్పకతప్పదు. అంతే కాకుండా ఇలా ఏసిబీ అధికారులు పదే పదే తమపై నిఘా వల పెట్టడాన్ని సహించలేకపోతున్నారట. ఎలాగైనా పట్టుకోవాలన్న కసితో వున్న ఏసిబి అదికారులకు దొరకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇలాగే నిత్యం నిఘా పెట్టి వేదిస్తే ఉద్యోగాలను వదులుకోవడానికి కూడా సిద్దమనే సంకేతాలు పంపాలన్న ఆలోచనలు చేస్తున్నారట. ఎంత మందిని పట్టుకుంటారో పట్టుకోండి? అనేలా ఏక కాలంలో కావాలనే అందరం దొరికిపోయే ప్లాన్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. ఎంత తెలివి తక్కువ వాళ్లైనా ఇలా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. కాని రిజిస్ట్రార్లలో స్టాటజీ మరో రకంగా వుంది. అందుకే దొరికితే వరసగా దొరికిపోదాం? ఉద్యోగమైతే ఎక్కడికిపోదు. తెలంగాణలో వున్న 140 రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగులే అతి తక్కువ. అందులోనూ సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు అంత పట్టుబడితే పని చేసే వారుండరు. ఏకంగా శాఖనే స్ధంబించిపోతుంది. మనమంతా లేకుండా శాఖ ఎలా నడుస్తుందో చూద్దామనే దాక రిజిస్ట్రార్లు వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలో రిటైర్ అయ్యే అవకాశమున్న రిజిస్ట్రార్లను కావాలనే ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానపడుతూ కొంత మంది లాంగ్ లీవ్ పెట్టారు. వారి అనుచరులకు ఇన్‌చార్జిల బాధ్యతలు అప్పగించి వారి చేత పనులు పూర్తి చేయిస్తున్నారు. వచ్చే సంపాదనలో వాటలు తీసుకుంటున్నారు. అటు జీతాలు తీసుకుంటున్నారు. ఇటు లంచాలు తీసుకుంటున్నారు. అలా కూడా లంచాలు నేరుగా తీసుకోకుండా ఎక్కడిక్కడ కొందరు అగర్వాల్‌లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు వెళ్లి, కార్యాలయాల సమీపంలో వున్న మార్వాడీలకు ఇస్తారు. తర్వాత ఆ సొమ్మును మర్వాడీలు రిజిస్ట్రార్లకు ముట్ట జెప్పుతారు. అందుకు ప్రతి ఫలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, పట్టణాలలో మార్వాడీలకు పెద్దఎత్తున భూములు కూడా రిజిస్ట్రేషన్ల కూడా చేసిపెడుతున్నట్లు తెలుస్తోంది. దసరా, దీపావళి పండుగ వేళల్లో తెలంగాణలో కొన్ని వేల కోట్ల బట్టల వ్యాపారం సాగుతుంది. అందులో షాపింగ్ మాల్స్‌లోనే ఎక్కువగా జరుగుతుంది. ఇక నుంచి ఏసిబి అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కాకుండా నేరుగా అన్ని షాపింగ్ మాల్స్ లావాదేవీలను పరిశీలిస్తే గుట్టంతా బైటకు వస్తుంది. మాల్స్ పెట్టుబడుల్లో వున్న పెద్ద పెద్ద అధికారులు, రిజిస్ట్రార్ల బాగోతమంతా వెలుగులోకి వస్తుంది. రిజిస్ట్రార్ల ఆట కట్టినట్లౌవుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ కార్యాయాల మీద ఏసిబి రైడ్స్ చేసే సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వారు కార్యాలయానికి వచ్చే ముందు ఎక్కడికి వెళ్లి వస్తున్నారో నిఘా పెడితే మొత్తం అవినీతిని జల్లడపట్టినట్లౌవుంది.