ఆ.. ఉపాధ్యాయునికి జీతమేందుకు సారూ..!

ఆ.. ఉపాధ్యాయునికి జీతమేందుకు సారూ..!

తెరువని స్కూల్..విద్యార్థులు లేని టీచర్.

2016 లో మూతపడ్డ స్కూల్ కు టీచర్ నియామకం

ప్రభుత్వ జీతంతో గ్రామంలో ఎంజాయ్…

బర్ల కొట్టంగా మారినా ప్రాథమిక పాఠశాల భవనం

డీఈఓ నుండి ఆర్డర్ వచ్చేవరకు గ్రామంలోనే ఉండాలే..

నిర్లక్ష్యపు టీచర్ కు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ..

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

నిరుపేదలు చదువుకునే ప్రభుత్వ బడిని నిర్లక్ష్యంతో గాలికి వదిలేసిన ప్రభుత్వ ఉపాధ్యాయునికి జీతం ఎందుకు సారూ…అని జిల్లా విద్యాశాఖ అధికారిని గ్రామస్తులు అడుగుతున్నారు. 2016 సంవత్సరంలో మూతపడిన మా పాఠశాలకు టీచర్లు ఎలా కేటాయించారు అని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. బర్ల కొట్టంగా మారిన ప్రభుత్వ పాఠశాల నేడు విషపురుగులకు నిలయంగా మారడంతో కొన్ని ఏళ్లుగా ప్రైవేటు సదువుల కోసం గ్రామస్తుల పిల్లలు పట్టణాలకు చదువుబాట పట్టారు. చదువులు చెప్తానని గ్రామానికి వచ్చిన ప్రభుత్వ టీచర్ గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ జీతంతో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అమానుష సంఘటన వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం లైనుతండ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో పాఠశాలను సందర్శించిన నేటిధాత్రి ప్రతినిధికి పిచ్చి మొక్కలు, గడ్డివాములు, ఆరేసిన బట్టలు,పశువులు కట్టేస్తున్న ఆనవాళ్లు,చెత్తాచెదారంతో దర్శనమిచ్చింది. కనీసం రికార్డులను భద్రపరిచే గదితాళం కూడా ఆ ఉపాధ్యాయుని వద్ద ఉండకపోవడం విశేషం. పిల్లలు లేరు.. చదువు చెప్పను.. కానీ నేను ఊర్లోనే తిరుగుతా.. అంటూ పాఠశాల ఉపాధ్యాయుడు బలరాముడు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ పాఠశాల పట్ల మండల విద్యాశాఖ అధికారిని చరవాణి ద్వారా వివరణ కోరగా జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చాం ఆర్డర్ వస్తేనే వేరే స్కూల్ కు వెళ్లాలి.. లేదంటే స్కూల్ ముందరే కూర్చోవాలి అని ఆ ఉపాధ్యాయునికి ఎంఈఓ వత్తాసు పలకడం విద్య వ్యవస్థ ఎటువైపు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.

వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే .!

దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్

గంగాధర నేటిధాత్రి :

 

 

నేను భారతీయుడను- నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తమ కర్తవ్యం గా దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు.పహాల్గంలో అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి ఉసిగలిపిన పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా దేశ రక్షణ నిధికి విరాళం అందజేయాలని సూచించారు.

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల అవస్థలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలలుగా జీతాలు లేక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నో అవ స్థలు పడుతున్నారు. ఉగాది పండుగ జరుపుకోవడా నికి కూడా చేతిలో రూపాయి లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పండగ రోజున భార్య పిల్లలకు ఏమీ కొనివ్వలేని పరిస్థితులు ఎదు ర్కుంటున్నామని వాపోతున్నారు. పని దగ్గరికి వెళ్తే అక్కడ కూలీలతో ఎన్నో అవస్థలు ఉంటున్నాయని. సమయానికి సర్వర్ రాదు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని చెప్తున్నారు. రోజురోజుకు పెరుగుతు. న్న ఎండ తీవ్రత కూడా సమస్యగా మారిందన్నారు. ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ఆఫీసులో పని చేసే వారికి, ప్రతి నెల జీతాలు ఇస్తు న్నారు కానీ ఎండలో కూలీలతో కలిసి పనిచేస్తున్న తమకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మూడు నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version