`విజేతల విశ్వరూపం.. ఎన్నికలన్నీ ఘన విజయం!
`రాజకీయ ఉక్కు సంకల్పం..రేవంత్ రెడ్డి నాయకత్వం.

`కాంగ్రెస్ కు కంచు కవచం..ఈ ఇద్దరి నాయకత్వం.
`సీఎం. రేవంత్ రెడ్డి నాయకత్వపాలనకు నిదర్శనం.
`కాలానికి ఎదురీదిన రేవంత్ రాజకీయ పోరాటం.
`రాజకీయంగా అలుపెరుగని ఆత్మ విశ్వాసం.
`సమర్థ నాయకత్వానికి సీఎం రేవంత్ చిహ్నం.
`ఒడిదొడుకులెన్ని ఎదురైనా మొక్కవోణి దైర్యం.
`ఎప్పటికైనా ఏదో ఒక రోజు తనదౌతుందన్న నమ్మకం.
`ఏకలవ్య రాజకీయాలతో రేవంత్ ఎదురు లేకుండా ఎదిగిన వైనం.
`రాజకీయ సమరంలో విజేయుడై నిలిచిన అభినవ సామ్రాజ్యం.
`తెగింపు తో రేవంత్ కు విజయాలు దాసోహం.
`కడుపు నిండా కత్తులు పెట్టుకున్న వారిని ఓడించిన చాణక్యం.
`తోడేవరు లేకున్నా తానే కోట్లమంది బలవంతులకు సమానం.
`కాంగ్రెస్ లో నెగ్గుకు రావడం అంత సులువు కానీ వ్యవహారం.
`అన్నింటినీ అధిగామిస్తూ కుర్చీ ఎక్కిన సిఎం రేవంత్ సామర్థ్యం.
`తెలంగాణా రాజకీయాలలో ఎదురు లేని రాజకీయ శక్తికి నిలువెత్తు సాక్ష్యం.
`తిరుగు లేని నాయకత్వానికి తెలంగాణా సమర నాదం.
`పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోడుతో ఐక్యతకు నిదర్శనం.
`ఖమ్మం నుంచి పొంగులేటి, పాలమూరు నుంచి సిఎం రాజకీయ వేట గెలుపుకు సంకేతం.
`పంచాయతీ ఎన్నికలతో మరింత పాటిష్టంగా నాయకత్వ ద్వయం.
`మున్సిపల్ ఎన్నికలలో ఇద్దరి తిరుగు లేని విజయం.
`కాంగ్రెస్ కు రెండు కళ్లుగా సాగుతున్న ప్రయాణం.
హైదరాబాద్, నేటిధాత్రి:
కషి వుంటే మనుషులు రుషులౌతారు. మహా పురుషులౌతారు అన్నట్లే ఈ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ తమ పట్టుదలతో ఎదిగిన వారే. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నవారే. పట్టుదలకు మారు పేరుగా నిలిచిన వారే. ఈ ఇద్దరూ ఎవరి సహాకారంతో ఎదిగిన వారు కాదు. ఎవరో నిలబెడితే తెలిచిన వారు కాదు. ఎవరికి వారు, తమ స్వంత శక్తియుక్తులతో రాజకీయాల్లోకి వచ్చినవారు. ఎదిగిన వారు. తమ శక్తి యుక్తులు ప్రదర్శించిన వారు. ఇప్ప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఆ ఇద్దరూ సిఎం. రేవంత్ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఈ ఇద్దరి రాజకీయాల్లో కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ స్వయం కషితో ఎదిగిన నాయకులు. తాము నాయకులుగా ఎదగడానికి ఎవరి దగ్గర సాగిలపడిన వారు కాదు. ఎవరినో సీట్లు కోసం ప్రాదేయపడాల్సిన అవసరాలు వచ్చిన వారు కాదు. వారి తమ శక్తి సామార్ద్యాలను నిరూపించుకొని నాయకులుగా ఎదిగినవారు. ఎదిగి నిలదొక్కుకున్నవాళ్లు. రాష్ట్ర రాజకీయాల చరిత్రను మార్చినవారు. తెలంగాణ రాజకీయ కొత్త చరిత్రను లిఖించిన వారు. అవును. ఈ ఇద్దరి రాజకీయ ప్రస్తానం అంత సాఫీగా సాగలేదు. ఎత్తులు, పల్లాలు చూడాల్సి వచ్చినా అది వారి వల్ల జరగలేదు. వారు రాటు దేలడానికి జరిగిందనే చెప్పాలి. వారి స్వయంకతాపరాదం ఏమీ లేదు. కాని నమ్మించి మోసం చేయాలనుకున్నారు. కాని మోసం చేయాలనుకున్న వారు ఆఖరుకు ఆగమయ్యారు. ఈ ఇద్దరు నాయకులు తెలంగాణలో హీరోలయ్యారు. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. పాలన సాగిస్తున్నారు. పార్టీని పట్టిష్ట పరుస్తున్నారు. పార్టీకి మరింత బలమైన పునాదులు వేస్తున్నారు. ఏ ఎన్నిక వచ్చినా పార్టీని విజయ తీరాలకు చేర్చుతున్నారు. ఎవరికి వారు తమను తాము రుజువు చేసుకుంటున్నారు. సిఎం. రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణలో తమ ప్రాభల్యాన్ని చూపిస్తున్నారు. ఎదురులేని నేతలుగా ఎదుగుతున్నారు. తిరుగులేని రాజకీయ శక్తులుగా మారుతున్నారు. ఎవరి నోట విన్నా అదే మాట అంటున్నారు. ఇద్దరి రాజకీయ ప్రస్తానాలు ఒకసారి చూసుకుంటే ఒంటరి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన నాయకుడు సిఎం. రేవంత్‌రెడ్డి. ఎవరి తోడు కోసం చూడలేదు. ఎవరి అండ కోసం ఆరాటపడలేదు. ఎవరో టికెట్ ఇవ్వాలని కోరుకోలేదు. తనను తాను స్వయం ప్రకాశ శక్తిగా ఎదిగారు. ముందు ఇండిపెండెంటుగా జడ్పీటీసిగా గెలిచి తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచనలం నమోదు చేశారు. అలా జడ్పీటీసిగా ఎన్నికైన కొద్ది కాలానికే ఏకంగా స్దానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఎన్నికై అందరి దష్టిని ఆకర్షించారు. ఏ పార్టీ అండ లేకుండా, రాజకీయ పార్టీలకు దీటైన రాజకీయం ఆనాడే చేశారు. బలమైన పార్టీలను ఆనాడే డీకొన్నారు. ఎవరూ ఊహించని విజయం సాదించారు. సహజంగా పట్టభద్రుల ఎన్నికలో ఇండిపెండెంట్లు విజయం సాధించడం ఒక వేరు. కాని పార్టీ సభ్యులు తమ పార్టీలకు కాదని, ఇండిపెండెంటుగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డిని గెలిపించడం అంటే మాటలు కాదు. ఆ విజయం అంత సామాన్యమైంది కాదు. అలా గెలిచిన రేవంత్‌రెడ్డిని అప్పటి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది. పార్టీలో చేర్చుకున్నది. ఆ తర్వాత 2009లో అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అతి తక్కువ సమయంలో జడ్పీటిసి, ఎమ్మెల్సీ, ఆ వెంటనే ఎమ్మెల్యే అయిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి. జడ్పీటీసిగా పూర్తి కాలం పనిచేయాల్సిన అసవరం రాలేదు. ఎమ్మెల్సీగా పూర్తి కాలం అవసరం లేకుండాపోయింది. ఎమ్మెల్యే అయ్యే ఛాన్సు వచ్చింది. ఇలా అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అతి చిన్న వయసులోనే ఆయన రాష్ట్ర స్దాయి నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబుకు సన్నిహితుడయ్యారు. పార్టీలో సీనియర్లను దాటిపోయారు. అలా తన రాజకీయ ప్రస్తానాన్ని ఒక్కొ మెట్టు ఎంచుకుంటూ, ఎక్కుకుంటూ ముందుకు వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరుతూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. పార్లమెంటు సభ్యుడిగా వుంటూ, పార్టీ ప్రెసిడెంటు అయ్యారు. పార్టీకి వెయ్యేనుగుల బలం తెచ్చారు. ఆఖరుకు పార్టీని అదికారంలోకి తీసుకొచ్చిన నాయకుడయ్యారు. రాష్ట్రానికి రెండో సిఎం. అయ్యారు. తన ýక్ష్యాన్ని చేరుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్య పాలకుడుగా తన సేవ అందిస్తుందిస్తున్నారు. తాను మండలో అడుగుపెట్టిన తొలి రోజు మీరు ఏమవ్వాలని రాజకీయాలోకి వచ్చారని మరో ఎమ్మెల్సీ అడిగితే సిఎం. అవుతానని అన్నారట. అప్ప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అన్నాట్టున్నారు. అందుకే అతి తక్కువ సమయంలో రాష్ట్ర నేతగా సిఎం. రేవంత్ రెడ్డి ఎదిగారు. అయినా ఆ సీటు ఊకూకనే రాలేదు. అనేక అవరోధాలను దాటుకుంటూ వచ్చారు. అడుగడుగునా అటు సొంత పార్టీలోనూ, అప్పటి పాలకులతోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా గుండె ధైర్యం చెదరలేదు. ఆయన ఎంచుకున్న మార్గం మార్చుకోలేదు. తన దారిని మరింత రహదారి చేసుకున్నారు. ఆరు గ్యారెంటీలతో రాష్ట్రమంతా ప్రచారం చేసి, ప్రజల విశ్వాసం చూరగొని తెలంగాణ ప్రజా ప్రభుత్వ రాజ్యానికి రాజయ్యారు. ఇక మరో నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. తెలంగాణ రాజకీయాలలో ఉత్తుంగ తరంగంలా దూసుకువచ్చారు. వస్తూ వస్తూనే తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకుంటూనే వచ్చారు. తొలి రాజకీయ అనుభవం, ప్రజా ప్రతినిధిగా ప్రస్తానం ఏక కాలంలో జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఎంపిగా ఎన్నికయ్యారు. తన అనుచరులను కొంత మందిని ఎమ్మెల్యేలను చేశారు. తెలంగాణవైసిపి పార్టీకి అద్యక్ష బాద్యతలు మోశారు. ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా తన ప్రస్తానం తొలి రోజు నుంచే మొదలు పెట్టారు. అలా ఎంపిగా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొంత కాలానికి అప్పటి పాలకుడు కేసిఆర్ కోరిక మేరకు, వైసిసి అదినేత ఆలోచన మేరకు బిఆరఎస్‌లో చేరారు. ఇక్కడ సిఎం. రేవంత్ విషయంలోనూ, మంత్రి పొంగులేటి రాజకీయంలోనూ ఒకే విధమైన అనుభవం వుంది. ఇద్దరు నాయకులు వారి వారి అప్పటి అదినేతలను ఒప్పించి, పార్టీ మారారే గాని, ఏనాడు ఆ అదినేతలపై ఏనాడు రాజకీయ విమర్శలు చేయలేదు. అప్పటికీ ఇప్పటికీ అదే మాట నిలబడి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు కొత్త ఒరవడి నేర్పారు. సహజంగా పార్టీలు మారగానే ఆ పార్టీల అదినేతలను తూర్పారపడుతూ రాజకీయాలు చేస్తుంటారు. కాని ఈ ఇద్దరు నేతలు అందుకు భిన్నం. వారి రాజకీయాలే వేరు. వారు వేసే అడుగులే వేరు. వారిద్దరూ వేసే ఎత్తుగడలే వేరు. ఎవరికీ అందని రాజకీయ వ్యూహాలు రచించడంలోనూ ఈ ఇద్దరిని మించిన వారు లేరు. నమ్మించి మోసం చేసిన వారిని ఈ ఇద్దరూ వదిలిపెట్టరు. శపధం చేసి మరీ వారిని ఎదుర్కొంటారు. 2014లో బిఆరఎస్‌లో ఒక్క మాటతో చేరిన పొంగులేటిని 2018 ఎన్నికల్లో అసెంబ్లీకి కేసిఆర్ అవకాశమివ్వలేదు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ అవకాశం కల్పించలేదు. అయినా ఎంతో ఓపికతో తన పార్టీకి సేవ చేశారు. కాని అడుగడుగునా ఆయనను అవమానాలకు గురి చేస్తూ వచ్చారు. ఆయన ప్రాదాన్యత తగ్గిస్తూ వచ్చారు. మొత్తానికి పొంగులేటిని రాజకీయాలకే దూరం చేయాలన్న ఆలోచన కేసిఆర్ చేశారు. కాని పొంగులేటి మంచి తనం కేసిఆర్ గుర్తించలేదు. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి వుండే పొంగులేటిని కట్టుబానిసను చేసుకోవాలనుకున్నారు. కాని సింహంలా రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటిని బోనులో బందించాలని చూశారు. కాని కుదరలేదు. ఎక్కడున్నా సింహం, సింహంలానే వుంటుంది. అది బిఆరఎస్ గుర్తించలేదు. పొంగులేటి రాజకీయ శక్తిని తక్కువగా అంచనా వేశారు. బిఆరఎస్ నుంచి బైటకు వచ్చిన పొంగులేటిని మరింత ఇబ్బంది పెట్టాలని చూశారు. దాంతో సింహం జూలు విదిలిస్తే ఎలా వుంటుందో బిఆరఎస్‌కు చూపించారు. 2023 ఎన్నికల్లో బిఆరఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపధం చేశారు. అటు ఖమ్మంలోనూ, మొత్తం తెలంగాణలో బిఆరఎస్‌ను మట్టికరింపించారు. ఖమ్మంలో మాత్రం బిఆరఎస్‌ను జీరో చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తన ప్రస్దానాన్ని పొంగులేటి పదిలం చేసుకున్నారు. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో సిఎం. రేవంత్‌తో కలిసి బిఆరఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నారు.