విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్
మంచిర్యాల,నేటి ధాత్రి:
విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2025- 26 సంవత్సరానికి గాను విదేశీ విద్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.యు.ఎస్.ఎ, యు.కె,ఆస్ట్రేలియా,కెనడా, సింగపూర్,జర్మనీ,జపాన్, సౌత్ కొరియా,న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్,ప్రొఫెషనల్ కోర్సులలో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు నవంబర్ 19వ తేదీ లోగా ఆన్ లైన్ లో www.telangana.epass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.అభ్యర్థులు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులములవారై ఉండాలని, వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలని, పిజి.చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలని, టి.ఓ.ఈ.ఎఫ్.ఎల్, ఐ.ఈ.ఎల్.టి.ఎస్, జి.ఆర్.ఈ, జి.ఎం.ఎ.టి ఎక్కువ శాతం అర్హత,పాస్ పోర్ట్,వీసా కలిగి ఉండాలని,విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది ఉండాలని,ఒక కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.