సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి
తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతేడాదే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్: పైరసీ సినిమా(Piracy movie)ల వెబ్సైట్ నిర్వహణ కేసులో ‘ఐబొమ్మ’ రవిని గతేడాది అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అప్పట్లో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇమ్మడి రవి బెయిల్ కోసం చాలాసార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించింది
