బాలానగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ
బాలానగర్ /నేటి ధాత్రి
బాలానగర్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను జోగులాంబ గద్వాల జిల్లా జోన్ +7 రేంజ్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు క్రమశిక్షణతో సమయపాలనతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకొని పక్షమే స్పందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ పరిశుభ్రత కేసుల దర్యాప్తు నాణ్యత పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున గౌడ్, ఎస్సైలు లెనిన్, శివానందగౌడ్, శివ నాగేశ్వర్ నాయుడు, ఏఎస్ఐలు సుజ్ఞానం, గోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
