పేలిన లిక్విడ్ గ్యాస్ ట్రక్.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..

పేలిన లిక్విడ్ గ్యాస్ ట్రక్.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు

 

 

చిలీలోని రెంకా ప్రాంతలో గురువారం లిక్విడ్ గ్యాస్ రవాణా చేస్తున్న ట్రక్ పేలింది. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంటర్‌నెట్ డెస్క్: లిక్విడ్ గ్యాస్ రవాణా చేస్తున్న ట్రక్ పేలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం చిలీలో చోటుచేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఓ ట్రక్ హైవేపై లిక్విడ్ గ్యాస్ తీసుకెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రెంకా ప్రాంతలో డ్రైవర్ వాహనంపై కంట్రోల్ కోల్పోయాడు. ట్రక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత 150 నుంచి 200 మీటర్ల వరకు పడింది. దాదాపు 50 వాహనాలు ప్రమాదంలో కాలిపోయాయి.

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి..

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి

తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతేడాదే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్: పైరసీ సినిమా(Piracy movie)ల వెబ్‌సైట్ నిర్వహణ కేసులో ‘ఐబొమ్మ’ రవిని గతేడాది అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అప్పట్లో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇమ్మడి రవి బెయిల్ కోసం చాలాసార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించింది

శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్….

శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్….

జిల్లా డిసిపి ఏ భాస్కర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డిసిపి భాస్కర్ తనఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం డీసీపీ భాస్కర్ మాట్లాడారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ,ఏమైనా అలజడి జరిగితే 100
కి ఫోన్ చేయాలని అన్నారు సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కౌన్సిలర్ ల ప్రమాణ స్వీకారం రోజు జరిగిన అలజడి, మంత్రి కాన్వాయ్ వద్ద జరిగిన అలజడి సృష్టించిన వారిపై వీడియో ఫుటేజ్ ద్వారా సేకరించి కేసులు పెడతామని అన్నారు.శాంతి భద్రతలు ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని,ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ రమేష్, ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..

హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..

 

చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21: దేశవ్యాప్తంగా ఉగ్రముప్పు అంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశరాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు సమాచారం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్ర చేసినట్లు సమాచారం. నిఘావర్గాల హెచ్చరికతో ముసారంబాగ్‌, సైదాబాద్‌, మలక్‌పేట్ ప్రాంతాలపై పోలీసులు నిఘాపెట్టారు. ప్రముఖ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..

ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సిద్ధమైనట్టు నిఘావర్గాలు గుర్తించాయి. ఇస్లామాబాద్ దాడికి ప్రతీకారంగా ఎల్‌‌ఈటీ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ఎర్రకోటతోపాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్ర మూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌‌ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబులతో దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎల్ఈటీ ఈ దాడులను ప్లాన్ చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31మంది మరణించగా.. 160 మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.
గతేడాది నవంబర్ 10న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్థాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు. అంతకుముందు, పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఏకంగా 2,900 కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని భారీ ఉగ్రకుట్రను ఆదిలోనే భగ్నం చేశారు. దీంతో, తమ ప్లాన్ గురించి పోలీసులకు తెలిసిందన్న కంగారులో ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని నిఘావర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు డా.ముజమ్మిల్ షకీల్, డా.అదిల్ రాథర్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేసిన ఎంఐఎం కౌన్సిలర్ రఫీ…

విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను పంపిణీ చేసిన ఎంఐఎం కౌన్సిలర్ రఫీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని ఒక స్థానిక అధికారి 10వ తరగతి ప్రాక్టీస్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేసి, ఉజ్వల భవిష్యత్తును సాధించడానికి వారి చదువుపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు.
బిలాల్‌పూర్ కోర్ట్ స్కూల్‌లో ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ రఫీ ప్రాక్టీస్ పేపర్లను పంపిణీ చేశారు.
విద్యార్థులు రాబోయే పరీక్షలలో మంచి మార్కులు సాధించడంలో సహాయపడటం ఈ చొరవ లక్ష్యం. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం చదువుపై దృష్టి పెట్టాలని కోరారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం : ఆర్టిఏ మెంబెర్ బీమీడి జైపాల్ రెడ్డి…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం : ఆర్టిఏ మెంబెర్ బీమీడి జైపాల్ రెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

 

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయంగా ప్రజలకు అన్నిరకాల మౌలిక సదుపాయల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని ఆర్టిఏ మెంబెర్ బీమీడి జైపాల్ రెడ్డి అన్నారు. తుంకుంటలో డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులకు ప్రజా సౌకర్యర్థం ఆర్ టి సి బస్ సౌకర్యాన్ని సికింద్రాబాద్ నుండి తుంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు బస్సులు శనివారం ప్రారబించారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనుసద్వినియోగంచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సెలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్. రవీందర్ గౌడ్, సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఎండి. గౌస్ బాబా, మల్లేష్ యాదవ్, గట్టు ప్రదీప్, మధుసూదన్ రెడ్డి, బి నాగమణి, బి నర్సింగ్ యాదవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్..

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్

టీ20 ప్రపంచకప్‌ 2026 వివాదం నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌ మహమ్మద్‌ సలావుద్దీన్‌.. ఆదేశ మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌పై నిప్పులు చెరిగాడు. అతడు అబద్ధాలకోరు అంటూ విమర్శించాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026) నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్.. మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అతడు పచ్చి అబద్ధాల కోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌లో పర్యటించక పోవడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని తొలుత చెప్పిన నజ్రుల్..తర్వాత మాట మార్చాడు. ఇది ఆటగాళ్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నాడు. ఇక నజ్రుల్ యూ టర్న్ పై బంగ్లా అసిస్టెంట్ కోచ్ సలావుద్దీన్ ఫైర్ అయ్యారు.

షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత…

షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు.. కామారెడ్డిలో ఉద్రిక్తత

బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు.

జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరుపార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాల భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రమణారెడ్డి తెలిపారు. కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని, సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

ఝరాసంగం మండలం సంగెం (కె) గ్రామం లో ఇందిరమ్మ నూతన ఇల్లు ప్రారంభం..

ఝరాసంగం మండలం సంగెం (కె) గ్రామం లో ఇందిరమ్మ నూతన ఇల్లు ప్రారంభం :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం సంగెం కె లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిధులుగా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మరియూ ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ హాజరయ్యారు ఆయన చేతులమీదుగా రిబ్బన్ కటింగ్ చేయించి నూతన గృహ ప్రవేశ కార్యక్రమము నిర్వహించారు…ఈ కార్యక్రమములో ఝరాసంగం మండలం ప్రజాప్రతినిధులు వివిధ గ్రామల సర్పంచ్ లు మరియు అధ్యక్షులు,మండల పెద్దలు,నాయకులు,వివిధ సంఘనాయకులు, అధికారులు,అనాధికారులు,బంధు మిత్రులు పాల్గోని ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నూతన ఇల్లు నిర్మించుకున్న లబ్ధిధారులూ ఇంటి యాజమానులకు శుభకాంక్షలు తెలియజేసారు..

సంగారెడ్డి: వ్యక్తి అదృశ్యం.. మంజీరా నదిలో గాలింపు…

సంగారెడ్డి: వ్యక్తి అదృశ్యం.. మంజీరా నదిలో గాలింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం చాల్కీ గ్రామ శివారులో గల పాత వాటర్ ఫిల్టర్, మంజీరా నది ఒడ్డున నిన్న(శుక్రవారం) ఒక బండి, ఫోన్, దుస్తులు కనిపించాయి. అతను ఝరసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన తాటిపల్లి పాపన్న (42)గా గుర్తించారు. అతను నారాయణఖేడ్ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే అతను మంజీరా నదిలో మునిగి పోయినట్లు తెలుస్తోంది. దీంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుడి కూతురి ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లు (కూతురు).. నేను చనిపోతున్న..?

కూతురితో.. వీడియోకాల్ లో మాట్లాడుతు మంజీరాలో దూకి ఆత్మహత్య..?
ఆర్టీసీ డ్రైవర్ పాపయ్య (42) శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై
న్యాల్ కల్ మండలం, చాల్కి గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డుకు చేరుకొని.. కూతురు స్వాతి (ముద్దు పేరు పిల్లు)తో వీడియో కాల్ లో మాట్లాడుతూ.. నేను చనిపోతున్నాను.. మీరు క్షేమంగా ఉండండి.. నాకు భయం, భయంగా ఉందంటూ ఏడుస్తూ.. వీడియో కాల్ ను మాట్లాడుతూ సెల్ ఫోను ఆపివేశాడు. భయాందోళనకు గురైన కూతురు స్వాతి (18), కుమారుడు హర్ష (15), కుటుంబీకులతో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. మంజీరానది ఒడ్డున ద్విచక్ర వాహనం, దుస్తులు, పాదరక్షలు పడి ఉండడాన్ని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాలుగు సంవత్సరాల క్రితం భార్య శశిరేఖ ఆత్మహత్య…

సంతానంతో జీవనం కొనసాగిస్తున్నాడు. నారాయణఖేడ్ లోని ఓ ప్రైవేట్ అదృశ్యమైన పాపయ్య (42) భార్య శశిరేఖ (35) నాలుగు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా నారాయణఖేడ్ పట్టణంలో నివాసము అంటూ పాపయ్య.. ఇద్దరి కళాశాల, విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. కూతురు స్వాతి (18) ఇంటర్, కుమారుడు హర్ష (15) 9వ తరగతి చదువుతున్నారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ద్విచక్ర వాహనాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు.

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్: స్వంత నిధులతో బోరు బావి ఏర్పాటు..

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్: స్వంత నిధులతో బోరు బావి ఏర్పాటు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లోని 27వ వార్డు కౌన్సిలర్ నామ స్రవంతి రవికిరణ్ ఎన్నికల ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనే అసలైన రాజకీయ నాయకత్వం ఉంది” అని నిరూపించారు జహీరాబాద్లోని 27వ వార్డు కౌన్సిలర్ నామ స్రవంతి రవికిరణ్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో 27వ వార్డు ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఆమె స్వంత నిధులతో బోరు బావిని ఏర్పాటు చేయించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తానని కౌన్సిలర్ తెలిపారు. కాలనీ వాసులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు…

నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

జహీరాబాద్ నియోజకవర్గ అల్లాడి వీరేశం బట్టల దుకాణ యజమాని.అమెరికా పర్యటన ముగించుకొని జహీరాబాద్ కు వచ్చిన సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నరసింహులు గారికి కలిసిన సందర్భంగా జహీరాబాద్ నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్ గారికి ఎస్ వి షాపింగ్ మాల్ లో ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్
మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధిని మనమందరం కలిసి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలలో ప్రాధాన్యత భేదాలు వర్గ విభేదాలు ఎప్పటికీ ఉండరాదని ఆయన హితవుపలికారు. ఎన్నికల పోటీల్లో మాత్రమే పోటీ ఉండాలి గెలిచిన అనంతరం అందరూ ఐకమత్యంతో సమన్వయంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావలసి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా ప్రారంభం…

యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా ప్రారంభం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల బోరేగాం గ్రామంలో యేసుక్రీస్తు రక్షణ సువార్త సర్వ మానవాళికి పాప క్షమాపణ, నిత్యజీవం మరియు దేవునితో సమాధానాన్ని అనుగ్రహించే ఒక గొప్ప శుభవార్త. మానవులందరూ పాపం వల్ల దేవునికి దూరమయ్యారని, కానీ యేసు ప్రభువు సిలువ మరణం, పునరుత్థానం ద్వారా విశ్వాసముంచే ప్రతి ఒక్కరికీ రక్షణ, స్వస్థత మరియు విడుదల లభిస్తుందని ఇది బోధిస్తోంది. యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా సమావేశానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఝరాసంగం మండలం బోరేగాం గ్రామంలో ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు రక్షణ సువార్త మహా సమావేశంలో స్థానిక ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నాగేంద్రపాటిల్‌, అభిలాష్‌రెడ్డి, రవిపాటిల్‌, శివమణిపాటిల్‌, సోహెల్‌, అమృత్‌, జైరాజ్‌, ఇమ్రాన్‌, నాయకులు మాజీ సర్పంచ్‌ జగదీశ్వర్‌, నాగన్న, అడ్వకేట్‌ షకీల్‌, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.

శీర్షిక: ఛత్రపతి శివాజీ మహారాజ్…

శీర్షిక: ఛత్రపతి శివాజీ మహారాజ్

 

శివనేరి కొండపై ఉదయించిన సూర్యుడు
రాయగఢ్ కోటలో వెలిగిన వీరుడు

హిందూ సామ్రాజ్య స్థాపకుడు
అపర రాజకీయ దురంధరుడు

గెరిల్లా యుద్ధతంత్రంతో మొఘలులను
వణికించిన సింహానివి
పరాయి పాలనపై సింహగర్జన చేసిన సింహానివి

అన్యాయాన్ని ఎదిరించిన అజేయుడివి
పరాక్రమంతో గెలిచిన మహనీయుడివి

పిన్న వయసులోనే మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నాకోటను స్వాధీనం చేసుకొన్న యోధుడివి

చేతక్ (గుర్రం)ను అధిరోహించి
ఏ ఒక్క యుద్ధంలోనూ ఓటమి ఎరుగని యోధుడివి

ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి
ఫిబ్రవరి 19 సందర్భంగా ఆ మహనీయుడికి
ఇవే మా ఘన నివాళులు

శ్రీమతి మంజుల పత్తిపాటి(కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 93470422

ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్…

ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలో జరిగిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమం ఒక సాధారణ సేవా కార్యక్రమం కాదు… ఇది ఒక నాయకుడి దూరదృష్టి, పట్టుదల, గ్రామం పట్ల నిబద్ధతకు ప్రతీక.ఈ మహత్తర కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి –ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ గ్రామాభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు…కార్పొరేట్ సంస్థలను సంప్రదించి, ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిని వివరించి, అవసరాలను వివరంగా తెలియజేసి, ప్రతీ అంశాన్ని స్వయంగా పర్యవేక్షించి – ఈ భారీ సహాయాన్ని ఝరాసంగానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.295 బంక్ బెడ్‌లు.590 పరుపులు 4 మొబైల్ టాయిలెట్లు 130 ట్రంక్ బాక్స్‌లు 42 ఇనుప రాక్లు.కంప్యూటర్లు, ప్రింటర్లు, లైబ్రరీ సామగ్రి దోమతెరలు, ఫ్యాన్లు, బీరువాలు తదితర వసతి సామగ్రి ఇది సాధారణ సహాయం కాదు –ఇది వందలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే మహత్తర మార్పు..హాస్టల్ విద్యార్థులు ఇకపై నేలపై నిద్రపోవాల్సిన అవసరం లేదు పరిశుభ్రత మెరుగుపడుతుంది డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి
గ్రంథాలయ అభివృద్ధితో చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఇది అన్నీ సాధ్యమైంది ఎందుకంటే –
జగదీశ్వర్ గ్రామాన్ని తన కుటుంబంలా భావిస్తారు.
పదవి లేకున్నా సేవ ఆగలేదు…అధికారంలో లేకున్నా అభివృద్ధి ఆగలేదు గ్రామం కోసం ఆయన పోరాటం, పట్టుదల ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఝరాసంగం ప్రజల గర్వకారణం
సమాజ సేవకు మారుపేరు యువతకు ఆదర్శం
విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాకిరణం –
జగదీశ్వర్ ఇలాగే ఝరాసంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు

ప్రజ గుండెలో ఉండే నాయకుడు బొగ్గుల జగదీశ్వర్..

ప్రజ గుండెలో ఉండే నాయకుడు బొగ్గుల జగదీశ్వర్..

◆-: ప్రజాసేవకుడు ప్రజల కష్టం పంచుకునే నిస్వార్థ సేవకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ఝరాసంగం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీలో బలపరచడానికి ముఖ్య నాయకులుగా ఎదిగిన జగదీశ్వర్ ఎందుకంటే గ్రామంలో 60 సంవత్సరాలు పరిపాలించిన పేరు పొందిన నాయకులకు అడ్డుగోడగా నిలిచి ఝరాసంగం గ్రామంలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి సర్పంచ్ గా ఎదిగిన ఏ కేక నాయకుడు బొగ్గుల జగదీశ్వర్ రెండోసారి తన అభ్యర్థి వినోద బాలరాజును నిలబెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి రెండోసారి వినోద బాలరాజును గెలిపించడం జరిగింది గ్రామంలో సత్త ఢీకొనే నాయకుడు అంటే ఒకటే అని గ్రామస్తులు అనుకుంటున్నారు గ్రామ ప్రజలందరూ జడ్పిటిసి గా పోటీ చేసి ప్రజల మధ్యలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్న ఏకైక నాయకులు బొగ్గుల జగదీశ్వర్ అని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఢీకొనే సత్తా ఒక్కడేనని అనుకుంటున్నారు, గ్రామంలో 5 సంవత్సరాలు సర్పంచిగా పనిచేసి ప్రజల గుండెలో చోటు సంపాదించుకున్న ఇలాంటి నాయకుడు మన మధ్యలో మండల స్థాయి పదవిలో ఉండి మన అందరిని కంటికి రెప్పలాగా కాపాడే నాయకుడిని గెలిపించుకుందాం అంటున్న గ్రామ ప్రజలు

జీహెచఎంసీ విభజనపై హైకోర్టులో పిటిషన్లు

· ¹కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు

· విభజన వెనుక కాంగ్రెస్ కుట్ర: బీజేపీ, బీఆరఎస్‌ల ఆరోపణ

· అధిక రెవెన్యూ వుండే ప్రాంతాలపై ప్రభుత్వ పట్టు కోసం యత్నం: విపక్షాలు

· బీఆరఎస్, బీజేపీ మూలాలను దెబ్బకొట్టే వ్యూహం

· ఎంఐఎంకు రేవంత్ ఇస్తున్న గిఫ్ట్ ఇది: బీజేపీ

· విభజన పుణ్యమాని ఇళ్లకు అనుమతులు రాక సామాన్యులు లబోదిబో

· విభజన పేరుతో ఆగస్టు వరకు ఎన్నికలు వాయిదా వేసే వ్యూహం

· స్పెషల్ ఆఫీసర్ల నియామకం వెనుక ఆలోచన ఇదే

· బీఆరఎస్ నేత కేటీఆర్ ఆరోపణ

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 11న అధికారికంగా జీహెచఎంసీని మూడు కార్పొరేషన్లుగా విడ గొట్టిన సంగతి తెలిసిదే. ప్రభుత్వం ఈ చర్య తీసుకున్న వెంటనే దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా ఈవిధంగా విభజించడానికి ఎంచుకున్న స మయం, వివిధ జోన్లకు నిర్ణయించిన సరిహద్దుల అంశాలను సవాలు చేస్తూ ఈ లిటిగేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం జీహెచఎంసీని వరుసగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొ రేషన్లుగా విడగొట్టింది. హైదరాబాద్ కింద శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోý£్కండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లుండగా, సైబరాబాద్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖు త్బుల్లాపూర్ జోన్లు అదేవిధంగా మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్, ఉప్పల్ జోన్లను ప్రభుత్వం చేర్చింది. స్పెషల్ సెక్రటరీ జయేష్‌రంజన్‌కు ఈ మూడు కార్పొరేషన్ల బాధ్యతను ప్రభుత్వం అప్పగిస్తూ ఈనెల 10న ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలుగా 55వ నెంబరు జీవోను జారీచేసింది. ప్రస్తుతం ఈ జీవోను వ్యతిరే కిస్తూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరుపుతున్న జస్టిస్ అపరేష్‌కుమార్, జస్టిస్ జి.ఎం. మొయునిద్దీన్‌లతో కూడిన దర్మాసనం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఈనెల 19`20 తేదీల్లో అదనపు సొలిసిటర్ జనరల్ (కేంద్రం), అడ్వకేట్ జనరల్ (రాష్ట్రం)లకు దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే విభజన ప్రక్రియను నిలుపుచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తూ కేసు విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ వ్యాపారవేత్త డి.గురవారెడ్డితో పాటు మరికొందరు పిటిషన్ దారులు 55వ నెంబరు జీఓను వ్యతిరేకించడానికి కొన్ని కారణాలను స్పష్టంగా పేర్కొన్నారు. 

2025 ఆగస్టు నెలలో రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియాలు 2027లో జనగణన పూర్తయ్యే వరకు న్యాయపరిధిలో మార్పులు చేయకుండా ఇచ్చిన “ఫ్రీజింగ” ఆదేశాలను ఈ జీఓ ఉల్లంఘిస్తున్నది. వీటి ప్రకారం 2027 జనగణన పూర్తయ్యే వరకు మున్సిపల్ సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు. దీన్నిబట్టి ఈ జీఓ సెన్సెస్ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్టు స్పష్టమవుతోంది. 

ఈ ఫ్రీజ్ ఆదేశాలు 2025 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రాగా, జనగణన పూర్తయ్యే వరకు అమల్లో వుంటాయి. అందువల్ల 2026 ఫిబ్రవరి నెలలో జీహెచఎంసీని విభజిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం.

రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణాలను ఉల్లంఘించేదిగా వున్నందున్న తెలంగాణ మున్సిపాలిటీస్ సవరణ చట్టం`2026 రాజ్యాంగ విరుద్ధం. 

మున్సిపల్ పరిధుల్లో మార్పులు చేసేటప్పుడు జనాభా, ఆదాయం వంటి అంశాలను పరిగణలోకితీసుకోవాలని, అంతేకాకుండా విభజన గురించి గవర్నర్ నోటిఫికేషన్ జారీచేయాలని అటువంటిదేమీ ఇక్కడ జరగలేదని పిటిషనర్లు వాదించారు. ఇది రాజ్యాంగంలోని 243క్యు అధికరణాన్ని ఉల్లంఘించడమేనని వారు తమ వాదనలో వివరించారు. 

ఈ విభజన ప్రక్రియ రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని ఉల్లంఘించడంలేదని, ఇది జనగణకు ఏవిధంగాను అడ్డంకి కాజాలదని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే ఈ విభజనను హైకోర్టులో సవాలు చేసినప్పటికీ, సైబరాబాద్ కమిషనర్‌గా జి.శ్రీజన, మల్కాజ్‌గిరి కమిషనర్‌గా టి.వినయ్‌కష్ణారెడ్డిలు బాధ్యతలు స్వీకరించి కార్యాలయాల ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో బిజీగా వుండటం విశేషం. ఫిబ్రవరి 11న పరిపాలనా పరంగా జీహెచఎంసీని విభజిస్తూ రూపొందించిన మ్యాప్ ప్రకారం కమిషనర్లు తన పాలనా విధులను నిర్వర్తిస్తున్నారు. 

ప్రస్తుతం జీహెచఎంసీలో వున్న 300 వార్డులను మూడు కార్పొరేషన్ల పరిధిలోకి విడగొట్టారు. వీటిని ఒక్కో కార్పొరేషన్ పరిధిలోని జోన్లకిందికి చేర్చారు. ఉదాహరణకు హైదరాబాద్ కార్పొరేషన్‌లో చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, గోý£్కండ, రాజేంద్రనగర్, షంషాబాద్ జోన్లుండగా వీటిల్లో ముఖ్యమైన ప్రాంతాలు జూబిలీహిల్స్, ముషీరాబాద్, అమీర్‌పేట్, ఫలక్‌నామా, బందన్‌పేట్‌లు. ఈ కార్పొరేషన్‌ను మొత్తం 150 వార్డులు, 30 సర్కిల్స్‌గా విడగొట్టారు. 

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద శేర్‌లింగంపల్లి, కూకట్‌పల్లి, ఖుత్బుల్లాపూర్ జోన్లుండ గా మాదాపూర్, మియాపూర్, నిజాంపేట్, కొంపల్లి, మేడ్చెల్‌లు కీలక ప్రాంతాలు. ఈ కార్పొరేషన్ పరిధిలో 76 వార్డులు, 16 సర్కిళ్లు వున్నాయి. 

మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లుండగా, అల్వాల్, కాప్రా,సరూర్‌నగర్, బోడుప్పల్‌లు కీలక ప్రాంతాలు. ఇందులో మొత్తం 74 వార్డులు, 14 సర్కిల్స్ వు న్నాయి. 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆరఎస్, బీజేపీ, ఎంఐఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం, అశాస్త్రీయంగా చేస్తున్న విభజనగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా 2023 మున్సిపల్ ఎన్నికల్లో తాను దెబ్బతిన్న అర్బన్ ప్రాంతాలను దష్టిలో పెట్టుకొని,ఈసారి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వీలుగా రేవంత్ ప్రభుత్వం ఈ విభజన చేపట్టిందనిబీఆరఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఇది కేవలం కుట్రపూరితంగా ఎంఐఎంకు ఇస్తున్న బహు మానంగా బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆరఎస్ ఎమ్మెల్యే కె.పి. విy ûకానందగౌడ్ మాట్లాడుతూ మేయర్‌ను, ఎన్నికైన కార్పొరేటర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా రహస్యంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని ఆరోపించారు. ఈ ప్రక్రియవల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ మూడుకార్పొరేషన్లు స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధీనంలో వున్నాయి. అయితే ఈ విభజన ప్రక్రి య పుణ్యమాని తమ ఇళ్లకు అనుమతులు రావడంలేదని ఉప్పల్, ఖుత్బుల్లాపూర్ ప్రాంత వాసు లు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా జోన్ల పరిధులు మారిపోవడంతో ఫైళ్లను తరలించే ప్రక్రి య కొనసాగడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. 

జీహెచఎంసీలో బీఆరఎస్, బీజేపీలకు మంచి బలం వుంది. 2020 జీహెచఎంసీ ఎన్నికల్లో బీఆరఎస్ 56, బీజేపీ 48 సీట్లు గెలుచుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈవిధంగా జీహెచఎంసీని విడగొట్టడం ద్వారా ఇప్పటివరకు సువిశాలంగా వున్న ప్రాంతాలను చిన్నవిగా విడగొట్టడం వల్ల తనకు అనుకూలంగా వుంటుందని, ముఖ్యంగా సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం అమలు చేయవచ్చునన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. జంటనగరాల్లో బీఆరఎస్‌బలంగా వుంది. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని 24 అసెంబ్లీ స్థానాల్లో కాం గ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం ఈవిధంగా విభజించడం ద్వారా, బీఆరఎస్ కోటలోకి చెట్టు వేళ్ల మాదిరిగా చొచ్చుకు పోవాలన్నది రేవంత్ వ్యూహం. 

ఎంఐఎంకు ఈ విభజన ద్వారా కాంగ్రెస్ ఒక గిఫ్ట్‌ను ఇస్తున్నదని బీజేపీ ఆరోపిస్తోంది. ఉమ్మడి జీహెచఎంసీలో ఎంఐఎం బలం 23%కు మాత్రమే విస్తరించివుంది. ఇప్పుడు హైదరాబాద్‌కు 150 వార్డులు కేటాయించడమంటే, ఎంఐఎంను కింగ్‌మేకర్‌గా చేయడం తప్ప మరోటికాదని బీజేపీ నేతల వాదన. అంతేకాదు ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఎంఐఎంకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే కాకుండా, కాంగ్రెస్, ఎంఐఎంలు కలిసి మేయర్ స్థానాన్ని కైవలం చేసుకోవడానికి నెంబర్‌గేమ్ ఆడ{ం చాలా సులువుగా మారనుందని వారు పేర్కొంటున్నారు. కాగా రెవె న్యూపరంగా అత్యంత విలువైన సైబరాబాద్‌పై ప్రభుత్వం తన నియంత్రణను కొనసాగించాలను కుంటోందని బీఆరఎస్ నేత కేటీఆర్ ఆరోపిస్తున్నారు. చిన్న విస్తీర్ణంలో స్వతంత్రంగా వుండే ప్రాంతాలను చూపి కొత్త రుణాలు పొందవచ్చు. లేదా కొత్త గ్రోత్ కారిడార్లను అభివద్ధి చేయనూ వచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన “ఫ్యూచర్‌సిటీ”కి తగిన ఊపు లభింపజేసేందుకోస మే ఈ విభజన అని, కొన్ని పోలీసు విభాగాలు, అభివద్ధి పరిధి కలిగిన కొన్ని మున్సిపల్ ప్రాంతాలను ఇందులో కలిపేస్తే అభివద్ధి మరింత వేగవంతమవుతుందన్న వ్యూహం కూడా వున్నదన్నఅభిప్రాయాలున్నాయి. అంతేకాదు, ప్రభుత్వం ఇప్పుడు విభజన ప్రక్రియను మొదలుపెడితే ఇది పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుంది. స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడంలో ప్రధాన ఉద్దేశం ఇదే. పునర్మిర్మాణ ప్రక్రియ వల్ల పాలనాపరంగా ప్రభుత్వం ప్రతి ప్రాంతంలో తన ఉనికిని ప్రదర్శించగలదు. ఈ ప్రభావం ఓటర్లపై పడితీరుతుంది కనుక, ఈ ఏడాది ఆగస్టు వరకు ఎన్ని లు వాయిదా వేసే ఆలోచనతో ప్రభుత్వం వున్నదని బీఆరఎస్ ఆరోపిస్తోంది.

ఊపులో ఊపు.. గెలుపులో గెలుపు!

ముందు పరిషత్ ఎన్నికలు మేలు!

`వెనువెంటనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని “సీఎం రేవంత” ఆలోచన.

`ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేని సమయం.

`ప్రజా వ్యతిరేకత పెద్దగా లేదు.

`బీఆరఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలు జనం నమ్మడం లేదు.

`ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం తగ్గలేదు.

`బీఆరఎస్ ను నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.

`బీఆరఎస్, బీజేపీ ల వైరం ప్రజలకు అర్ధమైపోయింది.

`రెండు పార్టీల వల్ల ప్రజలకు ఉపయోగం లేదని తేలిపోయింది.

`కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు నిధులు తెచ్చే శక్తి లేదని తెలిసిపోయింది.

`బీజేపీ నాయకులను ఆ పార్టీ కార్యకర్తలు నమ్మడానికి దైర్యం చేయడం లేదు.

`ఆ పార్టీలో వున్న లుకలుకలు బీఆరఎస్ కు అనుకూలంగా మారక ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలి.

`కాంగ్రెస్ శ్రేణులు మంచి ఊపులో వున్నారు.

`ఎన్నికలకు కస్టపడి పనిచేస్తున్నారు.

`పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

`గెలుపు బాధ్యతలు నాయకులు, కార్యకర్తలు మోస్తున్నారు.

`వారికి కూడ పదవులోస్తాయన్న నమ్మకం బలపడింది.

`ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

`ఆలస్యం అమృతం విషమౌతుంది.

`వేడిలో వేడి ఎన్నికలు పూర్తి చేస్తే గట్టం గడిచిపోతుంది.

`పదేళ్ల తర్వాత పదవులోస్తే పార్టీ మరింత బలపడుతుంది.

`వచ్చే ఎన్నికలకు నాయకులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేసినట్లుఔతుంది.

హైదరాబాద్, నేటిధాత్రి:

వేడిగా వున్నప్ప్పుడే ఇనుమును వంచాలి. జనం ఆదరణ వున్నప్ప్పుడే ఎన్నికలకు వెళ్లాలన్న సూత్రాన్ని రేవంత్ సర్కార్ పక్కాగా అమలు చేస్తోంది. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతటి విజయాలను ఆరు నెలల క్రితం ఊహించలేదు. కిందిస్దాయి నుంచి పై స్దాయి దాకా ఆ నమ్మకం కలగలేదు. ఎందుకంటే ప్రతిపక్ష బిఆరఎస్ చేసిన అసత్య ప్రచారాలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయన్న భావన కాంగ్రెస్ నాయకుల్లో కనిపించింది. దాంతో స్ధానిక సంస్ధల ఎన్నికలు కావాలని కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు. సరైన సమయం చూసడి ప్రభుత్వం నిర్వహిస్తుందని అనుకున్నారు. డిల్లీ నుంచి కూడ పరిశీలకులు వచ్చి, ఎన్నికల నిర్వహణ మీద నాయకులు,కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు కూడా జరిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇది అనువైన వాతావరణం కాదనే తేల్చి చెప్పారు. ఆ సమయంలో హైడ్రా దూకుడు కొనసాగింది. పైగా ఎరువుల కొతర తీవ్రంగా వుంది. ఈ రెండు కారణాలు స్దానిక సంస్ధల ఎన్నికల మీద ప్రభావం పడతాయన్న భావన అందరూ వ్యక్తం చేశారు. అనుకోకుండా కాంగ్రెస్‌కు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వరమైంది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ నాయకులు కూడా అనుకున్నారు. ప్రచారం చేయడానికి కూడా పెద్దగా పెద్ద పెద్ద నాయకులే ఆసక్తి చూపలేదు. ఒక్కసారిగా ఎవరూ ఊహించని అభ్యర్దిని సిఎం. రేవంత్‌రెడ్ది తెరమీదకు తేవడం, స్వయంగా ఆయన ప్రచారం నిర్వహించడంతో వార్ వన్ సైడ్ అయ్యింది. అలా మారుతుందని ప్రతిపక్ష బిఆరఎస్ కలలో కూడా ఊహించలేదు. సిఎం. రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుల ముందు బిఆరఎస్ చిత్తయిపోయింది. జనంలో వ్యతిరేకత వుందన్న బిఆరఎస్ మాటలకు చెల్లు చీటి రాసింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన విజయం సాదించింది. ఎవరూ ఊహించనంత మెజార్టీ వచ్చింది. దాంతో సిఎం. రేవంత్‌రెడ్డికి మరింత విశ్వాసం పెరిగింది. సర్పంచ్ ఎన్నికలకు వెళ్లారు. ఉప ఎన్నిక గెలుపుతో వున్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగాఊపు వచ్చింది. అంతకు ముందు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదా? అన్న డైలమాలో వున్న అనేక మంది నాయకులు తర్వాత ముందుకొచ్చారు. టికెట్ నాకంటే నాకు అని పోటీ పడ్డారు. అంతగా కాంగ్రెస్ పుంజుకున్నది. నిజానికి ప్రజల్లో ప్రజా ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత లేదు. రేవంత్ సర్కారు మీద ప్రజలకు ఎలాంటి అనుమానం లేదు. కాని బిఆరఎస్‌చేసిన అసత్య ప్రచారం నిజమని కాంగ్రెస్ నాయకులే నమ్మడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్దితి వచ్చింది. జూబ్లీ ఉప ఎన్నికను ఎలా మలుపు తిప్పారో, అలాగే పంచాయితీ ఎన్నికలను కూడాసిఎం. రేవంత్‌రెడ్డి మలుపు తిప్పారు. తాను సిఎంగా వుండి ప్రచారానికి వెళ్లనని అనుకోలేదు. ప్రజల్లోకి వెళ్లారు. సభలు నిర్వహించారు. ప్రజలకు భరోసా కల్పించారు. పంచాయితీ ఎన్నికలను కూడా వార్ వన్ సైడ్ చేశారు. అప్పటికే దెబ్బమీద దెబ్బ పడుతున్న బిఆరఎస్‌కు కోలుకోలేని పరిస్తితి ఎదురయ్యేలా చేశారు. ఎన్నికలంటే బిఆరఎస్ భయం పుట్టేలా సిఎం. రేవంత్‌రెడ్డి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బిఆరఎస్‌ను కోలుకోకుండా చేస్తున్నారు. ఇక ఎన్నికలు అనే పదం బిఆరఎస్ నేతలకు నోటికి రాకుండా చేస్తున్నారు. అంతకు ముందు ఊ అంటే ఎన్నికలకు వెళ్లాలని సవాలు చేసేవారు. పంచాయితీ ఎన్నికల ఓటమి నుంచి బిఆరఎస్ తేరుకోకముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడ కూడా బిఆరఎస్‌ను చావు దెబ్బ కొట్టారు. పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తులు కాకపోవడంతో, తమ ఖాతాలో వేసుకున్నారని కాంగ్రెస్‌ను ఆడిపోసుకున్న బిఆరఎస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కూడా దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. రేవంత్ సర్కారుకు ప్రజలు అండగా వున్నారని, ఆదరిస్తున్నారని, గెలుపులు అందిస్తున్నారని తేలిపోయింది. నిజానికి జనంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెద్దగా లేదు. కాని అలాంటి వాతావరణం వున్నట్లు ఊహించుకొని అసత్య ప్రచారం చేసుకున్న బిఆరఎస్ ప్లాన్ బూమ్‌రాంగ్ అయ్యింది. డామిట్ కథ అడ్డం తిరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాదిస్తామని బిఆరఎస్ మళ్లీ పగటి కలలు కని, కారు బోల్తా పడింది. కనీసం పది శాతం చైర్మన్‌లు కూడ గెల్చుకోలేకపోయంది. ప్రజల్లో ప్రభుత్వం మీదవ్యతిరేకత వుంటే కాంగ్రెస్‌కు ముప్పై నలభై చైర్మన్‌లకన్నా దాటకూడదు. కాని ప్రతిపక్షానికి పట్టు మని ఇరవై చైర్మన్‌లు కూడా రాలేదు. అంటే ప్రజల్లో బిఆరఎస్‌కు ఆదరణ లేదన్నది తేలిపోయింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ముందు జిహెచఎంసి ఎన్నికలు నిర్వహిస్తారా? లేక పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి వుంది. ఏ ఒక ఎన్నిక మాత్రం పక్కాగా త్వరలోనే జరుగుతుంది. ఎప్ప్పుడూ ఎన్నికల వాతావరణం వుండేలా చేసి, సరికొత్త రాజకీయ వ్యూహన్ని సిఎం. రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. నిజానికి సర్పంచ్ ఎన్నికలతో పాటు, పరిషత్ ఎన్నికలు కూడా ఏక కాలంలో నిర్వహించేవారు. కాని ఇప్ప్పుడు అదును చూసి, బిఆరఎస్‌ను దెబ్బ మీద దెబ్బ లేవకుండా కొట్టాలంటే కూడా ఎన్నికలను కూడా వ్యూహాత్మకంగా నిర్వహిస్తూ సరికొత్త రాజకీయాన్ని సిఎం. రేవంత్ రెడ్డి రుచి చూపిసున్నారు. బిఆరఎస్ నాయకులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నారు. గతంలో ఎన్నికలు, ఎన్నికలు అని కలవరించిన బిఆరఎస్‌కు ఎన్నికలంటేనే చలి జ్వరం వచ్చేలా చేస్తున్నారు. కలలో కూడా బిఆరఎస్ నాయకులు ఎన్నికలంటేనే ఉలిక్కిపడేలా చేస్తున్నారు. ఇదే ఊపులో మెజార్టీ పరిషత్‌ను సొంతం చేసుకునేలా సిఎం. రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణలో పరిషత్‌లను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం వుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది ఎంత వరకు వాస్తవం కాదు. ప్రభుత్వం ఒక వేళ ఆ ఆలోచన చేసినా అది సాధ్యమయ్యే పని కాదు. ఒక వేళ అదే ఆలోచన ప్రభుత్వం చేసినా కాంగ్రెస్ నాయకులే ఊరుకోరు. ఏది ఏమైనా పరిషత్ ఎన్నికలు జరగడం అనివార్యం. నిజానికి ఒకప్ప్పుడు రెండంచెల విధానమే వుండేది. దానిని మూడంచెల విధానానికి మార్చిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్. దేశంలో ఏ రాష్ట్రంలో లేనప్ప్పుడే మూడంచెల విధానాన్ని తీసుకొచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచింది ఉమ్మడి తెలుగు రాష్ట్రం. అలాంటిది ఇప్ప్పుడు పరిషత్‌లను తొలగించి, రెండంచెల విధానం తీసుకురావడం సాద్యం కాదు. 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన ఈ విదానాన్ని మార్చే అవకాశం లేదు. 234 అదికరం ప్రకారం 73,74 రాజ్యాంగ సవరణలను మళ్లీ సవరించాల్సి వుంటుంది. అందుకు సాదారణ మెజార్టీ సరిపోదు. రెండింట మూడో వంతు సభ్యుల ఆమోదం పార్లమెంటు తెలిపితే తప్ప మార్చే అవకాశం వుండదు. అయినా ప్రజలకు మెరుగైన పాలన, పాలనా వికేంద్రీకరణల కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం మూడంచెల విదానం. దానిని మార్చడం అంటే మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లడమే అవుతుంది. అలాంటి తిరోగమనం కోరుకోవడం సరైంది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మూడంచెల విదానం తీసుకొచ్చినప్ప్పుడు ఎంపిటిసిలు, జడ్పీటీసిలు లేదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కాలంలో మండల్ పరిషత్ ప్రెసిడెంటును మండల ప్రజలంతా కలిసి ఎన్నుకునేవారు. జడ్పీ చైర్మన్‌ను జిల్లా ప్రజలంతా కలిసి ఎన్నుకునేవారు. దాని వల్ల ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఒక వేళ ఎంపిపిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌లు ఎన్నికైతే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తాయని ఆలోచన చేసి, ఈ రకమైన విదానం తెచ్చారు. అప్పటి నుంచి రెండు గ్రామాలకు ఒక్కరుగా ఎంపిటిసిలు, ప్రతి మండలం నుంచి ఒక జడ్పీటిసిలను ఎన్నుకొని, ఎంపిపిలు, జడ్పీ చైర్మన్‌లను ఎన్నుకునే విధానం తెచ్చారు. అది కూడా 73,74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. దానిని ఇప్ప్పుడు తొలగించడం అసాద్యం. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత బిఆరఎస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేసిందన్న వార్తల్లో నిజం లేదు.

తెలంగాణ కాంగ్రెస్ కు వరం.. రేవంత్, పొంగులేటి ద్వయం!

`విజేతల విశ్వరూపం.. ఎన్నికలన్నీ ఘన విజయం!
`రాజకీయ ఉక్కు సంకల్పం..రేవంత్ రెడ్డి నాయకత్వం.


`కాంగ్రెస్ కు కంచు కవచం..ఈ ఇద్దరి నాయకత్వం.
`సీఎం. రేవంత్ రెడ్డి నాయకత్వపాలనకు నిదర్శనం.


`కాలానికి ఎదురీదిన రేవంత్ రాజకీయ పోరాటం.
`రాజకీయంగా అలుపెరుగని ఆత్మ విశ్వాసం.
`సమర్థ నాయకత్వానికి సీఎం రేవంత్ చిహ్నం.
`ఒడిదొడుకులెన్ని ఎదురైనా మొక్కవోణి దైర్యం.
`ఎప్పటికైనా ఏదో ఒక రోజు తనదౌతుందన్న నమ్మకం.
`ఏకలవ్య రాజకీయాలతో రేవంత్ ఎదురు లేకుండా ఎదిగిన వైనం.
`రాజకీయ సమరంలో విజేయుడై నిలిచిన అభినవ సామ్రాజ్యం.
`తెగింపు తో రేవంత్ కు విజయాలు దాసోహం.
`కడుపు నిండా కత్తులు పెట్టుకున్న వారిని ఓడించిన చాణక్యం.
`తోడేవరు లేకున్నా తానే కోట్లమంది బలవంతులకు సమానం.
`కాంగ్రెస్ లో నెగ్గుకు రావడం అంత సులువు కానీ వ్యవహారం.
`అన్నింటినీ అధిగామిస్తూ కుర్చీ ఎక్కిన సిఎం రేవంత్ సామర్థ్యం.
`తెలంగాణా రాజకీయాలలో ఎదురు లేని రాజకీయ శక్తికి నిలువెత్తు సాక్ష్యం.
`తిరుగు లేని నాయకత్వానికి తెలంగాణా సమర నాదం.
`పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోడుతో ఐక్యతకు నిదర్శనం.
`ఖమ్మం నుంచి పొంగులేటి, పాలమూరు నుంచి సిఎం రాజకీయ వేట గెలుపుకు సంకేతం.
`పంచాయతీ ఎన్నికలతో మరింత పాటిష్టంగా నాయకత్వ ద్వయం.
`మున్సిపల్ ఎన్నికలలో ఇద్దరి తిరుగు లేని విజయం.
`కాంగ్రెస్ కు రెండు కళ్లుగా సాగుతున్న ప్రయాణం.

హైదరాబాద్, నేటిధాత్రి:
కషి వుంటే మనుషులు రుషులౌతారు. మహా పురుషులౌతారు అన్నట్లే ఈ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ తమ పట్టుదలతో ఎదిగిన వారే. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నవారే. పట్టుదలకు మారు పేరుగా నిలిచిన వారే. ఈ ఇద్దరూ ఎవరి సహాకారంతో ఎదిగిన వారు కాదు. ఎవరో నిలబెడితే తెలిచిన వారు కాదు. ఎవరికి వారు, తమ స్వంత శక్తియుక్తులతో రాజకీయాల్లోకి వచ్చినవారు. ఎదిగిన వారు. తమ శక్తి యుక్తులు ప్రదర్శించిన వారు. ఇప్ప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఆ ఇద్దరూ సిఎం. రేవంత్ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఈ ఇద్దరి రాజకీయాల్లో కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ స్వయం కషితో ఎదిగిన నాయకులు. తాము నాయకులుగా ఎదగడానికి ఎవరి దగ్గర సాగిలపడిన వారు కాదు. ఎవరినో సీట్లు కోసం ప్రాదేయపడాల్సిన అవసరాలు వచ్చిన వారు కాదు. వారి తమ శక్తి సామార్ద్యాలను నిరూపించుకొని నాయకులుగా ఎదిగినవారు. ఎదిగి నిలదొక్కుకున్నవాళ్లు. రాష్ట్ర రాజకీయాల చరిత్రను మార్చినవారు. తెలంగాణ రాజకీయ కొత్త చరిత్రను లిఖించిన వారు. అవును. ఈ ఇద్దరి రాజకీయ ప్రస్తానం అంత సాఫీగా సాగలేదు. ఎత్తులు, పల్లాలు చూడాల్సి వచ్చినా అది వారి వల్ల జరగలేదు. వారు రాటు దేలడానికి జరిగిందనే చెప్పాలి. వారి స్వయంకతాపరాదం ఏమీ లేదు. కాని నమ్మించి మోసం చేయాలనుకున్నారు. కాని మోసం చేయాలనుకున్న వారు ఆఖరుకు ఆగమయ్యారు. ఈ ఇద్దరు నాయకులు తెలంగాణలో హీరోలయ్యారు. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. పాలన సాగిస్తున్నారు. పార్టీని పట్టిష్ట పరుస్తున్నారు. పార్టీకి మరింత బలమైన పునాదులు వేస్తున్నారు. ఏ ఎన్నిక వచ్చినా పార్టీని విజయ తీరాలకు చేర్చుతున్నారు. ఎవరికి వారు తమను తాము రుజువు చేసుకుంటున్నారు. సిఎం. రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణలో తమ ప్రాభల్యాన్ని చూపిస్తున్నారు. ఎదురులేని నేతలుగా ఎదుగుతున్నారు. తిరుగులేని రాజకీయ శక్తులుగా మారుతున్నారు. ఎవరి నోట విన్నా అదే మాట అంటున్నారు. ఇద్దరి రాజకీయ ప్రస్తానాలు ఒకసారి చూసుకుంటే ఒంటరి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. ఎవరి తోడు కోసం చూడలేదు. ఎవరి అండ కోసం ఆరాటపడలేదు. ఎవరో టికెట్ ఇవ్వాలని కోరుకోలేదు. తనను తాను స్వయం ప్రకాశ శక్తిగా ఎదిగారు. ముందు ఇండిపెండెంటుగా జడ్పీటీసిగా గెలిచి తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచనలం నమోదు చేశారు. అలా జడ్పీటీసిగా ఎన్నికైన కొద్ది కాలానికే ఏకంగా స్దానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఎన్నికై అందరి దష్టిని ఆకర్షించారు. ఏ పార్టీ అండ లేకుండా, రాజకీయ పార్టీలకు దీటైన రాజకీయం ఆనాడే చేశారు. బలమైన పార్టీలను ఆనాడే డీకొన్నారు. ఎవరూ ఊహించని విజయం సాదించారు. సహజంగా పట్టభద్రుల ఎన్నికలో ఇండిపెండెంట్లు విజయం సాధించడం ఒక వేరు. కాని పార్టీ సభ్యులు తమ పార్టీలకు కాదని, ఇండిపెండెంటుగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డిని గెలిపించడం అంటే మాటలు కాదు. ఆ విజయం అంత సామాన్యమైంది కాదు. అలా గెలిచిన రేవంత్‌రెడ్డిని అప్పటి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది. పార్టీలో చేర్చుకున్నది. ఆ తర్వాత 2009లో అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అతి తక్కువ సమయంలో జడ్పీటిసి, ఎమ్మెల్సీ, ఆ వెంటనే ఎమ్మెల్యే అయిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. జడ్పీటీసిగా పూర్తి కాలం పనిచేయాల్సిన అసవరం రాలేదు. ఎమ్మెల్సీగా పూర్తి కాలం అవసరం లేకుండాపోయింది. ఎమ్మెల్యే అయ్యే ఛాన్సు వచ్చింది. ఇలా అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అతి చిన్న వయసులోనే ఆయన రాష్ట్ర స్దాయి నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబుకు సన్నిహితుడయ్యారు. పార్టీలో సీనియర్లను దాటిపోయారు. అలా తన రాజకీయ ప్రస్తానాన్ని ఒక్కొ మెట్టు ఎంచుకుంటూ, ఎక్కుకుంటూ ముందుకు వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరుతూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. పార్లమెంటు సభ్యుడిగా వుంటూ, పార్టీ ప్రెసిడెంటు అయ్యారు. పార్టీకి వెయ్యేనుగుల బలం తెచ్చారు. ఆఖరుకు పార్టీని అదికారంలోకి తీసుకొచ్చిన నాయకుడయ్యారు. రాష్ట్రానికి రెండో సిఎం. అయ్యారు. తన ýక్ష్యాన్ని చేరుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్య పాలకుడుగా తన సేవ అందిస్తుందిస్తున్నారు. తాను మండలో అడుగుపెట్టిన తొలి రోజు మీరు ఏమవ్వాలని రాజకీయాలోకి వచ్చారని మరో ఎమ్మెల్సీ అడిగితే సిఎం. అవుతానని అన్నారట. అప్ప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అన్నాట్టున్నారు. అందుకే అతి తక్కువ సమయంలో రాష్ట్ర నేతగా సిఎం. రేవంత్ రెడ్డి ఎదిగారు. అయినా ఆ సీటు ఊకూకనే రాలేదు. అనేక అవరోధాలను దాటుకుంటూ వచ్చారు. అడుగడుగునా అటు సొంత పార్టీలోనూ, అప్పటి పాలకులతోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా గుండె ధైర్యం చెదరలేదు. ఆయన ఎంచుకున్న మార్గం మార్చుకోలేదు. తన దారిని మరింత రహదారి చేసుకున్నారు. ఆరు గ్యారెంటీలతో రాష్ట్రమంతా ప్రచారం చేసి, ప్రజల విశ్వాసం చూరగొని తెలంగాణ ప్రజా ప్రభుత్వ రాజ్యానికి రాజయ్యారు. ఇక మరో నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తెలంగాణ రాజకీయాలలో ఉత్తుంగ తరంగంలా దూసుకువచ్చారు. వస్తూ వస్తూనే తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకుంటూనే వచ్చారు. తొలి రాజకీయ అనుభవం, ప్రజా ప్రతినిధిగా ప్రస్తానం ఏక కాలంలో జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఎంపిగా ఎన్నికయ్యారు. తన అనుచరులను కొంత మందిని ఎమ్మెల్యేలను చేశారు. తెలంగాణవైసిపి పార్టీకి అద్యక్ష బాద్యతలు మోశారు. ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా తన ప్రస్తానం తొలి రోజు నుంచే మొదలు పెట్టారు. అలా ఎంపిగా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొంత కాలానికి అప్పటి పాలకుడు కేసిఆర్ కోరిక మేరకు, వైసిసి అదినేత ఆలోచన మేరకు బిఆరఎస్‌లో చేరారు. ఇక్కడ సిఎం. రేవంత్ విషయంలోనూ, మంత్రి పొంగులేటి రాజకీయంలోనూ ఒకే విధమైన అనుభవం వుంది. ఇద్దరు నాయకులు వారి వారి అప్పటి అదినేతలను ఒప్పించి, పార్టీ మారారే గాని, ఏనాడు ఆ అదినేతలపై ఏనాడు రాజకీయ విమర్శలు చేయలేదు. అప్పటికీ ఇప్పటికీ అదే మాట నిలబడి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు కొత్త ఒరవడి నేర్పారు. సహజంగా పార్టీలు మారగానే ఆ పార్టీల అదినేతలను తూర్పారపడుతూ రాజకీయాలు చేస్తుంటారు. కాని ఈ ఇద్దరు నేతలు అందుకు భిన్నం. వారి రాజకీయాలే వేరు. వారు వేసే అడుగులే వేరు. వారిద్దరూ వేసే ఎత్తుగడలే వేరు. ఎవరికీ అందని రాజకీయ వ్యూహాలు రచించడంలోనూ ఈ ఇద్దరిని మించిన వారు లేరు. నమ్మించి మోసం చేసిన వారిని ఈ ఇద్దరూ వదిలిపెట్టరు. శపధం చేసి మరీ వారిని ఎదుర్కొంటారు. 2014లో బిఆరఎస్‌లో ఒక్క మాటతో చేరిన పొంగులేటిని 2018 ఎన్నికల్లో అసెంబ్లీకి కేసిఆర్ అవకాశమివ్వలేదు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ అవకాశం కల్పించలేదు. అయినా ఎంతో ఓపికతో తన పార్టీకి సేవ చేశారు. కాని అడుగడుగునా ఆయనను అవమానాలకు గురి చేస్తూ వచ్చారు. ఆయన ప్రాదాన్యత తగ్గిస్తూ వచ్చారు. మొత్తానికి పొంగులేటిని రాజకీయాలకే దూరం చేయాలన్న ఆలోచన కేసిఆర్ చేశారు. కాని పొంగులేటి మంచి తనం కేసిఆర్ గుర్తించలేదు. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి వుండే పొంగులేటిని కట్టుబానిసను చేసుకోవాలనుకున్నారు. కాని సింహంలా రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటిని బోనులో బందించాలని చూశారు. కాని కుదరలేదు. ఎక్కడున్నా సింహం, సింహంలానే వుంటుంది. అది బిఆరఎస్ గుర్తించలేదు. పొంగులేటి రాజకీయ శక్తిని తక్కువగా అంచనా వేశారు. బిఆరఎస్ నుంచి బైటకు వచ్చిన పొంగులేటిని మరింత ఇబ్బంది పెట్టాలని చూశారు. దాంతో సింహం జూలు విదిలిస్తే ఎలా వుంటుందో బిఆరఎస్‌కు చూపించారు. 2023 ఎన్నికల్లో బిఆరఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపధం చేశారు. అటు ఖమ్మంలోనూ, మొత్తం తెలంగాణలో బిఆరఎస్‌ను మట్టికరింపించారు. ఖమ్మంలో మాత్రం బిఆరఎస్‌ను జీరో చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తన ప్రస్దానాన్ని పొంగులేటి పదిలం చేసుకున్నారు. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో సిఎం. రేవంత్‌తో కలిసి బిఆరఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version