ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్….

ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వెంకటేష్

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండల ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా యాంసాని వెంకటేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
దీనిలో భాగంగా ప్రధాన కార్యదర్శి కొంరవెల్లి రమేష్, కోశాధికారి కేశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వెల్లంకి వేణుగోపాల్,దోమకుంట్ల శ్రీకాంత్ లను జిల్లా అధ్యక్షులు తోట సురేష్ ప్రధానకార్యదర్శి దొడ్డ మోహన్ రావు,కోశాధికారి శ్రీరామ్ రవీందర్ వర్కింగ్ ప్రసిడెంట్ వేణిశెట్టి రఘు ఎన్నికల అధికారులు కొనిశెట్టి మునిందర్ పబ్బతి నాగభూషణం వారి ఆధ్వర్యంలో నడికూడ మారుతీ గార్డెన్స్ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీటర్లు మంజూరు చేయాలి…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీటర్లు మంజూరు చేయాలి
…మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరి లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.బుధవారం రాయికల్ పట్టణం పర్యటనలో భాగంగా ఇందిరమ్మ లబ్ధిదారులు తాము ఇంటి నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోగా విద్యుత్ శాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారని విద్యుత్ మీటర్ల మంజూరు చేయించాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాజీమంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సత్వరం స్పందించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంబంధిత జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారి సుదర్శనం,రాయికల్ విద్యుత్ శాఖ ఏఈ నవీన్ తో చరవాణిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విద్యుత్ మీటర్ల సమస్యను అడిగి తెలుసుకున్నారు.నిరుపేదలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు విద్యుత్ మీటర్ల మంజూరుకై నిబంధనలలో సడలింపుతో అర్హులైన వాళ్లకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,షాకీర్,బత్తిని భూమయ్య, దాసరి గంగాధర్,రాకేష్,సింగని రమేష్,రాజారెడ్డి,కొమ్ముల ఆదిరెడ్డి,ఏలేటి జలంధర్ రెడ్డి,కొత్తపెళ్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక వసతుల కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి…

ప్రాథమిక వసతుల కోసం మున్సిపల్ కమిషనర్ కు వినతి

రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:

 

మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో గల 3వ వార్డ్ శివాజీ నగర్ కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ కి వినతి పత్రం సమర్పించారు.వార్డులో ఇప్పటికీ సి.సి. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో బురద, మురుగు సమస్యలు అధికమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడం వలన రాత్రివేళ బయటకు వెళ్ళడం కష్టమవుతోందని నివాసులు తెలిపారు.చిన్నపాటి వర్షానికి బురదమయమై పాఠశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాన్లు, టాక్సీలు మట్టిలో దిగబడుతున్నాయని,కనీస సౌకర్యాలు కల్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన చేపట్టాలని వారు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడుతూ.. రాయికల్ పట్టణంలో ఎక్కడెక్కడ సిసి రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల అవసరాలు ఉన్నాయో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.వినతి పత్రం సమర్పించిన వారిలో గంగవ్వ,మానస,రమ,జ్యోతి, లక్ష్మి,లత,జయసుధ,పద్మ, రజిత,శ్వేత తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version