ప్రాథమిక వసతుల కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి
రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:
మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో గల 3వ వార్డ్ శివాజీ నగర్ కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ కి వినతి పత్రం సమర్పించారు.వార్డులో ఇప్పటికీ సి.సి. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో బురద, మురుగు సమస్యలు అధికమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడం వలన రాత్రివేళ బయటకు వెళ్ళడం కష్టమవుతోందని నివాసులు తెలిపారు.చిన్నపాటి వర్షానికి బురదమయమై పాఠశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాన్లు, టాక్సీలు మట్టిలో దిగబడుతున్నాయని,కనీస సౌకర్యాలు కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన చేపట్టాలని వారు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడుతూ.. రాయికల్ పట్టణంలో ఎక్కడెక్కడ సిసి రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల అవసరాలు ఉన్నాయో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.వినతి పత్రం సమర్పించిన వారిలో గంగవ్వ,మానస,రమ,జ్యోతి, లక్ష్మి,లత,జయసుధ,పద్మ, రజిత,శ్వేత తదితరులు ఉన్నారు.